South African
-
పుతిన్‌ను అరెస్టు చేస్తే.. రష్యాతో యుద్దం తప్పదు: సౌతాఫ్రికా అధ్యక్షుడు
ఆగష్టులో జొహానెస్బర్గ్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరుకానున్నారు. ఈ ఏడాది మార్చిలో పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఐసీసీ సభ్య దేశంగా ఉన్న దక్షిణాఫ్రికా పుతిన్‌ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. దీంతో పుతిన్ అరెస్టు విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుతిన్‌ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధం తప్పదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమపోసో అన్నారు. బ్రిగ్స్ సమావేశం నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు వస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్టు చేయాలని ఆ దేశ ప్రతిపక్ష డెమోక్రటిక్ అలయెన్స్ అక్కడి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టులో విచారణ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో పుతిన్‌ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధం ప్రకటించినట్లేనని రమఫొస పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం చేయడం దక్షిణాఫ్రికా రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టుకు తెలిపారు. మరోవైపు బ్రిక్స్ దేశాల వేదికను తమ దేశం నుంచి మార్చాలన్న ప్రతిపాదనను ఆయా దేశాలు తిరస్కరించినట్లు దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పౌల్ మషతిలే తెలిపారు. గత కొన్నాళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం దురాక్రమణమని పలు దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఐక్యరాజ్య సమితి నియమాలకు విఘాతం కలిగిస్తోందని తెలుపతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్టు చేయాలని కోరాయి. ఆ తర్వాత ఐసీసీ ఆయనపై అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని విరమించాలని పలు దేశాలు కోరుతున్నాయి. ఇదీ చదవండి: మండుతున్న ధరలు, ఆస్తులు అమ్ముకుంటున్న పాకిస్తాన్.. పరిస్థితి కష్టమేనంటున్న ఐఎంఎఫ్ నివేదిక -
రూ. 54 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
శంషాబాద్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పదిహేను రోజులుగా టాంజానియా, దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడగా తాజాగా శుక్రవారం మరో మహిళ హెరాయిన్ తీసుకొచ్చిన మహిళను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన మహిళ దోహా మీదుగా ఖతర్ ఎయిర్‌లైన్స్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అనుమానిత దేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు ఆ మహిళ లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నల్లని పాలిథీన్ కవర్‌తో ఉన్న ప్యాకేజిని తొలగించడంతో అందులో 6.75 కేజీల బరువు కలిగిన హెరాయిన్ బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ రూ.54కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. సదరు మహిళ కూడా క్యారియర్‌గా తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్.. మార్కెట్ విలువ రూ.126 కోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు దేశంలోకి దొంగతనంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. శనివారం జొహన్నెస్‌బర్గ్ నుంచి దోహా మీదుగా వచ్చిన వీరి లగేజీని తనిఖీ చేయగా బ్యాగుల్లో తెల్లటి పౌడర్, గుళికల రూపంలో ఉన్న సుమారు 18 కిలోల బరువున్న రూ.126 కోట్ల విలువైన హెరాయిన్ బయటపడిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ట్రాలీ బ్యాగుల్లో వీటిని కనిపించకుండా దాచి ఉంచారని చెప్పారు. చదవండి: DCPCR: థియరీ ఫార్ములా ప్రాక్టికల్స్‌కు వద్దు Kukatpally: మూఢ నమ్మకం.. తీసింది ప్రాణం -
సిప్లా చేతికి దక్షిణాఫ్రికా ఫార్మా కంపెనీ
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సిప్లా కంపెనీ దక్షిణాఫ్రికాకు చెందిన మిర్రెన్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్నది. ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) ఔషధాలను తయారు చేసే మిర్రెన్ కంపెనీని రూ.228 కోట్లకు (45 కోట్ల దక్షిణాఫ్రికా రాండ్లు) కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని సిప్లా తెలిపింది. మిర్రెన్ లిమిటెడ్‌ను తమ దక్షిణాఫ్రికా అనుబంధ కంపెనీ, సిప్లా మెడ్‌ప్రో సౌత్ ఆఫ్రికా కొనుగోలు చేయనున్నదని వివరించింది. ఈ లావాదేవీకి దక్షిణాఫ్రికా కాంపిటీషన్ కమిషన్ ఆమోదం పొందాల్సి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఈ డీల్ పూర్తవుతుందని పేర్కొంది. దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే మిర్రెన్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 28తో ముగిసే ఏడాదికి 15.21 కోట్లదక్షిణాఫ్రికా రాండ్ల టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ కొనుగోలు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో సిప్లా షేర్ 1.2 శాతం లాభంతో రూ.632 వద్ద ముగిసింది. -
గుప్తా స్కాం: బీవోబీకి సౌత్ ఆఫ్రికా దెబ్బ
జోహన్నెస్‌బర్గ్: అధ్యక్షుడు రాజీనామాకు దారితీసిన గుప్తా స్కాంపై సౌత్ ఆఫ్రికా ప్రతి పక్ష పార్టీ డెమెక్రాటిక్ అలయన్స్(డీఏ) ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) పై క్రిమినల్ చర్యలకు సిద్ధపడుతోంది. ఈ మేరకు హిందూ ఒక కథనాన్ని ప్రచురించింది. ది హిందూ, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ ప్రాజెక్ట్ (ఏసీసీఆర్‌పీ) చేపట్టిన ఒక వివరణాత్మక దర్యాప్తు నేపథ్యంలో ప్రతిపక్షపార్టీ బీవోబీపై చర్యలకు దిగనుందని నివేదించింది. సీనియర్ బ్యాంకు అధికారులు గుప్తా కుటుంబం యాజమాన్యంలోని కంపెనీలతో సహా, సహారా గ్రూపుకు చెందిన వివిధ కంపెనీలకు దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వ సంస్థల నుండి పెద్ద ఎత్తున, వివరణ లేని చెల్లింపులు చేశారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా జూనియర్ ఉద్యోగులు లేవనెత్తిన అనుమానాస్పద లావాదేవీల నివేదికలను (ఎస్.ఆర్.ఎస్) ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని విమర్శించింది. జోహాన్నెస్‌బర్గ్‌లో బీవోబీ బ్రాంచ్‌లో ఈ అక్రమ లావాదేవీలు ఎక్కువగా 2016 లో నమోదైనట్టు గుర్తించింది. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డీఏ భావిస్తోంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ చట్టం 29 , 52 సెక్షన్ల ప్రకారం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఈ భారీకుంభకోణంపై తమ పోరాటం కొనసాగుతుందని డీఏ పార్టీ ప్రతినిధి నటాషా మజ్జోన్ స్పష్టం చేశారు. 1990లలో భారతదేశం నుంచి వలస వెళ్లిన గుప్తా బ్రదర్స్ అతుల్, అజయ్, రాజేష్ - దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సహకారంతో బిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన గుప్తా కుటుంబంతో జుమాకు సన్నిహిత్ సంబంధాలు వివాదాస్పదంగా మారాయి. వీటితోపాటు పలు అవినీతి ఆరోపణలు. చివరకు అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఒత్తిడి ఈ ఏడాది ఫిబ్రవరి 14న జుమా రాజీనామాకు దారితీసింది. అదే రోజున, జోహెన్నెస్ బర్గ్‌లోని గుప్తా భవనంపై పోలీసులు దాడి చేయడంతోపాటు అజయ్గుప్తాకు అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. అలాగేమాజీ ప్రెసిడెంట్ కొడుకు డ్యుడ్యూజనే సహా, ముగ్గురు గుప్తా సోదరులు దుబాయ్‌కి పారిపోయారని భావిస్తున్నారు. మరోవైపు సౌత్ ఆఫ్రికాలో కార్యకలాపాలను నిలిపివేయాలని బీవోబీ నిర్ణయించింది. తమ కార్యకలాపాలు ఎప్పుడూ ఆ దేశంలోని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే కొనసాగాయని వివరించింది. -
నాలుగో టెస్టుకు స్టెయిన్ దూరం
న్యూఢిల్లీ: ఫిరోజ్ షా కోట్లలో భారత్‌తో గురువారం నుంచి జరిగే నాలుగో టెస్టులో సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ గాయం కారణంగా ఆడటం లేదు. ప్రస్తుతం డేల్ స్టెయిన్ ఫిట్‌గా లేకపోవడంతో నాలుగో టెస్ట్‌లో ఆడటం లేదని హషిం ఆమ్లా బుధవారం తెలిపారు. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న డేల్ స్టెయిన్ మంగళవారం జట్టుతో పాటు ప్రాక్టీస్‌కు వచ్చి నెట్ సెషన్లో పాల్గొనలేదు. కనీసం బౌలింగ్ స్పైక్స్ కూడా లేకుండా మైదానంలోకి వచ్చిన స్టెయిన్ సీట్‌కే పరిమితమయ్యాడు. -
వీళ్లతో గెలుస్తామా..?
అశ్విన్ మినహా బౌలర్లంతా పేలవం టి20 ప్రపంచ కప్ ముంగిట ఇబ్బంది ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో భారత్ ఒక్క బౌలర్‌తోనే ఆడుతోంది..! అతిశయోక్తిలా అనిపించినా వాస్తవం ఇలాగే ఉంది. ఒక్క అశ్విన్‌ను మినహాయిస్తే మిగిలిన నలుగురు బౌలర్లూ దారుణంగా తేలిపోయారు. వీళ్లకంటే స్కూల్ పిల్లలు నయమనే తరహాలో బౌలింగ్ చేస్తూ... టి20 ఫార్మాట్లో మన బౌలింగ్ స్థాయి ఎక్కడుందో చూపించారు. ఆరు నెలల్లో స్వదేశంలోనే టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ బౌలింగ్ లైనప్‌తో ఎలా గెలుస్తారనేదే ప్రశ్న. సాక్షి క్రీడా విభాగం కటక్‌లో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో 20 ఏళ్ల దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కాగిసో రబడ 140 కిలో మీటర్ల వేగంతో బంతులు వేస్తూ... అడపా దడపా 150 కి.మీ.ని దాటి బంతులు విసిరాడు. ఇక బౌన్స్ ఉన్న ధర్మశాలలో అయితే అతని బంతులను అందుకునేందుకు కీపర్ డివిలి యర్స్ చాలా సార్లు ఆకాశాన్ని అందుకోవాలా అన్నట్లుగా ఎగరాల్సి వచ్చింది. పలు సార్లు చక్కటి బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన రబడ అంపైర్ హెచ్చరికకు కూడా గురయ్యాడు. అదే మన పేసర్లు భువనేశ్వర్, మోహిత్, అరవింద్ కలిసి ఒక్కటంటే ఒక్క బౌన్సర్ కూడా వేసింది లేదు! ఆశ్చర్యమే అనిపిస్తున్నా మనోళ్ల పేస్ అంటే నేతి బీరకాయలో నేయి చందమే. కచ్చితంగా వికెట్ దక్కాల్సిన అవసరం లేదు కానీ.... 120 బంతుల ఇన్నింగ్స్‌లో ఇలాంటి పరుగు రాని బంతుల విలువ ఎక్కువే ఉంటుంది. పైగా బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలో నెట్టేందుకు ఇవి చాలు. స్టార్ బౌలర్లు స్టెయిన్, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్ లేకుండా దక్షిణాఫ్రికా ద్వితీయ శ్రేణి పేసర్లు కూడా ప్రభావం చూపిస్తున్న చోట మనోళ్లు తేలిపోతున్నారు. ఉమేశ్ పనికి రాడా..?‘మా ఫాస్ట్ బౌలర్లపై విశ్వాసం కోల్పోలేదు. సిరీస్ జరుగుతున్న పిచ్‌లను బట్టి జట్టును ఎంపిక చేశాం. ఇషాంత్ పేరు కూడా చర్చించాం. అతడు టెస్టులకే పరిమితం కాదు’... టి20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన అనంతరం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ వ్యాఖ్య ఇది. అయితే ఈ లాజిక్‌లో అర్థం లేకపోవడంతో పాటు గందరగోళం కూడా కనిపిస్తోంది. సాధారణంగా అందుబాటులో ఉన్న (ఫిట్నెస్ సమస్యలు లేకుండా) అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలనేది ప్రాథమిక సూత్రం. అయితే ఈ సిరీస్‌లో ఉన్న భువీ, మోహిత్, అరవింద్ ఒకే తరహాలో బౌలింగ్ చేసే సాధారణ మీడియం పేసర్లు. ఎక్కువగా స్వింగ్‌పై ఆధారపడేవారే. తమ వేగంతో ఫలితం రాబట్టగల సామర్థ్యం వీరిలో లేదు. అలాంటప్పుడు ఒక ఫుల్‌లెంగ్త్ ఫాస్ట్ బౌలర్ జట్టులో ఉండాలి. ఉమేశ్ చాలా కాలంగా జట్టులో రెగ్యులర్ సభ్యుడు. వరల్డ్ కప్‌లో చాలా బాగా రాణించాడు. దీనికి ముందు శ్రీలంక సిరీస్‌లోనూ జట్టులో ఉన్నాడు. టి20 స్పెషలిస్ట్‌లు అని పేరు లేకపోయినా... ఇషాంత్, ఆరోన్ తమ వేగంతో బౌలింగ్‌కు వైవిధ్యం తీసుకు రాగలరు. వీరిని ఎందుకు పక్కన పెట్టారో కూడా కనీస కారణం సెలక్టర్లు చెప్పలేకపోయారు. స్పిన్నర్లు ఎక్కడ? మన దేశంలో నాణ్యమైన స్పిన్నర్లు లేరు అంటూ అధ్యక్షుడిగా వచ్చీ రాగానే శశాంక్ మనోహర్ వ్యాఖ్యానించడం ఒక రకంగా అవమానకర విషయం. జడేజాకు ప్రత్యామ్నాయం అంటూ తీసుకొచ్చిన అక్షర్ పటేల్ సాధారణంగా కనిపిస్తున్నాడు. ‘స్పిన్‌లో వైవిధ్యం చూపించని అక్షర్ అతి సాధారణ బౌలర్. సులువుగా అతడి బంతులను బ్యాట్స్‌మెన్ అంచనా వేయవచ్చు. అంతర్జాతీయ బౌలర్‌గా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని గవాస్కర్ విమర్శించడం పరిస్థితిని సూచిస్తోంది. బహుశా దీని వల్లే డుమిని తొలి టి20లో వరుసగా మూడు సిక్సర్లతో చెలరేగి మ్యాచ్ దిశను మార్చాడు. సోమవారం మ్యాచ్‌లో అక్షర్‌ను పక్కన పెట్టి రైనాతో పూర్తి కోటా వేయించడం చూస్తే రెగ్యులర్ స్పిన్నర్ల స్థితి అర్థమవుతుంది. గత రెండేళ్లుగా అశ్విన్ ఎంతో ఎదిగిపోగా... రెండో స్పిన్నర్‌గా ఎవరూ ప్రభావం చూపడం లేదు. కెరీర్ చివర్లో ఉన్న హర్భజన్ వరల్డ్ కప్ వరకు జట్టులో ఉంటాడో లేదో కూడా తెలీదు. మిశ్రా, కరణ్ శర్మలకు పూర్తి స్థాయి అవకాశాలే రాలేదు. పరీక్ష ఎప్పటి వరకు ప్రపంచకప్‌లోగా టి20 మ్యాచ్‌ల్లో ఫలితాలకంటే అన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలించడం, అందరికీ అవకాశం ఇవ్వడం ముఖ్యమని కెప్టెన్ ధోని చెబుతున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత భారత్ ఆస్ట్రేలియా వెళ్లి 5 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు కూడా ఆడుతుంది. అక్కడ టి20లు ఆడటం భారత్‌లో జరిగే ప్రపంచకప్‌కు పెద్దగా పనికి రాకపోవచ్చు. కానీ ఐపీఎల్లో తమ ఫ్రాంచైజీల తరఫున చెలరేగే బౌలర్లు... అంతర్జాతీయ మ్యాచ్‌లో మాత్రం తేలిపోతున్నారు. మోహిత్, భువీ, అక్షర్... ఎవరైనా అంతే. పరిస్థితి చూస్తే అరవింద్ కెరీర్ ఒక్క మ్యాచ్‌కే ముగిసిపోతుందేమోఅనిపిస్తుంది. అలాంటప్పుడు వరల్డ్ కప్‌లోగా ఎంత మందిని పరీక్షిస్తారు, చివరకు ఎలాంటి జట్టుతో సిద్ధమవుతారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న బృందంతో మాత్రం భారత్ మ్యాచ్‌లు గెలవడం చాలా కష్టం. -
గాంధీ - మండేలా సిరీస్
-
హైజాకింగ్ తరహాలో కార్జాకింగ్
-
హైజాకొంగ్ తరహాలో కార్జాకింగ్