రూ. 2500 కోట్ల హెరాయిన్‌ పట్టివేత | Drug Racket Busted 2500 Worth Heroin Seized In Delhi | Sakshi
Sakshi News home page

రూ. 2500 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

Published Sat, Jul 10 2021 4:18 PM | Last Updated on Sat, Jul 10 2021 4:32 PM

Drug Racket Busted 2500 Worth Heroin Seized In Delhi - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు

సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ అధికారులు 2500 కోట్ల రూపాయల విలువైన 354 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన ముగ్గురు, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. స్పెషల్‌ సెల్‌కు పట్టుబడ్డ డ్రగ్స్‌ రాకెట్‌లో ఇదే అత్యంత పెద్దదని అధికారులు పేర్కొంటున్నారు. నార్కో టెర్రరిజం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను ఈ మేరకు విచారిస్తున్నారు.

దీనిపై స్పెషల్‌ సెల్‌ అధికారి నీరజ్‌ ఠాకూర్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గత కొన్ని నెలలుగా మా ఆపరేషన్‌ నడుస్తోంది. ఈ డ్రగ్స్‌ ఆఫ్ఘనిస్తాన్‌నుంచి వచ్చాయి. కంటైనర్లలో దాచి ముంబైనుంచి ఢిల్లీకి సముద్రం ద్వారా తీసుకువచ్చారు. మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురిలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్‌ను ప్రాసెస్‌ చేశారు. వాటిని అక్కడే ఓ అద్దె ఇంట్లో దాచారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాడు. ఈ డ్రగ్స్‌ను పంజాబ్‌లో సప్లై చేయటానికి ఉంచారు. ఈ డ్రగ్స్‌ ఆపరేషన్‌ కోసం పాకిస్తాన్‌నుంచి నిధులు సమకూరుతున్నట్లు తెలుస్తోంది’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement