Julie
-
ఇండో- బంగ్లా జూలీ ప్రేమకథ.. కట్ చేస్తే.. బిగ్ ట్విస్ట్..
లక్నో: సీమా హైదర్-సచిన్, అంజూ-నస్రుల్లాల సరిహద్దులు దాటిన ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. సీమా హైదర్ పాకిస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సచిన్ కోసం దేశం విడిచి వచ్చింది. అంజూ- నస్రుల్లా ప్రేమ కథలో అంజూ పాకిస్థాన్‌లోని నస్రుల్లా కోసం భారత్ వీడింది. ఈ ఘటనల తర్వాత ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చిన మరో ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన జూలీ.. భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్‌ల ప్రేమ కథ వివాదంతో బయటపడింది. ఫేస్బుక్ ప్రేమ.. బంగ్లాదేశ్‌కు చెందిన జూలీ అనే వివాహిత ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లోని అజయ్‌లు 2017లో ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. 2022లో బంగ్లాదేశ్‌లో ఉన్న జూలీ భర్త మరణించాడు. ఆ తర్వాత అజయ్ కోసం బంగ్లా విడిచిన జూలీ.. అజయ్ కోసం భారత్ వచ్చేసింది. ఇద్దరు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే.. ఉద్యోగం రీత్యా అజయ్ కర్ణాటకలో ఉండాల్సి వచ్చింది. దీంతో భార్యను ఇంటి దగ్గరే ఉంచాడు. ఇక కొన్ని రోజుల్లోనే అత్తకోడళ్ల గొడవ కారణంగా జూలీ పుట్టిల్లు బంగ్లాదేశ్ వెళ్లిపోయింది. ఇదీ చదవండి: Pakistan PUBG Love Story Case: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు! బిగ్ ట్విస్ట్.. విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన అజయ్.. తల్లిని ప్రశ్నించాడు. దీంతో అతనిపై కూడా అజయ్ తల్లి గొడవ పడగా.. కోపంతో ఇంటిని విడిచి వెళ్లాడు. అయితే.. తాజాగా అజయ్ రక్తమోడుతున్న ఫొటోతో పోలీసులను ఆశ్రయించింది అతని అమ్మ. తన కొడుకును రక్షించాల్సిందిగా వేడుకొంది. అయితే.. పోలీసులు అతన్ని బంగ్లాదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తీసుకువచ్చారు. తాను బంగ్లాదేశ్ వెళ్లలేదని, పశ్చిమ బెంగాల్‌లోని ఓ సరిహద్దు గ్రామంలో అద్దె ఇంట్లో ఉన్నానని మీడియాకు అజయ్ వెళ్లడించాడు. ఇటీవల కురిసిన వర్షాల్లో కాలుజారి తలకు దెబ్బ తాకినట్లు తెలిపాడు. ఇటీవల మొరాదాబాద్‌కు చేరిన అజయ్‌ని పోలీసులు విచారించగా.. బంగ్లాదేశ్‌లోనే ఉన్నట్లు చెప్పాడు. ఇక బంగ్లాదేశ్ వెళ్లబోనని తెలిపాడు. కానీ అతని తలకు గాయాల ఎలా తగిలాయి? అనే అంశాలు ఇంకా బయటికి రాలేదు. అజయ్ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: పాక్ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు.. ఆమె తండ్రి ఏమన్నాడంటే..? -
తల్లి ప్రేమ
అది మార్చి నెలలో ఓ రోజు. అమెరికాలోని న్యూజెర్సీ. అర్ధరాత్రి. డాక్టర్ జూలీ జాన్‌కు మెలకువ వచ్చింది. శ్వాస కష్టంగా ఉంది. తలనొప్పి, జ్వరం కూడా ఉంది. ఆమె అంతకుముందు వారమంతా కోవిడ్ పేషెంట్లకు చికిత్స చేసి వారాంతంలో ఇంటికొచ్చింది. ఏ పరీక్షలూ అక్కరలేకుండానే తన కండిషన్ ఏమిటో ఆమెకు అర్థమైంది. మంచం మీద తన పక్కనే నిద్రపోతున్న పిల్లలను ప్రేమగా ఒకసారి తడమబోయి వెంటనే చేతిని వెనక్కు తీసుకుంది. పాపకు ఎనిమిది, బాబుకు ఆరేళ్లు. మెల్లగా మంచం దిగింది. పిల్లల కోసం దేవుడిని ప్రార్థించింది. పిల్లలకు వీడ్కోలు చెప్పింది. ప్రార్థన చేయడాన్ని, వీడ్కోలు చెప్పడాన్ని వీడియో తీసింది. ‘ఈ వీడియోను ఐదేళ్ల తర్వాత నా పిల్లలకు చూపించండి’ అని మెసేజ్ కూడా పెట్టింది జూలీ. ఆ వీడియోలో ఆమె... తన పిల్లలతో వైద్యవృత్తి గొప్పదని చెబుతూ, వారిని కూడా ప్రపంచానికి వైద్యం చేయమని కోరింది. ఇదంతా చేస్తున్నప్పుడు ఆమె డాక్టర్ కాదు, ఇద్దరు బిడ్డలకు తల్లి మాత్రమే! పిల్లలతో జూలీ జాన్ కోవిడ్ తగ్గింది మార్చి నెలలో అలా ఇంటి నుంచి బయటకు వచ్చిన జూలీ ఇంకా ఇంటికి వెళ్లనే లేదు. హాస్పిటల్‌కు వచ్చి పరీక్షలకు శాంపిల్స్ ఇచ్చి క్వారంటైన్లోకి వెళ్లిపోయింది. మూడు వారాలు గడిచింది. ఇప్పుడామె కోలుకున్నది. మళ్లీ శాంపిల్స్ ఇచ్చి నెగెటివ్ రిపోర్టు కోసం ఎదురు చూస్తోంది. పిల్లల కోసం తీసిన వీడియోను ఐదేళ్ల తర్వాత చూపించమనే మెసేజ్ ఎందుకు పెట్టారని అడిగినప్పుడు ‘‘అప్పటికైతే నా పిల్లలకు పదమూడేళ్లు, పదకొండేళ్లు వస్తాయి. నేను వాళ్లకు ఏం చెప్పదలుచుకున్నానో వాళ్లు అర్థం చేసుకోగలుగుతారు. నేనే లేకపోతే... నేను చెప్పదలుచుకున్న విషయాన్ని వాళ్లకు ఎవరు చెబుతారు. అందుకే ఈ వీడియో’’ అన్నదామె. రిపోర్టులు నెగెటివ్ వస్తే, వెంటనే పిల్లలను చూడాలనే ఆత్రుత కనిపిస్తోందామె మాటల్లో. జూలీ మనసును చెప్పడానికి ‘తల్లి ప్రేమ’ అనే మాట సరిపోతుందా? ఇంకే పదం ఉన్నా అది తల్లి ప్రేమ కంటే గొప్ప పదం కాలేదేమో! డాక్టర్ జూలీ జాన్ పుట్టింది కేరళలో. ఆమె అమ్మానాన్న మలయాళీలే. ఆమె పుట్టిన రెండేళ్లకే వాళ్లు అమెరికాకు వెళ్లిపోయారు. ఆమె అక్కడే మెడిసిన్ చదివి వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న న్యూ జెర్సీలో ఆమె ఉద్యోగం.– మంజీర -
బిగ్‌బాస్ జూలి కొత్త రాజకీయ పార్టీ?
-
రాజకీయాల్లోకి బిగ్‌బాస్ జూలి?
సాక్షి, చెన్నై: కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేది కవితకు అనర్హం అన్నారో మాహాకవి. అదే విధంగా రాజకీయాలకు కారెవరు అనర్హులు అని అనవచ్చు. ఎందుకంటే ఇక్కడ అర్హతలంటూ ఏమీ ఉండవు. ప్రజాదరణే ముఖ్యం. దాన్ని రాబట్టుకంటే రాజకీయాల్లో ఏమైనా కావచ్చు. అందుకే రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో రోజుకో పార్టీ ఆవిర్భవిస్తోంది. సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కమలహాసన్ ధైర్యం చేసి రాజకీయ గోదాలోకి దూకేసినా, సూపర్‌స్టార్ రజనీకాంత్ లాంటి వారే రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఇదుగో అదిగో ఊగిసలాడుతున్నారు. అలాంటిది నటి జూలి కొత్తగా రాజకీయ పార్టీకి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు మెరీనా తీరంలో జల్లికట్టు పోరాటంలో గళమెత్తి మరింత ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం హీరోయిన్గా నటించేస్తున్న జూలీ అదే వేగంతో రాజకీయాల్లోకి దూకడానికి సన్నద్ధం అవుతోందట. తను కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. వర్ధమాన నటి జూలీ నుంచి ఇలాంటి నిర్ణయాన్ని ఊహించని ఆమె అభిమానులు, సగటు ప్రేక్షకుడు షాక్ అవుతున్నారు. కొందరైతే తమిళనాడుకు ఇలాంటి గతి పట్టిందేమిటి అని తలపట్టుకుంటున్నారు. అయితే జూలి పేరుతో ప్రసారంలో ఉన్న ఆ వీడియోలో వాస్తవం ఎంత? అన్నది కూడా ఆలోచించాలి. ఏమో జూలీకి రాజకీయ మోహం కలిగి ఉండవచ్చు లేదా ప్రచారం కోసం చేసిన తంతూ కావచ్చు. మరి ఆ వీడియో గురించి నటి జూలీ ఎలా స్పందిస్తుందో చూద్దాం. -
క్రికెట్ దిగ్గజం కొడుకుతో నటి పెళ్లి
ముంబై: డేటింగ్ నుంచి మొదలుపెడితే ఎంగేజ్మెంట్.. ముహుర్తం ఖరారు.. బందువుల రాక.. మెహెందీ, సంగీత్.. పెళ్లి.. అప్పగింతలు.. వందలకొద్దీ వార్తలు, వేలకొద్దీ ఫొటోలు, సోషల్‌మీడియాలో చర్చలు..!! సెలబ్రిటీల పెళ్లివేడుకల్లో సాధారణంగా చోటుచేసుకున్న ఈ రొటీన్‌కు కాస్త భిన్నంగా.. చడీచప్పుడు లేకుండా ఎకాఎకిన పెళ్లిచేసేసుకుని అభిమానులకు స్వీట్ షాకిచ్చింది హీరోయిన్ నేహా ధూపియా. క్రికెట్ దిగ్గజం కుమారుడు: భారత క్రికెట్లో దిగ్గజ స్పిన్నర్‌గా పేరుపొందిన బిషన్ సింగ్ బేడీ తనయుడు అంగద్ బేటీనే నేహా వివాహం చేసుకుంది. అంగద్ సైతం బాలీవుడ్లో, టీవీ రంగంలో నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం పంజాబీ సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి దుస్తుల్లో మెరిపోతున్న ఫొటోలను.. స్వయంగా వధూవరులే పోస్ట్ చేశారు. ‘‘లైఫ్‌లో తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఇదే.. నా ఫ్రెండ్ అంగద్‌ను పెళ్లి చేసుకున్నాను. హలో.. హస్బెండ్గారు..’’ అని నేహా రాసుకొచ్చింది. ‘ఇప్పటిదాకా స్నేహితురాలు.. ఇకనుంచి భార్య’ అంటూ అంగద్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా ద్వారా పెళ్లి వార్తలు తెలుసుకున్న ప్రముఖులంతా కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.. -
డాక్టర్ ఎస్ అనిత ఎంబీబీఎస్
బయోపిక్ ట్రెండ్స్ నడుస్తున్న ఈ తరుణంలో కోలీవుడ్‌లో మరో బయోపిక్కు రంగం సిద్దమైంది. అయితే ఈ బయోపిక్ ఏ క్రీడాకారుడో లేక సెలబ్రిటీ జీవిత కథాంశంగానో తెరకెక్కడం లేదు. డాక్టర్ కావాలని కన్న కలలను నీట్ పరీక్ష నీరుగార్చడంతో ఆత్మహత్య చేసుకున్న ఓ సాధారణ యువతి జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఎస్ అనిత అనే ఓ తమిళ యువతి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీట్ పరీక్షలో అర్హత సాధించలేకపోయింది. దీంతో నీట్ పరీక్ష రద్దు చేయాలని ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోనే కాక పలు రాష్ట్రాల్లోను ఆందోళనలు జరిగాయి. అనిత జీవితం ఆధారంగానే తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆమె పాత్రలో తమిళ బిగ్‌బాస్ ఫేమ్ జూలీ నటిస్తున్నారు. ఆర్జే పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘డాక్టర్ ఎస్. అనిత ఎంబీబీఎస్’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల కాగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. -
ఉత్తమిగా మారుతున్న జూలి
తమిళసినిమా: నటి జూలి ఉత్తమిగా మారుతోందట. అదేంటి ఉత్తమిగా మారడం ఏమిటి? అనే ప్రశ్న తలెత్తుతోందా? అయితే ఆ కథేంటో చూద్దాం రండి. ఏ రంగంలోనైనా, ఏ విషయానికైనా ప్రచారం చాలా ముఖ్యం. అలాంటి ప్రచారాన్ని కొందరు సొంతంగా ఖర్చు చేసి పొందుతుంటారు. మరికొందరికి అదే వెతుక్కుంటూ వస్తుంది. అలా మంచి పాపులారిటీని బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో తెచ్చిపెట్టింది. అందులో ఒకరు నటి జూలి. అందులో పాల్గొన్న వారిలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఈ బ్యూటీ అంతకు ముందే జల్లికట్టు పోరాటంలో పాల్గొని వెలుగులోకి వచ్చింది. ఆపై ఒక టీవీ చానల్లో యాంకర్‌గా పనిచేశారు. ఇవన్నీ కలిపి జూలీని సినిమా హీరోయిన్ను చేసేశాయి. అలా బిగ్‌బాస్ షో తరువాత హీరోయిన్గా అవకాశం అందుకున్న ఓవియ తరువాత ఆ లిస్ట్‌లో నటి జూలి చేరింది. త్వరలో ఈ అమ్మడు నటించనున్న చిత్రం ప్రారంభం కానుంది. ఆమెతో పాటు ప్రధాన పాత్రలో పబ్లిక్స్టార్ దురై సుధాకర్ నటిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు జూలీయుమ్ 4 పేరుమ్ చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. ఈ చిత్రానికి ఉత్తమి అనే టైటిల్‌ను నిర్ణయించారట. ఈ చిత్ర కథ జూలీ పాత్ర చుట్టూ తిరుగుతుందట. తొలి చిత్రంతోనే శక్తివంతమైన పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందంటోంది నటి జూలి. కాగా కే 7 ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇవి ప్రస్తుతానికి ఉత్తమి చిత్ర వివరాలు. త్వరలో పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. -
హీరోయిన్గా బిగ్‌బాస్ జూలీ
నటుడు కమలహాసన్ వ్యాఖ్యతగా బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన నటి జూలీ. జూలీ అసలు పేరు జూలియానా. ఈ జాణ అంతకుముందే దేశవ్యాప్తంగా కలకలం సృష్టించి, విప్లవంగా మొదలై ఉవెత్తున ఎగసి విజయకేతనం ఎగురవేసిన జల్లికట్టు పోరాటంలో వీర తమిళచ్చి(వీర తమిళనారీ)గా పేరు తెచ్చికుంది. ఆ తరువాత ఈ పేరు జూలీని ఏకంగా వెండితెర కథానాయకిని చేసేశాయి. జూలీ కథానాయకిగా నటింìచనున్న చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని కే7 ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుంది. ఇందులో జూలీ యుమ్ 4 పేరుమ్, తప్పాట్టం చిత్రం ఫేమ్ పబ్లిక్స్టార్ దురై సుధాకర్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు, టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. కాగా ఈ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం కానున్న నటి జూలీ మాట్లాడుతూ కథ వినగానే చాలా నచ్చేసిందని చెప్పింది. తొలి చిత్రంతోనే కథానాయకి పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథా చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. అంతే కాదు ఇది తన కెరీర్‌ను పెద్ద మలుపు తిప్పుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. మొత్తం మీద బిగ్‌బాస్ గేమ్ షో నటి ఓవియకు ఎలాగైతే టర్నింగ్ అయ్యిందో అలాగే జూలీనీ హీరోయిన్ను చేసేసిందన్నమాట. -
సున్నా డిగ్రీల చలిలో.. ఒక్కటయ్యారు!
లండన్: ప్రస్తుతకాలంలో పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని యువతి, యువకులు ముచ్చటపడుతున్నారు. అలాంటి ఓ జంట ఏకంగా సున్నా డిగ్రీల చలి ఉన్న ప్రాంతంలో ఒక్కటే ఆశ్చర్యపర్చింది. బ్రిటన్‌కు చెందిన జూలీ బామ్, టామ్ సిల్వెస్టర్లు పోలార్ ఫీల్డ్ గైడ్స్(అంటార్కిటికాలో ఓ భాగం). కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఇరువురూ ప్రపంచంలోని సుందరప్రదేశాలను చుట్టేశారు కూడా. ఇక పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని భావించారు. జూలీకి మంచు ప్రాంతాలు, కొండలు అంటే ప్రాణం. దాంతో అంటార్కిటికాలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతంలో రెండు రోజుల పెళ్లి చేసుకోవాలని జంట ప్లాన్ చేసుకుంది. ఈ విషయాన్ని తమతో పాటు కలిసి బిట్రిష్ అంటార్కిటిక్ సర్వేస్(బీఏఎస్)లో పనిచేసే 18 మంది సహచరులకు తెలియజేశారు. అంటార్కిటికాలోని అడిలైడ్ ఐలాండ్ ప్రాంతంలో వివాహ ఏర్పాట్లు చేసిన సహచరులు ప్రేమికులను ఒక్కటి చేశారు. సున్నా డిగ్రీల చలిలో, అంటార్కిటికాలో పెళ్లి చేసుకోవాలనేది దేవుడు నిర్ణయించిందని జూలీ టెలిగ్రాఫ్ దినపత్రికతో పేర్కన్నారు. పెళ్లి చేసుకోవడానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఇంకేదైనా ఉంటుందా? అంటూ ప్రశ్నించారు. అతికొద్దిమంది మేం ఒక్కటవ్వాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాం. అలాంటిది భూమ్మీద ఉన్న ఓ అద్భుతమైన ప్రదేశం వివాహం జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని వరుడు టామ్ చెప్పారు. బ్రిటిష్ అంటార్కిటికాలో జరిగిన మొదటి వివాహం కూడా ఇదే కావడం గమనార్హం. -
వరుడి కిడ్నాప్.. వధువు సహా నలుగురి అరెస్ట్
పట్నా: వరుడిని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో వధువు సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బిహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ముజఫర్ పూర్ ఈస్ట్ డీఎస్పీ ముస్తాఫిక్ అహ్మద్ కథనం ప్రకారం.. జూలీ అనే యువతికి మిథాలీ గ్రామానికి చెందిన అభినయ్ కుమార్ తో వివాహం చేయాలని వధువు కుటుంబసభ్యులు నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అభినయ్ ని వధువు బంధువులు నంద్ కిశోర్ సింగ్, మరికొందరు కలిసి కిడ్నాప్ చేశారు. అభినయ్ కిడ్నాప్ అయ్యాడని గైఘాట్ పోలీసులకు అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. 'పకాడ్వా షాది' అనే సంప్రదాయం ప్రకారం తమకు కావలసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి అతడికి బలవంతంగా పెళ్లి చేయడం బిహార్ లో కొనసాగుతుండేది. వధువు బంధువులు నిర్ణయించినట్లుగానే పెళ్లి ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి. శుక్రవారం మరికాసేపట్లో వివాహం జరుగుతుందనగా జూలీ ఇంటికి చేరుకున్న పోలీసులు అభినయ్ ని వారి చెర నుంచి విడిపించారు. అయితే వధువు తరఫు బంధువులు పోలీసులపై దాడులకు దిగి విధ్వంసం సృష్టించారు. పోలీసులను వారి దాడులను అడ్డుకుని కల్యాణ మండపం వద్ద ఉన్న వధువు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వధువు జూలీని, ఆమె సోదరి, సోదరుడు, మరో వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేశారు. ఈ నలుగురిని అనంతరం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, షాహిద్ ఖుదీ రామ్ బోస్ సెంట్రల్ జైలుకు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించారు. అభినయ్ ఇష్టప్రకారమే వివాహం జరుగుతుందని వధువు బంధువులు పోలీసులను నమ్మించాలని చూశారు. అయితే అక్కడ వరుడి కుటుంబంగానీ, బంధువులుగానీ ఏ ఒక్కరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతే పోలీసులు అతడిని రక్షించారని డీఎస్పీ తెలిపారు. తనను జూలీ బంధువులు కిడ్నాప్ చేశారని, బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నించారని ఆరోపించాడు. వధువు బంధువు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. జూలీ, అభినయ్ కుమార్ కి గతంలోనే పెళ్లి నిశ్చయమైందని, కట్నం అడగటంతో గొడవ తలెత్తి పెళ్లి రద్దయిందని చెప్పాడు. ఆ కారణం వల్లే వరుడిని ఎలాగైనా తీసుకొచ్చి పెళ్లి చేయాలని చూశారని చెప్పుకొచ్చాడు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని డీఎస్పీ ముస్తాఫిక్ అహ్మద్ వివరించారు. -
అమ్మ కళ్లల్లో కన్నీళ్లు లేవు..
గోడచేర్పు బతుకుల్లేవు.. చీకటి జీవితాల్లేవు.. ఈసడింపుల్లేవు.. వెటకారాల్లేవు.. చిత్రమైన చూపుల్లేవు.. చెత్త కామెంట్లూ లేవు.. ఆనందముంది.. వెలుగుంది.. స్కూలు ఉంది.. చదువుంది.. ఆశల నడకుంది.. అలుపెరగని పరుగుంది.. జీవమే కాదు.. జీవితమూ ఉంది.. ఎందుకంటే.. మహేందర్ తలెత్తుకుని నిలబడ్డాడు!! మహేందర్ అహివార్(13). మధ్యప్రదేశ్‌లోని చాటీపహాడీ లో ఉంటాడు. పుట్టినప్పుడు అందరి పిల్లల్లాగే మామూలుగానే ఉన్నాడు. తర్వాత మెడ క్రమంగా పక్కకు వంగిపోవడం ప్రారంభమైంది. దీంతో అతడి మెడతోపాటు జీవితం కూడా తలకిందులైంది. ఒక అరుదైన పరిస్థితి వల్ల మహేందర్ మెడ కండరాలు బలహీనపడిపోయాయి. తల్లిదండ్రులు చాలా మందికి చూపించారు. ఫలితం లేదు. మహేందర్ జీవితం ఇంటికే పరిమితమైపోయింది. నిలబడే పరిస్థితి ఉండేది కాదు.. అలా గోడకు ఆనుకుని ఉండేవాడు. తినాలన్నా.. బాత్రూంకు పోవాలన్నా ఎవరో ఒకరు సాయం చేయాల్సిందే. తోటివారంతా స్కూలుకెళ్తుంటే.. తాను ఇంట్లోనే మగ్గిపోవాల్సిన పరిస్థితి. స్నేహితుల్లేరు.. పలకరించేవారే లేరు.. మహేందర్ బాధ చూసి.. అతడి తల్లిదండ్రులైతే.. ఇంతకన్నా వాడికి మరణమే మేలని అనుకున్న రోజులూ ఉన్నాయి. రోజులు మారాయి. మహేందర్ పరిస్థితి గురించి పత్రికల్లో చూసిన ఢిల్లీ అపోలో ఆస్పత్రి వైద్యుడు రాజగోపాలన్ కృష్ణన్.. అతడిని ఆదుకోవడానికి ముందుకొచ్చాడు. అటు నెట్లో ఇతడి పరిస్థితి చూసి చలించిపోయింది బ్రిటన్‌లోని లివర్‌పూల్‌కు చెందిన జూలీ. ఆమె మహేందర్ పరిస్థితిని వివరిస్తూ.. ఆపరేషన్ నిమిత్తం రూ.10 లక్షల మేర విరాళాలు సేకరించింది. అంతే.. ఆపరేషన్ పూర్తయింది.. మహేందర్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇన్నాళ్లలా ప్రపంచం తలకిందులుగా లేదు.. నిటారుగా ఉంది.. తన తలలాగే.. తలెత్తుకునే ఉంది..