రూ.110 కోట్ల మత్తుపదార్థాలు స్వాధీనం
అమృతసర్: భారత కస్టమ్స్ అధికారులు, బీఎస్ఎఫ్ ఉమ్మడిగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి రూ.110 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్నారు. పాకిస్థాన్ నుంచి కొందరు వ్యక్తులు దీనిని సరిహద్దు గుండా భారత్కు తరలించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు.
పోలీసుల సమాచారం ప్రకారం పాక్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గత రాత్రి కొన్ని అనుమానిత కదలికలు కనిపించాయి. దీంతో తెల్లవారగానే గాలింపు చర్యలు చేపట్టిన సరిహద్దు రక్షణ దళానికి మొత్తం 22 కేజీల హెరాయిన్ కంటబడింది. దీనిని స్వాధీనం చేసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించి ఎలాంటి అరెస్టు ఇంకా చోటు చేసుకోలేదు.