పోస్టాఫీసులో మీరు జీవిత పాలసీలు తీసుకున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. పోస్టాఫీస్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలను కలిగి ఉన్నవారికి బోనస్ లభించనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వం పోస్టాఫీస్ లైఫ్ ఇన్సురెన్స్(పీఎల్ఐ)కు బోనస్ వర్తించేలా ప్రభుత్వం ప్రకటించింది. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ బోనస్ అమలులోకి వస్తుంది. హోల్ లైఫ్ అస్యూరెన్స్‌లో బోనస్ కింద వేయి రూపాయలకు రూ.76, పిల్లల పాలసీలతో సహా ఎండోమెంట్ అస్యూరెన్స్ కోసం అయితే వేయికి రూ.52 బోనస్ అందుకుంటారు.
పోస్టాఫీసులో ప్రస్తుతం ఆరు జీవిత భీమా పాలసీలు ఉన్నాయి. అవి హోల్ లైఫ్ అస్యూరెన్స్(సురక్షా), ఎండోమెంట్ అస్యూరెన్స్ (సంతోష్), కన్వర్టిబుల్ హోల్ లైఫ్ అస్యూరెన్స్ (సువిధా), యాంటిస్పేటెడ్ అస్యూరెన్స్(సుమంగల్), జాయింట్ లైఫ్ అస్యూరెన్స్ (యుగల్ సురక్ష), చిల్డ్రన్ పాలసీ (బాల్ జీవన్ బీమా) లాంటి భీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ రూల్స్ (2011) ప్రకారం.. 2020 మార్చి 31 నాటికి పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఆస్తులు అప్పుల వ్యాల్యూయేషన్ ఆధారంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై సాధారణ రివర్షనరీ బోనస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ బోనస్ ఆకస్మిక మరణం తర్వాత లేదా పాలసీ కాలపరిమితి గడిచిన తర్వాత చెల్లిస్తారు.
ఈ జీవిత భీమా పాలసీలపై బోనస్
- హోల్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ(డబ్ల్యూఎల్ఏ)పై వెయ్యికి రూ.76లు అదనంగా లభిస్తుంది.
- ఎండోమెంట్ అస్యూరెన్స్(జాయింట్ లైఫ్ & చిల్డ్రన్ పాలసీలతో సహా) పాలసీపై వెయ్యికి రూ.52లు అదనంగా లభిస్తుంది.
- యాంటిస్పేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్(సుమంగల్) పాలసీపై వెయ్యికి రూ.48లు అదనంగా లభిస్తుంది.
- కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీలు(సీడబ్ల్యూఏ)పై వోల్ లైఫ్ బోనస్ రేటు వర్తిస్తుంది. అయితే మార్చుకుంటే ఎండోమెంట్ అస్యూరెన్స్ బోనస్ రేటు లభిస్తుంది.
- పది వేల మొత్తంపై రూ.20లు టెర్మినల్ బోనస్ తో పాటు గరిష్ఠంగా రూ.1000 వస్తుంది. ఇది 20 ఏళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment