లండన్: ప్రస్తుతకాలంలో పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని యువతి, యువకులు ముచ్చటపడుతున్నారు. అలాంటి ఓ జంట ఏకంగా సున్నా డిగ్రీల చలి ఉన్న ప్రాంతంలో ఒక్కటే ఆశ్చర్యపర్చింది.
బ్రిటన్‌కు చెందిన జూలీ బామ్, టామ్ సిల్వెస్టర్‌లు పోలార్ ఫీల్డ్ గైడ్స్(అంటార్కిటికాలో ఓ భాగం). కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఇరువురూ ప్రపంచంలోని సుందరప్రదేశాలను చుట్టేశారు కూడా. ఇక పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని భావించారు.
జూలీకి మంచు ప్రాంతాలు, కొండలు అంటే ప్రాణం. దాంతో అంటార్కిటికాలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతంలో రెండు రోజుల పెళ్లి చేసుకోవాలని జంట ప్లాన్ చేసుకుంది. ఈ విషయాన్ని తమతో పాటు కలిసి బిట్రిష్ అంటార్కిటిక్ సర్వేస్(బీఏఎస్)లో పనిచేసే 18 మంది సహచరులకు తెలియజేశారు.
అంటార్కిటికాలోని అడిలైడ్ ఐలాండ్ ప్రాంతంలో వివాహ ఏర్పాట్లు చేసిన సహచరులు ప్రేమికులను ఒక్కటి చేశారు. సున్నా డిగ్రీల చలిలో, అంటార్కిటికాలో పెళ్లి చేసుకోవాలనేది దేవుడు నిర్ణయించిందని జూలీ టెలిగ్రాఫ్ దినపత్రికతో పేర్కన్నారు. పెళ్లి చేసుకోవడానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఇంకేదైనా ఉంటుందా? అంటూ ప్రశ్నించారు.
అతికొద్దిమంది మేం ఒక్కటవ్వాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాం. అలాంటిది భూమ్మీద ఉన్న ఓ అద్భుతమైన ప్రదేశం వివాహం జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని వరుడు టామ్ చెప్పారు. బ్రిటిష్ అంటార్కిటికాలో జరిగిన మొదటి వివాహం కూడా ఇదే కావడం గమనార్హం.
సున్నా డిగ్రీల చలిలో.. ఒక్కటయ్యారు!
Published Wed, Jul 19 2017 8:06 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM
Advertisement
Advertisement