
హీరయిన్లు ఫారిన్ లొకేషన్లు తిరగడం చాలా సాధారణం.

కానీ భక్తితో గుళ్లని దర్శించి పూజలు చేయడం చాలా తక్కువ.

ఇప్పుడు మృణాల్ ఠాకుర్ అలా ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేతం జగేశ్వర్ ధామ్.

అల్మోరా నుంచి దాదాపు 37 కిమీ దూరంలో ఉన్న ఈ గుడిని మృణాల్ దర్శించుకుంది.

ఆలయం ప్రదక్షిణలు చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

బహుశా సినిమాలు హిట్ అయి, మరిన్ని ఛాన్సులు రావాలని మొక్కుకుందేమో?

సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‌గా కొనసాగుతోంది.

తెలుగులో 'సీతారామం', 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' సినిమాలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది.
