కామన్ ఫీచర్స్.. ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్స్‌తో ఆన్‌స్క్రీన్ గ్రామర్‌ని మార్చేసింది శాన్వికా! ఎవరీమె అనుకుంటున్న వాళ్లు.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘పంచాయత్’ చూస్తే ఆమె ఎవరో తెలుస్తుంది.. శాన్వికా ప్రతిభ కనిపిస్తుంది. ఓటీటీ అందుబాటులో లేని వాళ్లు ఇక్కడిస్తున్న వివరాలతో ఆమెను పరిచయం చేసుకోవచ్చు.
శాన్వికా అసలు పేరు పూజా సింగ్. పుట్టి, పెరిగింది మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుంది.
చిన్నప్పటి నుంచి నటన మీదే ఆసక్తి. కానీ ఇంట్లోవాళ్లకు ఆ రంగం మీద పెద్ద నమ్మకం లేదు. అందుకే యాక్టింగ్ కెరీర్‌ను వెదుక్కుంటానంటే కుటుంబం ఒప్పుకోదని.. బెంగళూరులో ఉద్యోగం దొరికిందని అబద్ధం చెప్పి ముంబై రైలెక్కేసింది శాన్వికా.
అక్కడ హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న తన స్నేహితురాలి సహాయంతో అసిస్టెంట్ క్యాస్ట్యూమ్ డిజైనర్ కొలువులో చేరింది. ఆ ఉద్యోగం చేస్తూ పలు టీవీ కమర్షియల్స్‌కి ఆడిషన్స్ ఇవ్వసాగింది. అలా డామినోస్ వంటి వాటికి మోడల్‌గా ఎంపికైంది.
మోడలింగ్‌తో చిన్న చిన్న యాక్టింగ్ రోల్స్ కూడా రావడం మొదలయ్యాయి. ఆ సమయంలోనే నటన పట్ల ఆమెకున్న తపన, టాలెంట్ చూసిన కొందరు యూట్యూబ్ చానెల్ ‘టీవీఎఫ్’ సిరీస్ కోసం ఆడిషన్స్‌కి వెళ్లమని సలహా ఇచ్చారు. అనుసరించింది.
టీవీఎఫ్ కోసం ఆడిషన్స్ ఇస్తున్న టైమ్‌లోనే ‘పంచాయత్’ సీజన్ 1కి సెలెక్ట్ అయింది. అప్పటికే హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో పూజా సింగ్ పేరుతోనే మరో నటి ఉండటంతో తన స్క్రీన్ నేమ్‌ని ‘శాన్వికా’గా మార్చుకుంది.
‘పంచాయత్’లో రింకీ దూబేగా ఆమె వీక్షకులను తెగ ఆకట్టుకుంది. దాంతో తర్వాత రెండు సీజన్లలోనూ కొనసాగింది. తాజాగా మూడో సీజన్‌తో స్పెషల్ ఫ్యాన్ బేస్‌నే ఏర్పరచుకుంది.
‘పంచాయత్’ చేస్తున్నప్పుడే ‘లఖన్ లీలా భార్గవా’, ‘హజామత్’ అనే వెబ్ సిరీస్‌లలోనూ అవకాశాలు వచ్చాయి. అవీ ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి.
శాన్వికాకు అభినయ కళలోనే కాదు స్కెచింగ్, పెయింటింగ్‌లోనూ నైపుణ్యం మెండే! ఏ కొంచెం ఖాళీ సమయం దొరికినా ఆర్ట్‌లో తన మార్క్ చూపిస్తుంటుంది.
"పంచాయత్ తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ మూస పాత్రలే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే కాస్టింగ్ డైరెక్టర్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను.. ‘వెర్సటైల్ రోల్స్ చేయగలను.. దయచేసి అలాంటి క్యారెక్టర్స్‌కి నన్ను సెలెక్ట్ చేయండ’ని! మలయాళం, బెంగాలీ వంటి రీజనల్ లాంగ్వెజెస్‌లో నంటించడానికీ నేను సిద్ధమే!" – శాన్వికా
ఇవి చదవండి: కారు కనిపించని ఊరు.. ఎక్కడుందో తెలుసా!?
Comments
Please login to add a commentAdd a comment