Double benefits
-
కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!
సాక్షి, ముంబై: తమ పెట్టుబడికి గరిష్ట ఆదాయం రావాలని ప్రతి పెట్టుబడిదారుడు కోరుకుంటాడు. అలాంటి వారికోసం పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. పదేళ్ల లోపే అంటే.. తొమ్మిదేళ్ల ఏడు నెలల వ్యవధిలోనే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం లభించే పథకం కిసాన్ వికాస పత్ర. మార్కెట్లో పెట్టుబడికి విభిన్న అప్షన్స్ ఉన్నాయి. అయితే రిస్క్‌లేని, సాధారణ ప్రజలకు మొగ్గు చూపుతారు. అలాంటి పోస్ట్ ఆఫీస్ స్కీం గురించి తెలుసుకుందాం. కిసాన్ వికాస్ పత్ర లేదా కేవీపీ. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో, పెట్టుబడిదారుడు ఒకేసారి మొత్తాన్ని పెట్టుబడి పెడితే, నిర్ణీయ కాల వ్యవధిలో రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు. పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర ♦ కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ పథకం కిసాన్ వికాస్ పత్ర ప్రారంభ లక్ష్యం రైతులను డబ్బు ఆదా చేసేలా ప్రారంభించినా తరువాత, ఎవరైనా సాధారణ వ్యక్తి ఎటువంటి పరిమితులు లేకుండా కొనుగోలు చేయవచ్చు. ♦ ఏప్రిల్ 1, 2023న అమల్లోకి వచ్చిన వడ్డీరేట్ల ప్రకారం 7.5 శాతం వడ్డీ చెల్లిస్తుంది. అంతేకాదు కిసాన్ వికాస్ పత్ర పథకం కింద డిపాజిట్ల రెట్టింపు కాలపరిమితిని కూడా తగ్గించింది. గతంలోని 120 నెలలతో పోలిస్తే కేవలం 115 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది. ♦ ఇందులో కనిష్టంగా రూ. 1,000 నుంచి, గరిష్టంగా ఎంతైనా ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇదీ చదవండి: రూ.2 వేల నోటు: జూన్ బ్యాంకు హాలిడేస్ లిస్ట్ చూస్తే షాకవుతారు! కిసాన్ వికాస్ పత్ర: అర్హతలు ♦ కిసాన్ వికాస్ పత్రాన్ని కనీసం 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరుడు సమీపంలోని పోస్టాఫీసులో కొనుగోలు చేయవచ్చు. ♦ మైనర్లు, మానసిక అనారోగ్యంతో ఉన్న వారి తరపున పెద్దవారు దరఖాస్తును సమర్పించవచ్చు. ♦ ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) హిందూ అవిభక్త కుటుంబాలు ఇక్కడ పెట్టుబడి పెట్టలేరు. ♦ ఈ పథకంలో 10 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 115 నెలల తర్వాత మెచ్యూరిటీ సమయంలో 20 లక్షలు. పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రలో ఎలా పెట్టుబడి పెట్టాలి? ♦ దగ్గరలోని పోస్టాఫీసులో కేవీపీదరఖాస్తు ఫారమ్-Aని నింపాలి. ♦ గుర్తింపు పత్రాలలో ఏదైనా ఒకదాని కాపీని అందించాలి. ♦ పత్రాలను పరిశీలించి, అవసరమైన డిపాజిట్ చేసిన అనంతరం కేవీపీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు.\ మరిన్ని ఆసక్తికర విషయాలు, కథనాల కోసం చదవండి సాక్షిబిజినెస్ -
ఇన్ఫోసిస్ ఉద్యోగులపై కొరడా: అతిక్రమిస్తే అంతే!
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. తమ అనుమతి లేకుండా పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకోవడానికి వీల్లేదంటూ అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులకు సెప్టెంబరు 12న ఈమెయిల్ సమాచారాన్ని పంపింది. ఉద్యోగుల హ్యాండ్‌బుక్, ప్రవర్తనా నియమావళి ప్రకారం ద్వంద్వ ఉపాధికి అనుమతి లేదని స్పష్టం చేసింది. అంతేకాదు దీన్ని ఉల్లంఘించినవారికి టెర్మినేషన్ తప్పదని కూడా హెచ్చరించింది. వర్క్ ఫ్రం హోం విధానంలో మూన్‌లైటింగ్ (ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు)లు అనేది అంశంలో పెరుగుదల కనిపించిందని ఇన్ఫోసిస్ పేర్కొంది. తమ అనుమతి లేకుండా ఉద్యోగి ఏదైనా వ్యాపార కార్యకలాపాల్లో పూర్తి సమయం లేదా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపడం తోపాటు, ఉద్యోగ పని తీరు, డేటా ప్రమాదం , రహస్య సమాచారం లీకేజీ వంటి తీవ్రమైన సవాళ్లు ఉత్పన్న మవుతాయని తెలిపింది. మరో టెక్ దిగ్గజం విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఈ పద్ధతి మోసం అని వ్యాఖ్యానించిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌తో 9 గంటలు మాత్రమే పని చేయడానికి ఒప్పందం ఉంది. ఉద్యోగులు పనివేళల వెలుపల ఏమి చేస్తారు అనేది వారి ప్రత్యేక హక్కు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి పౌరునికి జీవనోపాధి పొందే హక్కును అందించింది, కాబట్టి ఉద్యోగులకు పంపే ఇటువంటి ఇమెయిల్‌లు చట్టవిరుద్ధం, అనైతికమని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ వాదిస్తోంది. ఉద్యోగులుఎంప్లాయి అగ్రిమెంట్, నిబంధనలకు కట్టుబడి ఉంటారని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, ఆరిన్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు టీవీ మోహన్‌దాస్ పాయ్ ఇటీవల వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, కంపెనీ ఐపీని ఉపయోగించనంతవరకు కోరుకున్నది చేసుకునే హక్కు ఉంటుందన్నారు. అలాగే ఉద్యోగులు ఎందుకు మూన్‌లైట్‌ని కోరుకుంటున్నారో కంపెనీలు తెలుసుకోవాలని, వారికి తక్కువ వేతనం ఇస్తున్నామా అనేది చూసుకోవడం ముఖ్యమన్నారు. మార్కెట్ పోటీ, రోజురోజుకు పెరుగుతున్న అట్రిషన్‌తో ఇబ్బందులు పడుతున్న ఐటీ కంపెనీల్లో మూన్‌లైటింగ్ గుబులు పుట్టిస్తోంది. వర్క్-ఫ్రమ్-హోమ్ చేసే ఉద్యోగుల్లో 65 శాతం మంది పార్ట్‌టైమ్ అవకాశాలలో నిమగ్నమైఉన్నారని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ సర్వేలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ ఆగస్టు ప్రారంభంలో ఉద్యోగులకు పార్ట్‌టైం వర్క్ చేసుకునే అవకాశాన్ని ప్రకటించడంతో మూన్‌లైటింగ్ అనేది చర్చనీయాంశమైంది. మరోవైపు, ఉద్యోగులు పని చేయకుండా బయట ఏం చేస్తున్నారో చూసేంత శక్తి, సామర్థ్యం మేనేజ్మెంట్కు ఉందా అని మార్కెట్ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
అయిదేళ్లలో రెండింతలు: డిజిటల్ రేడియోకు అదరిపోయే వార్త
న్యూఢిల్లీ: డిజిటల్ రేడియో టెక్నాలజీ వినియోగంతో రేడియో విభాగం ఆదాయం అయిదేళ్లలో రెండింతలై రూ.12,300 కోట్లకు చేరుకుంటుందని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ), ఈవై నివేదిక వెల్లడించింది. ‘డిజిటల్ రేడియోతో ప్రసార కంపెనీలు, శ్రోతలు, ప్రకటనకర్తలు, నియంత్రణ సంస్థలకు ప్రయోజనం. అధిక ధరలతో స్లాట్స్ విక్రయించేలా ప్రకటనలు పెరుగుతాయి. డిజిటల్ రేడియో వ్యవస్థ శ్రోతల డేటాను పారదర్శకంగా అందిస్తుంది. ఎంతమంది వింటున్నారనే విషయం తెలుస్తుంది. కాబట్టి ప్రసారకులు నమ్మకాన్ని పెంచుకోవచ్చు. అలాగే ఆదాయాన్ని పెంచుకోవచ్చు. చానెళ్లూ పెరుగుతాయి. ప్రస్తుతం ఉన్న ఫ్రీక్వెన్సీలో నాలుగింతలు ఎక్కువగా చానెళ్లను ఆఫర్ చేయవచ్చు. నాణ్యత అధికం అవుతుంది. శ్రోతలకు మెరుగైన అనుభూతి కలుగుతుంది. అదనపు స్పెక్ట్రమ్ అవసరం లేకుండానే చానెళ్ల సంఖ్య ప్రస్తుతమున్న 300 నుంచి 1,100 దాటుతుంది. కొన్నేళ్లుగా ఆదాయాల ఆర్జనకు ఎఫ్ఎం రేడియో కష్టాలను ఎదురీదుతోంది’ అని నివేదిక వివరించింది. -
రైతులకు రెట్టింపు లాభం
2022 కల్లా అమలు చేస్తామన్న ప్రధాని * పంట బీమా విధివిధానాల ఆవిష్కరణ * ఏప్రిల్ 14న ఈ-అగ్రి ప్రారంభం సెహోర్ (మధ్యప్రదేశ్): భారతదేశంలో అన్నదాతలకు 2022 కల్లా రెట్టింపు లాభాలు తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో ‘కిసాన్ కల్యాణ్ మేళా’లో పాల్గొన్న ప్రధాని.. ఇటీవలే ప్రకటించిన జాతీయ పంట బీమా పథకానికి సంబంధించిన విధివిధానాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంట బీమాకు సంబంధించిన పలు వివరాలను ప్రధాని రైతులకు వివరించారు. పంట నష్టం విషయం తెలియగానే బీమా మొత్తంలో 25 శాతం చెల్లిస్తారని.. మిగిలిన మొత్తాన్ని వీలైనంత త్వరలో చెల్లిస్తారని ప్రధాని తెలిపారు. పంట వేసిన 14 రోజుల్లోపల నష్టం జరిగినా దాన్ని బీమాకు వర్తింపచేస్తామన్నారు. గతంలో 20 శాతం మంది రైతులకు మాత్రమే ప్రభుత్వ పాలసీలు అందేవని.. వీటిని తక్షణమే కనీసం 50 శాతం మందికి అందించాలనేది తమ ప్రభుత్వ ఆశయం అని మోదీ చెప్పారు. ‘పంట బీమా పథకాన్ని వాజ్‌పేయి ప్రారంభించారు. యూపీఏ అధికారంలోకి వచ్చాక.. రైతులకు ఈ పథకంపై నమ్మకం పోయింది. ఓవైపు విపత్తులతో నష్టపోతున్నా.. పంట బీమాపై వ్యతిరేక భావనతోనే ఉన్నారు’ అని మోదీ అన్నారు. ఒకసారైనా బీమా తీసుకుని ప్రయత్నించండని అన్నదాతలను కోరారు. 2022 కల్లా రైతులకు రెట్టింపు లాభం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంట ఉత్పత్తిని పెంచటం ద్వారా దేశీయ అవసరాలను తీర్చటంతోపాటు.. విదేశాలకు ఎగుమతి చేసుకోవటంపైనా దృష్టిపెట్టాలన్నారు. వాతావరణ మార్పులతో నష్టపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం వివిధ పథకాలను అందుబాటులోకి తెస్తోందని ప్రధాని తెలిపారు. భూసార కార్డుల పథకం, ప్రధానమంత్రి నీటిపారుదల పథకం, సేంద్రియ వ్యవసాయంతోపాటు.. చెరకు రైతులకోసం వీలైనంత ఎక్కువ యూరియా, ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాలను అందుబాటులోకి తేవటంపై ప్రధాని వివరించారు. దీంతో పాటు ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ-అగ్రి వేదికను ప్రారంభించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. దీని ద్వారా.. రైతులు తాము పండించిన పంటను దేశంలో ఎక్కడ మంచి రేటు వస్తే అక్కడ అమ్ముకోవచ్చన్నారు. అంతా మొబైల్ ఫోన్ ద్వారానే జరుగుతుందని ప్రధాని తెలిపారు. జాతీయ వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభించి.. దేశవ్యాప్తంగా ఉన్న 585 మార్కెట్లను 2018 వరకు విడతల వారిగా ఒకేవేదికపైకి తీసుకువస్తామన్నారు. కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర ఇలాంటి హోల్‌సేల్ మార్కెట్ల ఏర్పాటుకోసం ఇప్పటికే ప్రతిపాదలను పంపాయని తెలిపారు. ‘నేను రైతు వ్యతిరేకినని విమర్శిస్తున్నారు. నాకేం ఇబ్బంది లేదు. రైతుల కోసం తీసుకొస్తున్న ఈ పథకాన్ని ఎవరూ విమర్శించే ధైర్యం చేయరు’ అని అన్నారు.