ఆగష్టులో జొహానెస్‌బర్గ్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరుకానున్నారు. ఈ ఏడాది మార్చిలో పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఐసీసీ సభ్య దేశంగా ఉన్న దక్షిణాఫ్రికా పుతిన్‌ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. దీంతో పుతిన్ అరెస్టు విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుతిన్‌ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధం తప్పదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమపోసో అన్నారు.
బ్రిగ్స్ సమావేశం నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు వస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్టు చేయాలని ఆ దేశ ప్రతిపక్ష డెమోక్రటిక్ అలయెన్స్ అక్కడి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. కోర‍్టులో విచారణ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో పుతిన్‌ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధం ప్రకటించినట్లేనని రమఫొస పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం చేయడం దక్షిణాఫ్రికా రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టుకు తెలిపారు. మరోవైపు బ్రిక్స్ దేశాల వేదికను తమ దేశం నుంచి మార్చాలన్న ప్రతిపాదనను ఆయా దేశాలు తిరస్కరించినట్లు దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పౌల్ మషతిలే తెలిపారు.
గత కొన్నాళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం దురాక్రమణమని పలు దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఐక్యరాజ్య సమితి నియమాలకు విఘాతం కలిగిస్తోందని తెలుపతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్టు చేయాలని కోరాయి. ఆ తర్వాత ఐసీసీ ఆయనపై అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని విరమించాలని పలు దేశాలు కోరుతున్నాయి.
ఇదీ చదవండి: మండుతున్న ధరలు, ఆస్తులు అమ్ముకుంటున్న పాకిస్తాన్.. పరిస్థితి కష్టమేనంటున్న ఐఎంఎఫ్ నివేదిక
Comments
Please login to add a commentAdd a comment