సాక్షి, ముంబై: తమ పెట్టుబడికి గరిష్ట ఆదాయం రావాలని ప్రతి పెట్టుబడిదారుడు కోరుకుంటాడు. అలాంటి వారికోసం పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. పదేళ్ల లోపే అంటే.. తొమ్మిదేళ్ల ఏడు నెలల వ్యవధిలోనే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం లభించే పథకం కిసాన్ వికాస పత్ర.
మార్కెట్లో పెట్టుబడికి విభిన్న అప్షన్స్ ఉన్నాయి. అయితే రిస్క్‌లేని, సాధారణ ప్రజలకు మొగ్గు చూపుతారు. అలాంటి పోస్ట్ ఆఫీస్ స్కీం గురించి తెలుసుకుందాం. కిసాన్ వికాస్ పత్ర లేదా కేవీపీ. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో, పెట్టుబడిదారుడు ఒకేసారి మొత్తాన్ని పెట్టుబడి పెడితే, నిర్ణీయ కాల వ్యవధిలో రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు.
పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర
♦ కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ పథకం కిసాన్ వికాస్ పత్ర ప్రారంభ లక్ష్యం రైతులను డబ్బు ఆదా చేసేలా ప్రారంభించినా తరువాత, ఎవరైనా సాధారణ వ్యక్తి ఎటువంటి పరిమితులు లేకుండా కొనుగోలు చేయవచ్చు.
♦ ఏప్రిల్ 1, 2023న అమల్లోకి వచ్చిన వడ్డీరేట్ల ప్రకారం 7.5 శాతం వడ్డీ చెల్లిస్తుంది. అంతేకాదు కిసాన్ వికాస్ పత్ర పథకం కింద డిపాజిట్ల రెట్టింపు కాలపరిమితిని కూడా తగ్గించింది. గతంలోని 120 నెలలతో పోలిస్తే కేవలం 115 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది.
♦ ఇందులో కనిష్టంగా రూ. 1,000 నుంచి, గరిష్టంగా ఎంతైనా ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు.
ఇదీ చదవండి: రూ.2 వేల నోటు: జూన్ బ్యాంకు హాలిడేస్ లిస్ట్ చూస్తే షాకవుతారు!
కిసాన్ వికాస్ పత్ర: అర్హతలు
♦ కిసాన్ వికాస్ పత్రాన్ని కనీసం 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరుడు సమీపంలోని పోస్టాఫీసులో కొనుగోలు చేయవచ్చు.
♦ మైనర్లు, మానసిక అనారోగ్యంతో ఉన్న వారి తరపున పెద్దవారు దరఖాస్తును సమర్పించవచ్చు.
♦ ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) హిందూ అవిభక్త కుటుంబాలు ఇక్కడ పెట్టుబడి పెట్టలేరు.
♦ ఈ పథకంలో 10 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 115 నెలల తర్వాత మెచ్యూరిటీ సమయంలో 20 లక్షలు.
పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రలో ఎలా పెట్టుబడి పెట్టాలి?
♦ దగ్గరలోని పోస్టాఫీసులో కేవీపీదరఖాస్తు ఫారమ్-Aని నింపాలి.
♦ గుర్తింపు పత్రాలలో ఏదైనా ఒకదాని కాపీని అందించాలి.
♦ పత్రాలను పరిశీలించి, అవసరమైన డిపాజిట్ చేసిన అనంతరం కేవీపీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు.\
మరిన్ని ఆసక్తికర విషయాలు, కథనాల కోసం చదవండి సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment