విభిన్న కథలతో సినిమాలు చేస్తూ విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు దగ్గుబాటి రానా. గతేడాది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు రానా. ప్రస్తుతం తను నటించిన రెండు చిత్రాలు విరాట పర్వం, అరణ్య విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేగాక ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో కలిసి అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరో వైపు రానా సినిమాలే కాకుండా ఓ డాక్యుమెంటరీని కూడా తెరకెక్కించాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద డిస్కవరీ ప్లస్ ఒరిజినల్‌తో కలిసి మిషన్ ఫ్రంట్ లైన్ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. చదవండి: ‘రానా – మిహికా.. ఆగస్ట్ 8, 2020’
భారత జవాన్ల జీవన శైలిని ప్రేక్షకుల కళ్ల ముందుకు తీసుకురానున్నఆలోచనతో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు, మిషన్ ఫ్రంట్ లైన్ పేరుతో రూపొందిన ఈ డాక్యూమెంటరీలో రానా ఆర్మీ గెటప్‌లో ఆకట్టుకోనున్నాడు. దీనిని తెరకెక్కించేందుకు స్వయంగా బీఎస్‌ఎఫ్ సాయాన్ని తీసుకొని పలు శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసుకొని చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీ నేడు(జనవరి21) డిస్నీ ప్లస్ ఒరిజినల్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా మిషన్ ఫ్రంట్‌లైన్‌లో భాగం అవ్వడం తనకు అమూల్యమైన అనుభవాన్ని ఇచ్చిందంటున్నాడు రానా. పౌరులు ఉండని హై-సెక్యూరిటీ జోన్‌లోకి ప్రవేశించడం నుంచి అక్కడ శిక్షణ తీసుకోవం మర్చిపోలేని అనూభూతినిచ్చిందన్నాడు. మిషన్ ఫ్రంట్‌లైన్‌ను డిస్నీ ప్లస్ ఒరిజినల్‌లో చూడాలని కోరాడు. ఈ మేరకు ట్విటర్‌లో చిన్న వీడియోను షేర్ చేశాడు. చదవండి: ‘అరణ్య’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరో సినిమాతో పోటీ!
ఇంతకముందు కూడా రానా దేశ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ జవాన్‌గా ఉండటం అంత సులభం కాదు అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆర్మీ జవాన్లతో కలిసి ఉన్న అనుభవాలను పంచుకుంటూ.. ఆర్మీ జవాన్లతో డ్యూటీ అత్యంత కష్టంగా ఉంటుంది. వారికి సెలవులు ఉండవు. బ్రేక్స్ ఉండవు. సరిగ్గా ఊపిరి పీల్చుకునేందకు కూడా వీలు ఉండదు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిసారు. లేకుంటే దేశమే ప్రమాదంలోపడిపోతుంది. విధుల్లో భాగంగా ప్రతిరోజూ కసరత్తులు, కాల్పులు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఆ హీరోల సాయంతో కఠిన శిక్షణ పొందాను. వాళ్లతో ప్రయాణం ఎంతో అమూల్యమైన అనూభూతినిచ్చింది. ఆ సమయంలో భారతదేశ గొప్పతనాన్ని అస్వాదించాను. వీళ్లను నేను కలవడం ను అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు ఇండియన్ ఆర్మీని గౌరవించాలంటూ తెలిపాడు.
Catch me as I rub shoulders with India's First Line of Defense on 'Mission Frontline', a Discovery+ Original, now streaming exclusively on @discoveryplusIN https://t.co/dLVtfVlP3X@BSF_India #DiscoveryPlusOriginals #MissionFrontline pic.twitter.com/xTz1bL9l9h
— Rana Daggubati (@RanaDaggubati) January 21, 2021
Comments
Please login to add a commentAdd a comment