tom
-
అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..!
విమానాల్లో అత్యధిక దూరం ప్రయాణించిన ఈ పెద్దమనిషి పేరు టామ్ స్టూకర్. అమెరికాలోని న్యూజెర్సీవాసి. ప్రస్తుతం ఇతడి వయసు 69 ఏళ్లు. విమాన ప్రయాణాల మీద మక్కువతో 1990లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నుంచి 2.90 లక్షల డాలర్లకు (రూ.2.41 కోట్లు) లైఫ్‌టైమ్ పాస్ తీసుకున్నాడు.ఇక అప్పటి నుంచి తోచినప్పుడల్లా విమానాల్లో దేశాదేశాలను చుట్టేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఇతగాడు విమానాల్లో ఏకంగా 20 మిలియన్ మైళ్లకు (3.21 కోట్ల కిలోమీటర్లు) పైగా ప్రయాణాలు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత విరివిగా విమాన ప్రయాణాలు చేసే వ్యక్తిగా రికార్డులకెక్కాడు. లైఫ్‌టైమ్ పాస్ కోసం అప్పట్లో తాను పెద్దమొత్తమే చెల్లించినా, అలా చెల్లించడం వల్ల ఇప్పటి వరకు లెక్కిస్తే తనకు 2.44 మిలియన్ డాలర్లు (రూ.20.30 కోట్లు) మిగిలినట్లేనని టామ్ చెప్పడం విశేషం. అతి తక్కువ లగేజీతో తాను ప్రయాణాలు చేస్తానని, చేసే ప్రయాణాల కంటే, ప్రయాణాల్లో మనుషులను కలుసుకోవడం తనకు చాలా ఇష్టమని అతడు చెబుతాడు.ఇవి చదవండి: అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే! -
కరోనాను జయించి.. కనకంతో మెరిసి..
టోక్యో: బ్రిటన్‌కు చెందిన స్విమ్మర్ టామ్ డియాన్ ఒకటి కాదు... రెండు సార్లు కరోనా వైరస్ బారిన పడ్డాడు. స్వదేశంలోనే అతనిపై ఏమాత్రం అంచనాలు లేవు. కరోనాతోనే సరిపోతుంది... టోక్యోదాకా ఏం వెళతాడులే! అని కొందరంటే... అతనికి ఈ నేషనల్ ట్రయల్సే ఎక్కువని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. కానీ టామ్ డియాన్ అలాంటి అభిప్రాయాలను, అనుమానాలను పటాపంచలు చేశాడు. అంచనాల్ని తారుమారు చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో టామ్ బంగారు పతకం గెలుపొందాడు. గత సెప్టెంబర్‌లో తొలిసారి అతనికి కోవిడ్ సోకింది. మళ్లీ నాలుగు నెలలకే ఈ జనవరిలోనూ వైరస్ బారిన పడ్డాడు. ఈసారి కరోనా అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు ఓ పట్టాన తగ్గనేలేదు. అందుకే అతనిపై ఎవరికీ నమ్మకం లేకపోయింది. కానీ ఇక్కడ మాత్రం అతనే విజేత! పోటీని టామ్ అందరికంటే ముందుగా 1ని:44.22 సెకన్లలో ముగించాడు. అతని సహచరుడు డన్కన్ స్కాట్ (1ని:44.26 సెకన్లు) రజతం, బ్రెజిల్ స్విమ్మర్ ఫెర్నాండో (1ని:44.66 సెకన్లు) కాంస్యం గెలిచాడు. వందేళ్లలో బ్రిటన్ స్విమ్మర్లు ఒకే ఈవెంట్లో తొలి రెండు స్థానాల్లో నిలవడం కూడా ఇదే మొదటిసారి. 1908 లండన్ ఒలింపిక్స్‌లో బ్రిటన్ స్విమ్మర్లు స్వర్ణ, రజత పతకాలు గెలిచారు. ఆ తర్వాత తాజాగా టోక్యోలోనే దీన్ని పునరావృతం చేశారు. -
సున్నా డిగ్రీల చలిలో.. ఒక్కటయ్యారు!
లండన్: ప్రస్తుతకాలంలో పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని యువతి, యువకులు ముచ్చటపడుతున్నారు. అలాంటి ఓ జంట ఏకంగా సున్నా డిగ్రీల చలి ఉన్న ప్రాంతంలో ఒక్కటే ఆశ్చర్యపర్చింది. బ్రిటన్‌కు చెందిన జూలీ బామ్, టామ్ సిల్వెస్టర్లు పోలార్ ఫీల్డ్ గైడ్స్(అంటార్కిటికాలో ఓ భాగం). కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఇరువురూ ప్రపంచంలోని సుందరప్రదేశాలను చుట్టేశారు కూడా. ఇక పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని భావించారు. జూలీకి మంచు ప్రాంతాలు, కొండలు అంటే ప్రాణం. దాంతో అంటార్కిటికాలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతంలో రెండు రోజుల పెళ్లి చేసుకోవాలని జంట ప్లాన్ చేసుకుంది. ఈ విషయాన్ని తమతో పాటు కలిసి బిట్రిష్ అంటార్కిటిక్ సర్వేస్(బీఏఎస్)లో పనిచేసే 18 మంది సహచరులకు తెలియజేశారు. అంటార్కిటికాలోని అడిలైడ్ ఐలాండ్ ప్రాంతంలో వివాహ ఏర్పాట్లు చేసిన సహచరులు ప్రేమికులను ఒక్కటి చేశారు. సున్నా డిగ్రీల చలిలో, అంటార్కిటికాలో పెళ్లి చేసుకోవాలనేది దేవుడు నిర్ణయించిందని జూలీ టెలిగ్రాఫ్ దినపత్రికతో పేర్కన్నారు. పెళ్లి చేసుకోవడానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఇంకేదైనా ఉంటుందా? అంటూ ప్రశ్నించారు. అతికొద్దిమంది మేం ఒక్కటవ్వాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాం. అలాంటిది భూమ్మీద ఉన్న ఓ అద్భుతమైన ప్రదేశం వివాహం జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని వరుడు టామ్ చెప్పారు. బ్రిటిష్ అంటార్కిటికాలో జరిగిన మొదటి వివాహం కూడా ఇదే కావడం గమనార్హం.