హీరోయిన్‌గా బిగ్‌బాస్‌ జూలీ | tamil big boss show july act as heroin | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌గా జూలీ

Published Mon, Jan 1 2018 8:45 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

tamil big boss show july act as heroin - Sakshi

నటుడు కమలహాసన్‌ వ్యాఖ్యతగా బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో స్పెషల్‌ ఎట్రాక‌్షన్‌గా నిలిచిన నటి జూలీ. జూలీ అసలు పేరు జూలియానా. ఈ జాణ అంతకుముందే దేశవ్యాప్తంగా కలకలం సృష్టించి, విప్లవంగా మొదలై ఉవెత్తున ఎగసి విజయకేతనం ఎగురవేసిన జల్లికట్టు పోరాటంలో వీర తమిళచ్చి(వీర తమిళనారీ)గా పేరు తెచ్చికుంది. ఆ తరువాత ఈ పేరు జూలీని ఏకంగా వెండితెర కథానాయకిని చేసేశాయి. జూలీ కథానాయకిగా నటింìచనున్న చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని కే7 ప్రొడక‌్షన్‌ సంస్థ నిర్మించనుంది. 

ఇందులో జూలీ యుమ్‌ 4 పేరుమ్, తప్పాట్టం చిత్రం ఫేమ్‌ పబ్లిక్‌స్టార్‌ దురై సుధాకర్‌ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు, టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. కాగా ఈ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం కానున్న నటి జూలీ మాట్లాడుతూ కథ వినగానే చాలా నచ్చేసిందని చెప్పింది. తొలి చిత్రంతోనే కథానాయకి పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథా చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. అంతే కాదు ఇది తన కెరీర్‌ను పెద్ద మలుపు తిప్పుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. మొత్తం మీద బిగ్‌బాస్‌ గేమ్‌ షో నటి ఓవియకు ఎలాగైతే టర్నింగ్‌ అయ్యిందో అలాగే జూలీనీ హీరోయిన్‌ను చేసేసిందన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement