సరిహద్దులో డ్రగ్స్‌ డ్రోన్‌ కూల్చివేత | Heroin-carrying drone shot down near India-Pakistan border | Sakshi
Sakshi News home page

సరిహద్దులో డ్రగ్స్‌ డ్రోన్‌ కూల్చివేత

Published Mon, Jan 23 2023 5:13 AM | Last Updated on Mon, Jan 23 2023 5:13 AM

Heroin-carrying drone shot down near India-Pakistan border - Sakshi

చండీగఢ్‌:  పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లో భారత్‌–పాకిస్తాన్‌ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మాదకద్రవ్యాల డ్రోన్‌ను కూల్చివేశారు. బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది, పంజాబ్‌ పోలీసులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్‌ నిర్వహించారు.

కక్కార్‌ గ్రామంలో 6 రెక్కలున్న డ్రోన్‌ ఎగురుతున్నట్లుగా గుర్తించామని, వెంటనే ఏకే–47 నుంచి 12 రౌండ్లు కాల్పులు జరిపి కూల్చివేశామని, ఇందులో 5 కిలోల హెరాయిన్‌ లభ్యమైందని అధికారులు ఆదివారం వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిందన్నారు. డ్రోన్‌కు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement