JD Chakravarthy And Uttej Comments On Rambha Thighs - Sakshi
Sakshi News home page

Jd Chakravarthy And Uttej: మేమిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్‌ కోసం అర్ధరాత్రి వెళ్లే వాళ్లం

Published Sun, Jul 16 2023 7:03 PM | Last Updated on Mon, Jul 17 2023 9:34 AM

Jd Chakravarthy And Uttej Comments On Rambha Thighs - Sakshi

టాలీవుడ్‌లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమాతో జర్నీ మొదలుపెట్టిన జేడీ చక్రవర్తి తాజాగా  మర్డర్‌ మిస్టరీగా రూపొందిన   'దయ' వెబ్‌సీరిస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డిస్నీ + హాట్‌స్టార్‌లో  ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. పవన్‌ సాధినేని దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో ఈషా రెబ్బా,విష్ణు ప్రియ, పృథ్వీరాజ్‌, కమల్‌ కామరాజు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమాన్ని చిత్రబృందం ఏర్పాటు చేసింది.  ఈ కార్యక్రమంలో  జెడి స్నేహితుడు ఉత్తేజ్ కూడా పాల్గొని పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశాడు.  

(ఇదీ చదవండి: వాళ్ల కోసమే బూతు సినిమాలు చేశా.. పాత రోజుల్ని గుర్తుచేసుకున్న సన్నీ లియోన్‌)

జేడీ గురించి చెబుతూ..  'చాలా ఏళ్ల క్రితం  ఇద్దరం కలిసి పంజాగుట్ట దగ్గర అర్థరాత్రి సమయంలో హీరోయిన్‌ రంభ తొడలు చూడటానికి వెళ్లిన బ్యాచ్ మేమిద్దరం. అక్కడ ఒక సినిమాకు చెందిన రంభ కటౌట్‌ చాలా పెద్దది పెట్టారు. అబ్బా ఏముందిరా రంభ అని కారులో వెళ్లి చూసొచ్చిన బ్యాచ్‌ మాది. తర్వాత అదే రంభతో బొంబాయి ప్రియుడు సినిమాలో హీరోగా చేసిన ఫ్రెండ్‌ వీడు' అంటూ ఉత్తేజ్‌ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.

జేడీకి సినిమాలంటే పిచ్చి. దర్శకత్వం అని ఎదో కొంచెం రూట్‌ మార్చాడు కానీ లేదంటే టాప్‌ హీరోలలో జేడీ కూడా ఒకడిగా ఉండేవాడని ఉత్తేజ్‌ తెలిపాడు. ఒకరకంగా చెప్పాలంటే జేడీ టాలీవుడ్‌ అమిర్‌ఖాన్‌ అంటూ ప్రశంసించాడు. అతనికి సినిమా తప్పితే ఇంకేమి తెలియదు. ఏ సినిమా గురించి అయినా కానివండి అర్దరాత్రి అడిగినా..  ఆ సినిమాకు సబంధించిన దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఇలా పేర్లన్నీ చెప్పేస్తాడని పేర్కొన్నాడు. అంతలా అతనిలో సినిమా గురించి నాలెడ్జి ఉందని తెలిపాడు. బొంబాయి వెళ్లి 'సత్య' చేసినా... హైద్రాబాదులో 'బొంబాయి ప్రియుడు' చేసినా... అతనికి సినిమా తప్ప ఇంకేమి తెలియదని జేడీ గురించి ఉత్తేజ్‌ చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement