కాచిగూడ (హైదరాబాద్): పా ర్లమెంట్ ప్రత్యేక సమావేశా లలో మహిళా బిల్లు పెట్టాల ని, మహిళా బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేకసభ కోటా కల్పిం చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రా జ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శని వారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మా ట్లాడుతూ, పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ పెట్టాలని అన్నారు. మహిళా బి ల్లులో బీసీ మహిళలకు ప్రాతినిథ్యం కల్పించక పోతే మహిళా బిల్లుకు సార్ధకత లేదన్నారు. మ హిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతోపాటు వి ద్యా, ఉద్యోగాలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలని, బీసీలకు అన్యాయం చేసే పార్టీల భరతం పడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment