కైకలూరు/కైకలూరు టౌన్ : మత్తు పదార్థం అక్రమ రవాణా అనుమానంపై డెరైక్టరేట్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు గురువారం మండలంలోని గోపవరం ఐస్ ప్యాకింగ్ సెంటర్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చెన్నై, హైదారా బాదు బ్రాంచీలకు చెందిన 15 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 10 గంటల వర కు సిబ్బందిని విచారణ చేశారు.
నాగిరెడ్డి నారాయణరావుకు చెందిన ప్యాకింగ్ సెంటర్‌ను కైకలూరుకు చెందిన జాన్‌బాబు కొంతకాలంగా లీజుకు తీసుకుని నడుపుతున్నాడు. ఇక్కడ చేపల లోడుకు సిద్ధంగా ఉంచిన ఏపీ 35టీ 6934 లారీలో ఇసుకను అధికారులు ఆసాంతం పరిశీలించారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే చేపల లోడు లారీల్లో అడుగుభాగాన హెరాయిన్ రవాణా అవుతుందనే సమాచారంతో ఈ దాడి చేసి నట్లు తెలుస్తోంది. చివరకు అధికారులు మాట్లాడుతూ సోదాలు చేయడానికి ఇక్కడకు వచ్చామని... ఎటువంటి మత్తుపదార్ధాలు దొరకలేదని చెప్పారు.
తీగ లాగితే డొంక కదిలింది
డెరైక్టరేట్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం ప్రకారం ముందుగా జిల్లాలోని నిడమానూరులో లారీడ్రైవర్ చదర్లమూడి సురేష్ బాబును ఈ విషయంపై అదుపులోకి తీసుకున్నారు. అతని సమాచారం మేరకు విజయవాడలో ఉంటున్న యలమంచిలి సీతారామప్రసాద్ (నాని)ని అదుపులోకి తీసుకున్నారు. నాని మండవల్లి మండలం కాకతీ యనగర్‌కు చెందిన వ్యక్తి. గతంలో ఇక్కడ చేపల వ్యాపారం చేసి నష్ట్రాలు రావడంతో విజయవాడలో ఉంటున్నాడు. అతనికి చెందిన లారీ గోపవరంలోని జాన్‌బాబు ఐస్‌ప్యాకింగ్ సెంటర్‌కు బుధవారం రాత్రి వచ్చింది. దానిని అనుసరించి అధికారులు వచ్చారు.
జాన్‌బాబు మరికొందరిని విచారించారు. సాధార ణంగా చేపల లోడులో ఊకపొట్టును ఉపయోగిస్తారు. అలాంటిది ఈ లారీలో సగ భాగం ఇసుక ఉంది. ఇందులో మత్తుపదార్థం దాచి ఉంచారనే అనుమా నంతో ఇసుకను జల్లెడపట్టారు. ముందస్తు సమాచారం తెలియడంతో సరుకును మాయం చేసి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు అనుమాని తులుగా భావించి సురేష్, నాని, లారీ డ్రైవర్ బాలరాజును విచారణ నిమిత్తం డీఆర్‌ఐ అధికారులు తీసుకువెళ్లారు.ల ారీని రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
హెరాయిన్ అక్రమ రవాణా అనుమానం
Published Fri, Aug 30 2013 2:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
Advertisement
Advertisement