అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల విలువచేసే హెరాయిన్‌ను చెన్నై లో పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, చెన్నై పోలీసుల సంయుక్తంగా పూందమల్లిలో చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. 18 కిలోల హెరాయిన్‌తో పాటు ముగ్గుర్ని అరెస్టు చేశారు.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోచాపకింద నీరు లా మాదక ద్రవ్యాల విక్రయాలు సాగుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో తరచూ పోలీసుల తనిఖీల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నా యి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కోట్ల విలువచేసే మాదక ద్రవ్యాలతో పాటు విదేశీ ముఠాను చెన్నైలో పోలీసులు అరెస్టు చే శారు. ఇటీవల ఢిల్లీ పోలీసులకు చిక్కిన ఓ నింధితుడి వద్ద జరిపిన విచారణ మేరకు చెన్నై కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలకు మాద్యద్రవ్యాలు తరలుతున్నట్టు తేలింది. దీంతో ఢిల్లీ, చెన్నైలోని మాదక ద్రవ్యాల నియంత్రన విభాగం పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. రెండు రోజుల క్రితం రవి అనే వ్యక్తి వద్ద జరిపిన విచారణతో పూందమల్లిలో ఓ ఇంట్లోని వ్యక్తి అనుమానాస్పదంగా తరచూ కళాశాలల వద్ద కనిపించినట్టు తేలింది. అతడి పేరు పెరుమాల్. అతడికి రవి అనే వ్యక్తి ఇంటిని అద్దెకు ఇప్పించినట్టు గుర్తించారు.
ఆపరేషన్
ఢిల్లీ, చెన్నై పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి పూందమల్లి నరసింహ నగర్‌లోని ఆ ఇంటి పరిసరాల్లో తిష్టవేశారు. శనివారం అర్థరాత్రి ఆ ఇంటిపై దాడులు చేశారు. ఇంట్లో ఉన్న ముగ్గుర్నీ అరెస్టు చేశారు. అక్కడి సూట్ కేసుల్లో ఉన్న పార్సిళ్లను పరిశీలించి హెరాయిన్‌గా తేల్చారు. ఆ ముగ్గురిలో ఒక రు తిరునల్వేలికి చెందిన పెరుమాల్‌గా గుర్తించారు. మరో ఇద్దరు శ్రీలంకకు చెందిన రఫీక్(61), డెఫిక్(41)గా తేల్చారు. వీరిద్దరూ తండ్రీకొడుకులుగా నిర్ధారణ అయ్యింది. వీరి వద్ద నుంచి పట్టుబడ్డ 18 కిలోల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.వంద కోట్లు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరి కొందరు వాటి విలువ రూ.యాభై కోట్లు ఉండొచ్చని పేర్కొంటున్నారు.
విచారణ వేగవంతం
ఈ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ప్రధానంగా రఫీక్, డెఫిక్‌ల వద్ద విచారణ వేగవంతమైంది. శ్రీలంకకు చెందిన వాళ్లు ఇది వరకు చెన్నైలో పట్టుబడడం, వారంతా ఐఎస్‌ఐ ఏజెంట్లుగా తేల్చారు. ఈ దృష్ట్యా, తాజాగా పట్టుబడ్డ వీరు ఐఎస్‌ఐ ఏజెంట్లా..? అన్న అనుమానాలు బయలు దేరాయి. అలాగే, నగర శివారుల్లో ఇరవై కళాశాలల పరిసరాల్లో తరచూ పెరుమాల్ కనిపిస్తుండడంతో, వీరి వలలో పడ్డ విద్యార్థుల వివరాల్ని సేకరించేందుకు పోలీసులు ఉరకలు తీస్తున్నారు.
హెరాయిన్ పట్టివేత
Published Mon, Oct 20 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM
Advertisement
Advertisement