సాక్షి, విజయవాడ: మాయలేడీ కాదంబరి కేసులో ఉదయం నుంచి హైడ్రామా కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలే టార్గెట్‌గా ముంబాయి నటి కాదంబరిపై హనీట్రాప్ దందా ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్ మెయిలింగ్, ఫోర్జరీ పత్రాలతో పలువురి ఆస్తులు కొల్లగొట్టినట్లు కాదంబరిపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, కాదంబరి హనీట్రాప్ వ్యవహారాన్ని తమకనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో బందోబస్తుతో విజయవాడకి ముంబాయి నటి కాదంబరిని రప్పించారు. విజయవాడలోని ఓ స్టార్ హోటల్‌లో ఆమెకు రాచమర్యాదలు చేస్తున్నారు. ఆ స్టార్ హోటల్ వద్దకే ప్రత్యేక లీగల్ టీం వచ్చినట్లు సమాచారం.
పోలీసు దర్యాప్తులో ఏ విధంగా మాట్లాడాలో.. ఏ అంశాలు చెప్పాలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. ఎవరిపై ఫిర్యాదు చేయాలి? ఫిర్యాదు ఎలా ఉండాలనే దానిపైనా గంటల తరబడి ట్రైనింగ్ ఇస్తున్నారు. దీంతో స్టార్ హోటల్ నుంచి ఇప్పటివరకు మాయలేడి కాదంబరి బయటకు రాలేదు. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు పోలీస్ కమిషనరేట్‌కి వెళ్లి కూడా కాదంబరి ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వ పెద్దల డైరక్షన్ లోనే ఫిర్యాదు ఉండేలా పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment