
చేతికి గ్లౌజులు తొడుక్కుని తన పంచ్ పవరేంటో చూపించడానికి రెడీ అవుతున్నారు సంజన. ఈ పంచ్‌లు ఎవరి మీద పడతాయో వేచి చూడాలి. అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బాక్సర్’. వివేక్ కణ్ణన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సంజన హీరోయిన్. శుక్రవారం ఈ చిత్రం ప్రారంభమైంది. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ బాక్సర్స్‌గా కనిపిస్తారు. ఈ సినిమా ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు సంజన. ‘‘ఇందులో నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్ర నాది.
ఇంతకు ముందు సినిమాల కోసం నేర్చుకున్న గుర్రపు స్వారీ, నా ఫిజిక్ ఈ సినిమాకి అవకాశం వచ్చేలా చేశాయి. ఈ సినిమాలో నా పాత్రను చూసి కచ్చితంగా షాక్ అవుతారు. సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాను’’ అన్నారు సంజన. ఈ సినిమా కాకుండా రెండు కన్నడ చిత్రాలు, ఓ తమిళ వెబ్ సిరీస్‌తో సంజన బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment