హెరాయిన్ స్వాధీనం: ముగ్గురు అరెస్ట్ | Heroin worth 6 lakh seized in Mizoram, 3 arrested | Sakshi
Sakshi News home page

హెరాయిన్ స్వాధీనం: ముగ్గురు అరెస్ట్

Published Wed, Feb 10 2016 2:40 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

Heroin worth 6 lakh seized in Mizoram, 3 arrested

ఐజాల్ : హెరాయిన్ అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను మిజోరాం ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 152 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకుని... సీజ్ చేసినట్లు మిజోరాం ఎక్సైజ్ అండ్ నార్కోటెక్స్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి బుధవారం ఐజాల్లో వెల్లడించారు.

అనంతరం వారిని విచారించగా పొరుగున ఉన్న మయన్మార్ నుంచి ఈ హెరాయిన్ చంపాయి జిల్లాలోకి అక్రమంగా తీసుకువచ్చినట్లు వారు వెల్లడించారని తెలిపారు. పట్టుబడిన వ్యక్తులపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కింద పలు సెక్షన్లు నమోదు చేసినట్లు చెప్పారు. పట్టుబడిన నిందితుల్లో ఇద్దరిది ఐజాల్ కాగా... మరోకరిది భారత్ - మయన్మార్ సరిహద్దు గ్రామమని అధికార ప్రతినిధి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ రూ. 6 లక్షలు ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement