extraordinary
-
త్యాగమయి చిత్తోర్ఘర్ పన్నా దాయి : ఆసక్తికర విశేషాలు
రాజస్థాన్, చిత్తోర్ఘర్... పేరు వినగానే మేవార్‌రాజుల ఘనచరిత్ర కళ్ల ముందు మెదులుతుంది. రాణి పద్మిని త్యాగం గుర్తు వస్తుంది. పద్మావత్ సినిమా తర్వాత చిత్తోర్ ఘర్ పేరు అనేక వివాదాలకు, విచిత్ర భాష్యాలకు నెలవైంది. సినిమాలో చూసిన చిత్తోర్ఘర్ కోటను స్వయంగా చూడడం కూడా అవసరమే. చిత్తోర్ఘర్ చరిత్రలో ఉన్న మహిళ రాణి పద్మినిది మాత్రమే కాదు. ఈ కోటలో చరిత్ర సృష్టించిన ముగ్గురు. భక్త మీరాబాయి, రాణి పద్మిని, పన్నాదాయి. భక్త మీరాబాయి... కృష్ణుడి భక్తురాలిగా సుపరిచతమే. ఇక పన్నా దాయి (Panna Dhai) మాత్రం సినిమాటిక్ అట్రాక్షన్ లేని పాత్రకావడంతో చరిత్రపుటల్లో అక్షరాలుగా మాత్రమే మిగిలిపోయింది. త్యాగమయి పన్నారాజపుత్ర రాజు రాణా సంగా భార్య రాణి కర్ణావతి దగ్గర దాదిగా పని చేసింది పన్నాదాయి. పిల్లల్ని పెంచే బాధ్యత ఆమెది. రెండవ ఉదయ్ సింగ్ చంటిబిడ్డగా ఉన్నప్పుడు కోట మీద దాడి జరిగింది. ఉదయ్ సింగ్‌ను కాపాడడానికి శత్రువుల దృష్టి మళ్లించడానికి ఊయలలో తన బిడ్డను పెట్టి ఉదయ్‌సింగ్‌ను భద్రంగా కోట నుంచి బయటకు పంపించింది. రాజ కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమకు, త్యాగానికి గుర్తుగా కోట లోపల ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కోటలో రాణా కుంభ కట్టిన విజయ్ స్తంభ్, రాణి పద్మిని ప్యాలెస్ ముఖ్యమైనవి. అల్లావుద్దీన్ ఖిల్జీ అద్దంలో రాణిని చూసిన ప్రదేశం ముఖ్యమైనది. పద్మిని తన ప్యాలెస్ మెట్ల మీద కూర్చుంటే, ఆమె ప్రతిబింబం... ప్యాలెస్ మెట్లకు అభిముఖంగా ఉన్న చిన్న బిల్డింగ్‌లోని అద్దంలో కనిపిస్తుంది. ఖిల్జీ ఆ ప్రతిబింబాన్ని చూసిన అద్దం ఇప్పటికీ ఉంది. జోవార్ గద్దెరాణి పద్మిని అందచందాలను విని ఆశ్చర్యపోయిన ఖిల్జీ ఆమె కోసమే దండెత్తి యుద్ధం చేశాడు. రాజ్యాన్ని ధ్వంసం చేశాక కూడా కోట స్వాధీనం కాకపోవడంతో రాణి పద్మినిని ఒకసారి చూసి వెళ్లిపోతానని కోరాడని, అప్పుడు మంత్రివర్గ ప్రముఖులు ఆమెను స్వయంగా చూపించకుండా అద్దంలో చూపించారని గైడ్లు చె΄్తారు. చూసి వెళ్లిపోతానన్న ఖిల్జీ ఆ తర్వాత మాటతప్పి కోటలోకి ఆహార పదార్థాలు అందకుండా దిగ్బంధించి కోటను స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు పద్మినితో పాటు నాలుగు వేల మంది మహిళలు నిప్పుల్లో దూకి ప్రాణత్యాగం(జోవార్) చేసిన ఆ స్థలాన్ని చూపించి ఈ వివరాలన్నీ చెబుతారు. కోట లోపల శివాలయం, జైనమందిరం ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆలయాలు, ప్యాలెస్‌లు, గార్డెన్లు, జ్ఞాపక నిర్మాణాలు ఏవైనా సరే అందులో ఇమిడిన నైపుణ్యానికి తలవంచి నమస్కరించాల్సిందే. -
Pooja Singh: పూజా సింగ్ టు.. రింకీ దూబే.. బై శాన్వికా..!
కామన్ ఫీచర్స్.. ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్‌తో ఆన్‌స్క్రీన్ గ్రామర్ని మార్చేసింది శాన్వికా! ఎవరీమె అనుకుంటున్న వాళ్లు.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘పంచాయత్’ చూస్తే ఆమె ఎవరో తెలుస్తుంది.. శాన్వికా ప్రతిభ కనిపిస్తుంది. ఓటీటీ అందుబాటులో లేని వాళ్లు ఇక్కడిస్తున్న వివరాలతో ఆమెను పరిచయం చేసుకోవచ్చు.శాన్వికా అసలు పేరు పూజా సింగ్. పుట్టి, పెరిగింది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుంది.చిన్నప్పటి నుంచి నటన మీదే ఆసక్తి. కానీ ఇంట్లోవాళ్లకు ఆ రంగం మీద పెద్ద నమ్మకం లేదు. అందుకే యాక్టింగ్ కెరీర్‌ను వెదుక్కుంటానంటే కుటుంబం ఒప్పుకోదని.. బెంగళూరులో ఉద్యోగం దొరికిందని అబద్ధం చెప్పి ముంబై రైలెక్కేసింది శాన్వికా.అక్కడ హిందీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న తన స్నేహితురాలి సహాయంతో అసిస్టెంట్ క్యాస్ట్యూమ్ డిజైనర్ కొలువులో చేరింది. ఆ ఉద్యోగం చేస్తూ పలు టీవీ కమర్షియల్స్‌కి ఆడిషన్స్ ఇవ్వసాగింది. అలా డామినోస్ వంటి వాటికి మోడల్‌గా ఎంపికైంది.మోడలింగ్‌తో చిన్న చిన్న యాక్టింగ్ రోల్స్ కూడా రావడం మొదలయ్యాయి. ఆ సమయంలోనే నటన పట్ల ఆమెకున్న తపన, టాలెంట్ చూసిన కొందరు యూట్యూబ్ చానెల్ ‘టీవీఎఫ్’ సిరీస్ కోసం ఆడిషన్స్‌కి వెళ్లమని సలహా ఇచ్చారు. అనుసరించింది.టీవీఎఫ్ కోసం ఆడిషన్స్ ఇస్తున్న టైమ్‌లోనే ‘పంచాయత్’ సీజన్ 1కి సెలెక్ట్ అయింది. అప్పటికే హిందీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పూజా సింగ్ పేరుతోనే మరో నటి ఉండటంతో తన స్క్రీన్ నేమ్‌ని ‘శాన్వికా’గా మార్చుకుంది.‘పంచాయత్’లో రింకీ దూబేగా ఆమె వీక్షకులను తెగ ఆకట్టుకుంది. దాంతో తర్వాత రెండు సీజన్లలోనూ కొనసాగింది. తాజాగా మూడో సీజన్‌తో స్పెషల్ ఫ్యాన్ బేస్‌నే ఏర్పరచుకుంది.‘పంచాయత్’ చేస్తున్నప్పుడే ‘లఖన్ లీలా భార్గవా’, ‘హజామత్’ అనే వెబ్ సిరీస్‌లలోనూ అవకాశాలు వచ్చాయి. అవీ ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి.శాన్వికాకు అభినయ కళలోనే కాదు స్కెచింగ్, పెయింటింగ్‌లోనూ నైపుణ్యం మెండే! ఏ కొంచెం ఖాళీ సమయం దొరికినా ఆర్ట్‌లో తన మార్క్ చూపిస్తుంటుంది."పంచాయత్ తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ మూస పాత్రలే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే కాస్టింగ్ డైరెక్టర్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను.. ‘వెర్సటైల్ రోల్స్ చేయగలను.. దయచేసి అలాంటి క్యారెక్టర్స్‌కి నన్ను సెలెక్ట్ చేయండ’ని! మలయాళం, బెంగాలీ వంటి రీజనల్ లాంగ్వెజెస్‌లో నంటించడానికీ నేను సిద్ధమే!" – శాన్వికాఇవి చదవండి: కారు కనిపించని ఊరు.. ఎక్కడుందో తెలుసా!? -
ఎక్స్ట్రా వినోదం ఉంటుంది – నితిన్
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్ట్రా’. ‘ఆర్డినరీ మ్యాన్’ అనేది ఉపశీర్షిక. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఒలే ఒలే పాపాయి పలాసకే వచ్చేయ్..’ అనే మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు హ్యారిస్ జైరాజ్ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా రామ్ మిరియాల, ప్రియ హేమెస్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను. సినిమా ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌కు పదింతల వినోదం మా సినిమాలో ఉంటుంది. ఈ సినిమా విషయంలో నాకు సప్రోర్ట్ చేసిన నితిన్‌గారికి థ్యాంక్స్. ఇంట్రవెల్ సన్నివేశంలో ఓ మంచి ట్విస్ట్ ఉంది’’ అన్నారు వక్కంతం వంశీ. ‘‘టైటిల్‌కి తగ్గట్టు ఈ సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది’’ అన్నారు సుధాకర్ రెడ్డి. -
అపురూపంగా చూసుకోవాలి
కొత్తగా పెళ్లయిన జంట భోజనానికి కూర్చుంది. ‘‘మీ అమ్మగారిని కూడా పిలవండి’’ అని చెప్పింది భార్య. ‘‘మా అమ్మ సంగతి వదిలేయి.’’ అని విసుక్కున్నాడు భర్త. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మీ అమ్మగారు తినకుండా మనం తినడం భావ్యం కాదని చెప్పింది. పెళ్లికొడుక్కి చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇద్దరూ పెళ్లైన రోజే విడిపోయారు. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఎవరికి తోచిన సంబంధం వాళ్లు చూసుకుని వేరే పెళ్లి చే సుకున్నారు. ఇలా ముప్ఫై ఏళ్లు గడిచిపోయాయి. ఆ మహిళకు మగ సంతానం కలిగింది. పిల్లలు ప్రయోజకులయ్యారు. పిల్లల్ని ధార్మికంగా తీర్చిదిద్దడంతో పిల్లలు కూడా తల్లిని రాణిలా చూసుకోసాగారు. కాళ్లకు మట్టి కూడా అంటనివ్వకుండా ఎంతో అపురూపంగా చూసుకోసాగారు. దగ్గరుండి హజ్ యాత్ర చేయించారు. హజ్ యాత్ర తిరుగు ప్రయాణంలో ఒక చోట ఒక వ్యక్తి చింపిరి జుట్టుతో రోడ్డుపక్కన దుర్భరస్థితిలో పడి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి చలించిపోయిన ఆ మహిళ ఆ అభాగ్యుడిని లేపి ఏదైనా తినిపించి మంచినీళ్లు తాగించాలని తన పిల్లలను కోరింది. పిల్లలు ఆ వ్యక్తిని లేపి కూర్చోబెడుతుండగా ఆ వ్యక్తిపై ఆమె దృష్టి పడింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందా మహిళ. ఆ వ్యక్తి ఎవరో కాదు, తన మొదటి భర్త అని గుర్తుచేసుకొంది. ఈ దుస్థితికి కారణమేమిటని అడిగింది. దానికా వ్యక్తి ‘‘మా పిల్లలు నా ఆస్తినంతా కాజేసి నన్ను బయటకు గెంటేశారు’’ అని తన దీనస్థితిని చెప్పుకొచ్చాడు. అప్పుడామె కలగజేసుకొని ‘‘నీ ఈ దుస్థితిని మన పెళ్లయిన మొదటి రాత్రే అంచనా వేశాను. నువ్వు మీ అమ్మానాన్నల హక్కులు నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేశావు. వాళ్లను చులకనగా చూశావు. రేపటి రోజు నాకూ ఇదే గతి పడుతుందనే ఆ రోజు నీ నుంచి విడిపోయాను’’ అని చెప్పింది. మన వృద్ధాప్యం ఎలా గడపాలని కోరుకుంటున్నామో మన తల్లిదండ్రులకూ అలాంటి వృద్ధాప్యాన్ని అందించాలి. ముసలితనంలో వాళ్లను ఆదరించాలి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే బతికుండగానే ఆ పాపం మన మెడకు చుట్టుకుంటుందని ముహమ్మద్ ప్రవక్త (స) హెచ్చరించారు. – ముహమ్మద్ హమ్మాద్ -
భక్తుల కొంగుబంగారం.. మట్టపల్లి క్షేత్రం
–పంచ నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటిగా.. –అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా వెలసిన స్వామి మట్టపల్లి (మఠంపల్లి): నల్లగొండ, గుంటూరు జిల్లాలకు వారధిగా ఉన్న పవిత్ర కృష్ణానది తీరాన వెలసిన పంచ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖంగా బాసిల్లుతూ తెలంగాణ–ఆంధ్ర ప్రాంత భక్తుల పాలిట కొంగు బంగారంలా విలసిల్లుతోంది మట్టపల్లి మహాక్షేత్రం. మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానది ఒడ్డున అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా స్వయంభువుగా అవతరించించారు శ్రీలక్ష్మీనసింహస్వామి క్షేత్రం. ఆలయచరిత్ర ... పూర్వం 1100 ఏళ్ల క్రితం మట్టపల్లి కీకారణ్యంలో భరద్వాజ మహర్షి తపస్సు చేస్తాడు. కొంత కాలానికి కృష్ణానది ఆవలి తీరాన వెలసిన తంగెడ గ్రామాన్ని పాలించే అనుముల (దొండపాటి) మాచిరెడ్డి ప్రభువుకు స్వామివారు కలలో కనిపించి ‘నాకు ఇప్పటి వరకు దేవతలు, సప్తరుషులు పూజలు, యజ్ఞాలు చేశారు.. ఇకనుంచి మానవుల పూజలు అందుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. అందువల్ల కృష్ణానది ఆవలి వైపున కీకారణ్యంలో గృహగర్భంలో నా స్వయంవ్యక్త మూర్తి ఆవిర్భవించి ఉన్నాడు.. నీవు వెళ్లి గుహను తెరిపించాలి’ అని ఆజ్ఞాపిస్తాడు. దీంతో మరునాడు మాచిరెడ్డి ప్రభువు సకల పరివారంతో కృష్ణానది దాటి వచ్చి మట్టపల్లి అటవీప్రాంతంలో వెతికి వేసారి అలసిపోయి నది ఒడ్డున నిద్రకు ఉపక్రమించాడు. దీంతో మళ్లీ స్వప్నంలోకి వచ్చిన స్వామి వారు ఓÄæూ మాచిరెడ్డి ప్రభువు నీవు నిద్రిçస్తున్న ఆరె చెట్టుపైన గరుడ పక్షి ఉంటుంది. ఆ పక్షి మిమ్ములను చూడగానే పశ్చిమం నుంచి తూర్పుదిశకు ఎగిరిపోతుంది. అక్కడి నుంచి 10 గజాల దూరంలో గుహను తవ్విస్తే∙నా స్వయంమూర్తి కనిస్తాడు అని తెలిపాడు. దిగ్గున లేచిన ప్రభువు ఆ రకంగా ౖసైన్యంతో గుహను తవ్వించగా కీకారణ్యంలోని భయంకరమైన గుహలో వెలుగులు విరజిమ్ముతూ కొండ గట్టుకు శ్రీలక్ష్మీనసింహస్వామి యోగాసనంలో పక్కన ప్రహ్లాదుడితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. స్వయం వ్యక్త ముందు దక్షిణావశంఖం నవసాలగ్రాములు కూడా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ప్రభువు ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఇక అప్పటి నుంచి నేటికీ స్వామి వారికి ఆరె ఆకులతో పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు .. శ్రీమట్టపల్లి లక్ష్మీనసింహస్వామికి ప్రతి దినం ఉదయం 7.30గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు మూడు సార్లు మహానివేదన, ఆరగింపు, భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ ఉంటుంది. అంతకు ముందే ప్రతిరోజు సుప్రభాతసేవతో పాటు కృష్ణానది నుంచి తెచ్చే బిందె తీర్థంతో యథావిధిగా పూజలు కొనసాగిస్తారు. ఆర్జితసేవలు, ప్రసాదాలు, నిత్యాన్నదానం కొనసాగుతూ ఉంటాయి. ఉత్సవాలు .. ప్రతి ఏడాది మే నెలలో వచ్చే నసింహ జయంతికి శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనసింహస్వామికి తిరుకల్యాణం జరుపుతారు. ఈ కల్యాణానికి మన జిల్లా లింగగిరి, గుంటూరు జిల్లా ముత్యాలమ్మపాడు నుంచి అనాదిగా మెట్టెలు, మంగళసూత్రాలు, తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. అంతేగాక ప్రతిఏటా డిసెంబర్, జనవరి మాసాల్లో వచ్చే తొలి ఏకాదశికి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఇతర దేవాలయాలు... మట్టపల్లిలో శ్రీలక్ష్మీనసింహస్వామి ఆలయంతో పాటు పార్వతీ రామలింగేశ్వర స్వామి, ఆంజనేయస్వామి, గోదాదేవి ఆలయాలున్నాయి. శ్రీరామతీర్థ సేవాశ్రమం దీనిని 1971లో పిడుగురాళ్లకు చెందిన కేశవ తీర్థస్వామి ప్రారంభించారు. ఈ ఆశ్రమంలో ప్రతి నిత్యం నరసింహోపాసన జరుగుతుంది. అదేవిధంగా హుజూర్నగర్ నుంచి మట్టపల్లి వరకు 25 కిలోమీటర్ల పొడవునా త్రివేణినగర్‌లో లక్ష్మీతిరుపతమ్మ, మఠంపల్లిలో కనకదుర్గ, పెదవీడులో సోమలింగేశ్వరాలయాలు ప్రధాన రహదారిపై పూజలందుకుంటున్నాయి. అన్నదాన సత్రాలు ... రాష్ట్రంలోని శ్రీశైల మహాక్షేత్రం తర్వాత అంత ప్రాముఖ్యతతో ఇక్కడ వివిధ కులాల అన్నదాన సత్రాలు నిర్మించారు. నిత్యాన్నదాన సత్రాలతో పాటు ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్నదానాలు చేసే మరిన్ని సత్రాలు కూడా నిర్మించారు. ఇతర కట్టడములు ... జిల్లాలోనే మొట్టమొదటి సారిగా 1990లో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమంటపాన్ని మట్టపల్లిలో నిర్మించారు. అదేవిధంగా యాదగిరిగుట్ట దేవస్థానం కూడా 6 గదుల సత్రం నిర్మించింది. ఇంకా జడ్పీ అతిథిగహం, దేవస్థాన గహాలు కూడా ఉన్నాయి. చెన్నై ముక్కూరు స్వామి పీఠం .. ఆశ్రమం .. మట్టపల్లి మహాక్షేత్రంలో చెన్నైకి చెందిన ముక్కూరు లక్ష్మీనరసింహచారియార్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రధాన ఆలయానికి పై భాగాన గోశాల ప్రక్కన నిర్మించారు. ఈపీఠాన్ని మూడేళ్ల క్రితం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ మట్టపల్లి వచ్చి ప్రారంభించారు. చెన్నైకి చెందిన తమిళనాడు భక్తులు అనునిత్యం మట్టపల్లి స్వామిని దర్శించుకొని ముక్కూరు స్వామి పీఠాన్ని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఎంతో మంది పీఠాధిపతులు ఇప్పటికీ మట్టపల్లి వచ్చి శ్రీలక్ష్మీనసింహ స్వామిని దర్శించుకుంటున్నారు.