అప్పుడే పుట్టిన బిడ్డకు హెరాయిన్..
పుట్టిన గంటల వ్యవధిలోనే బిడ్డకు హెరాయిన్ ఇచ్చిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిడ్డ తల్లి గర్భవతిగా ఉన్న సమయంలో నొప్పులను తట్టుకునేందుకు తరచూ హెరాయిన్, డాక్టర్లు సూచించిన మందులను తీసుకునేది.
దీంతో కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా హెరాయిన్‌కు అడిక్ట్ అయింది. హెరాయిన్ వినియోగించిన విషయం బిడ్డ ద్వారా ఆసుపత్రి సిబ్బందికి తెలియకూడదని దంపతులు క్రిస్టెన్‌సన్(26), కాల్బీ విల్డ్(29) భావించారు. అదను చూసి నర్సు, డాక్టర్లు లేని సమయంలో సబోక్సోన్ అనే ట్యాబ్లెట్లను మెత్తగా పొడి చేసి బిడ్డ నాలుకపై రాసినట్లు విచారణలో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. దీంతో వారి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు.