Indo - Bangla
-
ఇండో-బంగ్లాదేశ్ వాణిజ్యం బంద్!
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున చెలరేగిన అల్లర్లు, ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-బంగ్లాదేశ్ వాణిజ్యం సోమవారం మధ్యాహ్నం నిలిచిపోయింది. ఆ దేశంలో హింసాత్మక నిరసనల ఫలితంగా అధ్యక్షురాలు షేక్ హసీనా రాజీనామా చేశారు.దేశంలో అత్యవసర సేవలు మినహా మూడు రోజుల వాణిజ్య సెలవును ప్రకటిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బంగ్లాదేశ్ కస్టమ్స్ నుంచి తమ ల్యాండ్ పోర్ట్‌లలో క్లియరెన్స్ లేకపోవడంతో, అన్ని ల్యాండ్ పోర్ట్‌లలో ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు నిలిచిపోయాయని పశ్చిమ బెంగాల్ ఎగుమతిదారుల సమన్వయ కమిటీ కార్యదర్శి ఉజ్జల్ సాహా తెలిపారు.గత రెండు రోజులుగా బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా వాణిజ్యానికి అంతరాయం ఏర్పడింది. హసీనా సోమవారం రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లినట్లు పలు వార్తా కథనాలు తెలిపాయి. సోమవారం ఉదయం కొంత మేర వాణిజ్య కార్యకలాపాలు జరిగినా అధ్యక్షురాలి రాజీనామా, దేశం నుంచి నిష్క్రమణ వార్తల తర్వాత ఆగిపోయిందని బెనాపోల్ సి&ఎఫ్ స్టాఫ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సాజేదుర్ రెహ్మాన్ చెప్పారు.బెనాపోల్ పశ్చిమ బెంగాల్‌లోని పెట్రాపోల్ సరిహద్దులో బంగ్లాదేశ్ వైపు ఉంది. రాష్ట్రంలోని కొన్ని ఇతర ల్యాండ్ పోర్ట్‌లలో అత్యధికంగా ద్వైపాక్షిక వాణిజ్యానికి కారణమయ్యే అతిపెద్ద ల్యాండ్ పోర్ట్ అయిన పెట్రాపోల్ కూడా ప్రభావితమైందని వ్యాపార వర్గాలు తెలిపాయి. -
ఇండో- బంగ్లా జూలీ ప్రేమకథ.. కట్ చేస్తే.. బిగ్ ట్విస్ట్..
లక్నో: సీమా హైదర్-సచిన్, అంజూ-నస్రుల్లాల సరిహద్దులు దాటిన ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. సీమా హైదర్ పాకిస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సచిన్ కోసం దేశం విడిచి వచ్చింది. అంజూ- నస్రుల్లా ప్రేమ కథలో అంజూ పాకిస్థాన్‌లోని నస్రుల్లా కోసం భారత్ వీడింది. ఈ ఘటనల తర్వాత ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చిన మరో ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన జూలీ.. భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్‌ల ప్రేమ కథ వివాదంతో బయటపడింది. ఫేస్బుక్ ప్రేమ.. బంగ్లాదేశ్‌కు చెందిన జూలీ అనే వివాహిత ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లోని అజయ్‌లు 2017లో ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. 2022లో బంగ్లాదేశ్‌లో ఉన్న జూలీ భర్త మరణించాడు. ఆ తర్వాత అజయ్ కోసం బంగ్లా విడిచిన జూలీ.. అజయ్ కోసం భారత్ వచ్చేసింది. ఇద్దరు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే.. ఉద్యోగం రీత్యా అజయ్ కర్ణాటకలో ఉండాల్సి వచ్చింది. దీంతో భార్యను ఇంటి దగ్గరే ఉంచాడు. ఇక కొన్ని రోజుల్లోనే అత్తకోడళ్ల గొడవ కారణంగా జూలీ పుట్టిల్లు బంగ్లాదేశ్ వెళ్లిపోయింది. ఇదీ చదవండి: Pakistan PUBG Love Story Case: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు! బిగ్ ట్విస్ట్.. విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన అజయ్.. తల్లిని ప్రశ్నించాడు. దీంతో అతనిపై కూడా అజయ్ తల్లి గొడవ పడగా.. కోపంతో ఇంటిని విడిచి వెళ్లాడు. అయితే.. తాజాగా అజయ్ రక్తమోడుతున్న ఫొటోతో పోలీసులను ఆశ్రయించింది అతని అమ్మ. తన కొడుకును రక్షించాల్సిందిగా వేడుకొంది. అయితే.. పోలీసులు అతన్ని బంగ్లాదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తీసుకువచ్చారు. తాను బంగ్లాదేశ్ వెళ్లలేదని, పశ్చిమ బెంగాల్‌లోని ఓ సరిహద్దు గ్రామంలో అద్దె ఇంట్లో ఉన్నానని మీడియాకు అజయ్ వెళ్లడించాడు. ఇటీవల కురిసిన వర్షాల్లో కాలుజారి తలకు దెబ్బ తాకినట్లు తెలిపాడు. ఇటీవల మొరాదాబాద్‌కు చేరిన అజయ్‌ని పోలీసులు విచారించగా.. బంగ్లాదేశ్‌లోనే ఉన్నట్లు చెప్పాడు. ఇక బంగ్లాదేశ్ వెళ్లబోనని తెలిపాడు. కానీ అతని తలకు గాయాల ఎలా తగిలాయి? అనే అంశాలు ఇంకా బయటికి రాలేదు. అజయ్ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: పాక్ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు.. ఆమె తండ్రి ఏమన్నాడంటే..? -
దేశమే లేని దీనులు..!
భారత్-బంగ్లా సరిహద్దు ప్రాంతవాసుల దుస్థితి ‘నో మేన్స్ ల్యాండ్’లో 70 వేల మంది పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం జీరో పాయింట్ (బంగ్లా సరిహద్దు): బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడ్డప్పుడు అది భారత్‌తో కుదుర్చుకున్న ‘భూ సరిహద్దు ఒప్పందం’ (ఎల్బీఏ) పరిధిలోకి రాకపోవడంతో అక్కడున్న 260 గ్రామాలకు చెందిన 70 వేల మంది అనాథలుగా మారిపోయారు. ఈ పల్లెటూళ్లు ‘నో మేన్స్ ల్యాండ్’ (ఎవరికీ చెందని ప్రాంతం) పరిధిలోకి వెళ్లడంతో ఈ ప్రజలంతా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. తరచూ నేరాల బారినపడుతున్నారు. సరిహద్దు మీదుగా అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ చెలామణి అడ్డుకోవడానికి గస్తీ నిర్వహించే భద్రతా దళాలకు వీరిపై ఎలాంటి వైఖరి అనుసరించాలో తెలియని వింత పరిస్థితి ఎదురవుతోంది. ఎల్బీఏ అమలైన తరువాత సరిహద్దులోని పలు వివాదాస్పద ప్రాంతాలను భారత్, బంగ్లాదేశ్ నియమాల ప్రకారం బదలాయించుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలోని ఈ గ్రామాలపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ‘ఈ గ్రామాలను అంతర్జాతీయ సరిహద్దు పరిధిలోకి తీసుకురావడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుందని మేం ప్రభుత్వానికి విన్నవించాం. అయినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి స్పందన రాలేదు. ఈ గ్రామాలు తరచూ చట్టవ్యతిరేక కార్యకలాపాల బారినపడుతున్నాయి. కొన్నిసార్లు చొరబాటు యత్నాలు జరుగుతున్నాయి’ అని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్ సందీప్ సాలుంకే అన్నారు. పానితర్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న ఇళ్లలో ఒకటి భారత్, మరొకటి బంగ్లాదేశ్ పరిధిలోకి వస్తాయి. పది మీటర్ల వెడల్పున్న మార్గం రెండు దేశాలను విడదీస్తుందని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ఫలితంగా చొరబాట్లుదారులు, నేరగాళ్లపై నిఘా ఉంచడం కష్టసాధ్యంగా మారిందని చెప్పాయి. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు పొడవు 4,096 కిలోమీటర్లు కాగా, దక్షిణ బెంగాల్ మార్గంలోని ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, నాదియా, ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల పరిధిలోనే ఇలాంటివి 54 గ్రామాలు ఉన్నాయి. వీటిలోని 4,749 కుటుంబాల్లో దాదాపు 30 వేల మంది నివసిస్తున్నారు. ఈ గ్రామాలన్నింటిలోనూ నేరాల రేటు ఎక్కువగా ఉందని బీఎస్ఎఫ్ తెలిపింది. ఎవరికీ చెందని ప్రాంతాలపై నిఘా కోసం జవాన్లు వినూత్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. అక్కడి ప్రజలను సులువుగా గుర్తుపట్టడానికి ఫొటోలతో కూడిన రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఎవరు వచ్చినా వివరాలు సేకరిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎక్కువ శాతం చిన్నవే కాబట్టి అన్నింటినీ అంతర్జాతీయ సరిహద్దు పరిధిలోకి తీసుకురావడం ఒక్కటే శాశ్వత పరిష్కారమని బీఎస్ఎఫ్ కమాండింగ్ అధికారి రత్నేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ గ్రామాల మహిళలు, చిన్నారుల సాయంతో దళారులు సిగరెట్లు, ఆహార పదార్థాలను భారత్‌లోకి అక్రమంగా రవాణా చేస్తున్నారని వెల్లడించారు. భారత్ నుంచి కూడా బంగ్లాదేశ్‌లోకి ఆభరణాలు, దగ్గుమందు (మత్తుకోసం), వాహన విడిభాగాలు దొంగతనంగా రవాణా అవుతున్నాయి. ఇలాంటి ఘటనలపై వందలాది కేసులు నమోదైనట్టు కుమార్ చెప్పారు.