సాక్షి,న్యూఢిల్లీ:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2027లోనే దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధపడిందన్న ప్రచారం జరుగుతోంది.
జమిలి ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్‌లో ఆమోదించాల్సిన బిల్లు కూడా ఇప్పటికే సిద్ధమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది.
కాగా,ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు సహా పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టబోరని ప్రచారం జరగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment