
హన్సికకు రక్తపరీక్ష
చెన్నై: తనకేం కాలేదని, తాను బాగానే ఉన్నానని హీరోయిన్ హన్సిక తెలిపింది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, కంగారు పడాల్సిన పనిలేదని ట్విటర్ ద్వారా సోమవారం వెల్లడించింది. హన్సిక రక్త పరీక్ష చేయించుకుందని తెలియడంతో ఆమె సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందారు. 'ఏం జరిగింది. ఏమైనా సీరియస్సా' అంటూ ట్వీట్లు చేశారు. విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యమే ముఖ్యమని ఆమెకు సలహా ఇచ్చారు.
అయితే రెగ్యులర్ చెకప్ లో భాగంగానే టెస్టు చేయించుకున్నానని హన్సిక వివరణ ఇచ్చింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. పరీక్ష కోసం రక్తం తీసుకున్నప్పుడు తాను గట్టిగా ఏడ్చానని, తన తల్లి ఎంతో ఓపికగా సముదాయించిందని అంతకుముందు హన్సిక ట్వీట్ చేసింది. దీంతో కంగారు పడిన అభిమానులు ఆమె ఆరోగ్యంపై ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం హన్సిక పలు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
I can cry the loudest when it comes 2 taking a blood test!Thank god for my mothers patiences!Squeezed the poor thing!#earlymorncrybaby lol
— Hansika (@ihansika) November 30, 2015