పెళ్లి అనేది భారతీయ సంప్రదాయంలో ఒక గొప్ప వేడుక. పెద్దలు ఈ వేడుకను గొప్ప పవిత్ర కార్యంగా నిర్వహిస్తారు. అలాంటి సంప్రదాయరీతిలో ఇక్కడొక ఇద్దరు వ్యక్తులు రెండు పక్షులకు పెళ్లి చేశారు. ఈ వింత పెళ్లి మధ్యప్రదేశ్‌లోని కరేలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని పిపారియాలో ఉండే రామ్‌స్వరూప్ పరిహర్ మైనా అనే పక్షిని కన్న కూతురి మాదిరిగా చూసుకుంటున్నాడు.
అలాగే బాదల్ లాల్ విశ్వకర్మ చిలుకను కన్న బిడ్డలా ప్రేమగా చూసుకుంటున్నాడు. వారిద్దరూ తమ పక్షులకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ఆ ఇద్దరు తమ పక్షులకు హిందూ సంప్రదాయ పద్ధతిలో జాతకాలు చూసి మరీ భాజ భజంత్రీల నడుమ అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఆ పక్షులను రెండింటిని చిన్న కారులో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ పెళ్లి అంతటిని రామస్వరూప్ తన ఇంటిలో ఘనంగా నిర్వహించాడు.
ఈ పెళ్లికి బాదల్ తరుఫున అతని గ్రామం నుంచి విజయ పటేల్, ఆదిత్య పటేల్, పితమ్ పటేట్, దేవి సింగ్ పటేల్, ఆశోక్ పటేల్, రాజు పటేల్, పురుషోత్తం శివన్య, సునీల్ పటేల్, విమేలేష్ పటేల తదితరులంతా హాజరయ్యారు. ఈ వింత పెళ్లిలో బరాత్ కూడా నిర్వహించడం విశేషం. ప్రస్తుతం అక్కడి గ్రామస్తులు ఈ పెళ్లి గురించే కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.
(చదవండి: 17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..)
Comments
Please login to add a commentAdd a comment