హీరోయిన్ అదా శర్మ తండ్రి మృతి
హీరోయిన్ అదా శర్మ తండ్రి నిన్న రాత్రి మృతి చెందారు.
హైదరాబాద్: ప్రస్తుతం త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న అదా శర్మ తండ్రి నిన్న రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.
ఆమె తల్లి తండ్రులకు ఒక్కర్తే కుమార్తె. చిన్నతనం నుంచీ ఆమె తన తండ్రి కెప్టెన్ ఎస్.ఎల్ శర్మ కు బాగా క్లోజ్ గా ఉండేది. దాంతో ఆమె తన తండ్రిని ఊహించని విధంగా కోల్పోవడటంతో ఒక్కసారిగా ఆమె చాలా బాధపడింది. ఆయన హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.
