నన్ను నేనే సరిదిద్దుకున్నా! | I am corrected by actress Ileana | Sakshi
Sakshi News home page

నన్ను నేనే సరిదిద్దుకున్నా!

Published Sun, Sep 24 2017 4:12 AM | Last Updated on Sun, Sep 24 2017 5:07 AM

I am corrected by actress Ileana

తమిళసినిమా: నన్ను నేనే సరిదిద్దుకున్నాను అంటోంది నటి ఇలియానా. ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు ప్రవర్తించే నటీమణుల్లో ఈ గోవా సుందరి ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. దక్షిణాదిలో ముఖ్యంగా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎదిగి పేరుతో పాటు, ఆస్తి అంతస్తులను కూడబెట్టుకున్న ఈ అమ్మడు ఆ తరువాత నిందలు వేయడానికి ఏ మాత్రం వెనుకాడలేదు.

దక్షిణాదిలో చాలా ఇబ్బందులకు గురైనట్లు ఆరోపణలు గుప్పించిన ఇలియానా ఈ మధ్యనే బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ నటించిన చిత్రాల్లో బర్ఫి చిత్రం ఒక్కటే గుర్తింపును తెచ్చి పెట్టింది. ఈ భామ ఇటీవల తన ట్విట్టర్‌లో పేర్కొంటూ తాను చిత్ర రంగప్రవేశం చేసి 10 ఏళ్లు దాటిందని, అయినా ఇప్పటికి 20 చిత్రాల్లోనే నటించానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ చిత్రాల్లో తనకు సంతృప్తిని ఇచ్చింది బర్ఫి లాంటి చాలా తక్కువ చిత్రాలేనని పేర్కొంది.

అప్పట్లో కథేంటని అడక్కుండానే చిత్రాలు ఒప్పుకుని నటించేశానని, దాని గురించి ఇప్పుడు  తలుచుకుంటే పిల్లతనం అనిపిస్తుందని అంది. అయితే ఇప్పుడు తనను తాను సరిదిద్దుకున్నానని, ఇకపై తనకు, తన పాత్రలకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే బాలీవుడ్‌లో ఒకటి, రెండు చిత్రాలు చేతిలో ఉన్నా దక్షిణాదిలో మాత్రం ఇలియానాకు ఒకప్పుడు డిమాండ్‌ ఉన్న మాట నిజమే. ఇప్పుడు మాత్రం పట్టించుకునేవారే లేరన్నది తను గ్రహించాలంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement