
మహిళలు, బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్' (MSSC) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ 2023 జూన్ 27న ప్రారంభించింది. ఇది ఈ నెల చివరి నాటికి క్లోజ్ అవుతుందని తెలుస్తోంది. ఇంతకీ ఈ పథకానికి అర్హులు ఎవరు?, ఎలా అప్లై చేయాలి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
MSSC స్కీమ్ కోసం ఎవరు అర్హులు
➤ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలనుకునేవారు భారతీయులే ఉండాలి.
➤ఈ స్కీమ్ కేవలం స్త్రీలకు మాత్రమే.
➤వ్యక్తిగతంగా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. మైనర్ ఖాతా అయితే తండ్రి / సంరక్షకులు ఓపెన్ చేయవచ్చు.
➤గరిష్ట వయోపరిమితి లేదు, కాబట్టి ఎవరైనా మహిళలు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి?
●మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలనుకునేవారు.. సమీపంలో ఉండే పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ లేదా ఈ ఫథకం ఉన్న బ్యాంకులో అప్లై చేసుకోవాలి.
●ముందుగా అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫామ్ డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన వివరాలను ఫిల్ చేసిన తరువాత.. కావలసిన డాక్యుమెంట్స్ జతచేయాల్సి ఉంటుంది.
●ఎంత డిపాజిట్ చేస్తారో ధరఖాస్తులోనే వెల్లడించాలి (రూ. 1000 నుంచి రూ. 2 లక్షల వరకు).
అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమంట్స్
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకానికి అప్లై చేసుకోవడానికి.. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డిపాజిట్ చేసే మొత్తం లేదా చెక్, అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ వంటి డాక్యుమెంట్స్ అవసరం.
పెట్టుబడి ఎంత పెట్టాలి? వడ్డీ ఎంత వస్తుంది
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో రూ. 1000 నుంచి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం గడువు రెండేళ్లు. ఇందులో వడ్డీ 7.5 శాతం ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేస్తే.. రెండు సంవత్సరాల తరువాత అసలు, వడ్డీ కలిపి తీసుకోవచ్చు. ఏదైనా అత్యవసర సమయంలో డిపాజిట్ మొత్తంలో 40 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ముందుగా విత్‌డ్రా చేసుకుంటే వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తి
Comments
Please login to add a commentAdd a comment