లక్నో: సీమా హైదర్-సచిన్, అంజూ-నస్రుల్లాల సరిహద్దులు దాటిన ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. సీమా హైదర్ పాకిస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సచిన్ కోసం దేశం విడిచి వచ్చింది. అంజూ- నస్రుల్లా ప్రేమ కథలో అంజూ పాకిస్థాన్‌లోని నస్రుల్లా కోసం భారత్ వీడింది. ఈ ఘటనల తర్వాత ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చిన మరో ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన జూలీ.. భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్‌ల ప్రేమ కథ వివాదంతో బయటపడింది.
ఫేస్‌బుక్ ప్రేమ..
బంగ్లాదేశ్‌కు చెందిన జూలీ అనే వివాహిత ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లోని అజయ్‌లు 2017లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. 2022లో బంగ్లాదేశ్‌లో ఉన్న జూలీ భర్త మరణించాడు. ఆ తర్వాత అజయ్ కోసం బంగ్లా విడిచిన జూలీ.. అజయ్ కోసం భారత్ వచ్చేసింది. ఇద్దరు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే.. ఉద్యోగం రీత్యా అజయ్ కర్ణాటకలో ఉండాల్సి వచ్చింది. దీంతో భార్యను ఇంటి దగ్గరే ఉంచాడు. ఇక కొన్ని రోజుల్లోనే అత్తకోడళ్ల గొడవ కారణంగా జూలీ పుట్టిల్లు బంగ్లాదేశ్ వెళ్లిపోయింది.
ఇదీ చదవండి: Pakistan PUBG Love Story Case: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు!
బిగ్ ట్విస్ట్..
విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన అజయ్.. తల్లిని ప్రశ్నించాడు. దీంతో అతనిపై కూడా అజయ్ తల్లి గొడవ పడగా.. కోపంతో ఇంటిని విడిచి వెళ్లాడు. అయితే.. తాజాగా అజయ్ రక్తమోడుతున్న ఫొటోతో పోలీసులను ఆశ్రయించింది అతని అమ్మ. తన కొడుకును రక్షించాల్సిందిగా వేడుకొంది. అయితే.. పోలీసులు అతన్ని బంగ్లాదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తీసుకువచ్చారు. తాను బంగ్లాదేశ్ వెళ్లలేదని, పశ్చిమ బెంగాల్‌లోని ఓ సరిహద్దు గ్రామంలో అద్దె ఇంట్లో ఉన్నానని మీడియాకు అజయ్ వెళ్లడించాడు. ఇటీవల కురిసిన వర్షాల్లో కాలుజారి తలకు దెబ్బ తాకినట్లు తెలిపాడు.
ఇటీవల మొరాదాబాద్‌కు చేరిన అజయ్‌ని పోలీసులు విచారించగా.. బంగ్లాదేశ్‌లోనే ఉన్నట్లు చెప్పాడు. ఇక బంగ్లాదేశ్ వెళ్లబోనని తెలిపాడు. కానీ అతని తలకు గాయాల ఎలా తగిలాయి? అనే అంశాలు ఇంకా బయటికి రాలేదు. అజయ్ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: పాక్ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు.. ఆమె తండ్రి ఏమన్నాడంటే..?
Comments
Please login to add a commentAdd a comment