పట్టుబడిన హెరాయిన్
శంషాబాద్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పదిహేను రోజులుగా టాంజానియా, దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడగా తాజాగా శుక్రవారం మరో మహిళ హెరాయిన్ తీసుకొచ్చిన మహిళను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన మహిళ దోహా మీదుగా ఖతర్ ఎయిర్‌లైన్స్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది.
అనుమానిత దేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు ఆ మహిళ లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నల్లని పాలిథీన్ కవర్‌తో ఉన్న ప్యాకేజిని తొలగించడంతో అందులో 6.75 కేజీల బరువు కలిగిన హెరాయిన్ బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దాని విలువ రూ.54కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. సదరు మహిళ కూడా క్యారియర్‌గా తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment