
నాలుగో టెస్టుకు స్టెయిన్ దూరం
ఫిరోజ్ షా కోట్లలో భారత్తో గురువారం నుంచి జరిగే నాలుగో టెస్టులో సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ గాయం కారణంగా తప్పుకున్నాడు.
న్యూఢిల్లీ: ఫిరోజ్ షా కోట్లలో భారత్తో గురువారం నుంచి జరిగే నాలుగో టెస్టులో సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ గాయం కారణంగా ఆడటం లేదు. ప్రస్తుతం డేల్ స్టెయిన్ ఫిట్గా లేకపోవడంతో నాలుగో టెస్ట్లో ఆడటం లేదని హషిం ఆమ్లా బుధవారం తెలిపారు.
గజ్జల్లో గాయంతో బాధపడుతున్న డేల్ స్టెయిన్ మంగళవారం జట్టుతో పాటు ప్రాక్టీస్‌కు వచ్చి నెట్ సెషన్‌లో పాల్గొనలేదు. కనీసం బౌలింగ్ స్పైక్స్ కూడా లేకుండా మైదానంలోకి వచ్చిన స్టెయిన్ సీట్‌కే పరిమితమయ్యాడు.