నైజీరియన్ స్మగ్లర్ (మధ్యలో)
సాక్షి, న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ అంతర్జాతీయంగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ విదేశీయుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలిలా.. ఢిల్లీ పోలీసు ప్రత్యేక బృందం మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠాలపై గత కొన్ని రోజులుగా దృష్టి సారించింది. ఈ క్రమంలో సోమవారం ఆకస్మిక తనఖీలు చేపట్టిన ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అంతర్జాతీయంగా హెరాయిన్‌ను విక్రయిస్తున్న ఓ నైజీరియా గ్యాంగ్ సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 4 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment