Lok Sabha Session Updates
లోక్‌సభ రేపటికి వాయిదా
తిరిగి ప్రారంభమైన లోక్‌సభ
లంచ్‌కు ముందు జమిలి బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదం
- ఇక.. జేపీసీ ముందుకు జమిలి బిల్లులు!
- లోక్‌సభలో జమిలి ప్రవేశపెట్టడానికి ఆమోదం
- పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) ముందుకు బిల్లులు
- వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌లో భాగంగా 129 రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లు కూడా
- జేపీసీ ద్వారా విస్తృస్థాయి చర్చకు అవకాశం
- అతిత్వరలో జేపీసీ ఏర్పాటు
- జేపీసీ చైర్మన్‌ను ఎంపిక చేయనున్న లోక్‌సభ స్పీకర్
- సంఖ్యా బలం దృష్ట్యా బీజేపీ నుంచే జేపీసీకి చైర్మన్
- జేపీసీలో విపక్ష సభ్యులకు కూడా స్థానం
- సభ్యుల పేర్లను ప్రతిపాదించని తరుణంలో.. సభ్యత్వం కోల్పోయే అవకాశం
జమిలి బిల్లు కాపీ కోసం క్లిక్ చేయండి
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు
- బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించిన స్పీకర్ ఓం బిర్లా
- కొత్త పార్లమెంట్‌లో ఫస్ట్ డిజిటల్ ఓటింగ్
- అనుమానాలున్నవాళ్లకు స్లిప్పులు పంచిన సిబ్బంది
- అనుకూలంగా 269 ఓట్లు.. వ్యతిరేకంగా 198 ఓట్లు
లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా
‘జమిలి’ బిల్లుపై ఓటింగ్ అనంతరం 3 గంటలకు వాయిదాపడ్డ లోక్‌సభ
‘జమిలి’ బిల్లు ‘జేపీసీ’కి.. సాధారణ మెజారిటీతో ఓకే అన్న లోక్‌సభ
- కొత్త పార్లమెంట్ భవనంలో జమిలి బిల్లుపై తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్
- విపక్షాలు డివిజన్ కోరడంతో ఓటింగ్‌కు అనుమతిచ్చిన స్పీకర్
- బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి, జేపీసీలో చర్చకు పంపేందుకు అనుకూలంగా 269 ఓట్లు
- బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 198 ఓట్లు
#WATCH | In a first, E-voting on 'One Nation One Election' Bill underway in Lok Sabha.
(Source: Sansad TV) pic.twitter.com/dMRk6UEjeO— ANI (@ANI) December 17, 2024
జేపీసీకి జమిలి బిల్లు పంపేందుకు సిద్ధం: అమిత్ షా
- జమిలి ఎన్నికల బిల్లును జేపీసీ కి పంపేందుకు సిద్ధం
- ఈ బిల్లును జేపీసీకి పంపి విస్తృతంగా చర్చించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు
- జేపీసీ నివేదిక తర్వాత మళ్లీ బిల్లు తీసుకువస్తాం
లోక్‌సభలోకి జమిలి ఎన్నికల బిల్లు
- లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
- 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మేఘ్వాల్
తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ
- బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ
- రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే చర్య అని మండిపాటు
- రాజ్యాంగ సవరణకు సంబంధించిన రెండు బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి
- రాష్ట్రాల అసెంబ్లీల కాలపరమితి కుదించడం రాజ్యాంగ విరుద్ధం
- కాంగ్రెస్ ఎంపీ మనీష్‌తివారీ డిమాండ్
జమిలి ఎన్నికల బిల్లుపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఫైర్
- జమిలి ఎన్నికలు నియంతృత్వ పాలనకు నాంది అని వ్యాఖ్య
- బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన
బిల్లును ఉపసంహరించుకోవాలని టీఎంసీ, డీఎంకే డిమాండ్
- జమిలి ఎన్నికలు ఎన్నికల సంస్కరణ కాదన్న టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ
- ఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల కమిషన్‌కు సర్వాధికారాలు వస్తాయి
- జమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లేనపుడు బిల్లు ఎలా తెస్తారని ప్రశ్నించిన డీఎంకే
జమిలి బిల్లు రాజ్యాంగ విరుద్ధం: ఎంఐఎం అధినేత అసదుద్దీన్
- జమిలి ఎన్నికలు ఒక లీడర్ ఈగో కోసమే వచ్చిన ఆలోచన
- రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు
- బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
జమిలి ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ మద్దతు
లోక్‌సభలో జమిలి బిల్లులకు టీడీపీ మద్దతు
జమిలి ఎన్నికల బిల్లుపై దేశమంతా చర్చ జరగాలి: ఎంపీ రఘునందన్‌రావు
- గతంలో కూడా నాలుగు సార్లు జమిలి ఎన్నికలు జరిగాయి
- జమిలి ఎన్నికలతో అధ్యక్ష తరహా పాలన జరగదు
- ఈ బిల్లుకు 31 పార్టీలు మద్దతిస్తున్నాయి
- ఇంకా 15 పార్టీలు మద్దతు ఇవ్వాల్సి ఉంది
- ఏ పార్టీని మేము బుల్డోజ్ చేయం
- జమిలి ఎన్నికలు దేశ ప్రజల ఆకాంక్ష
- ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలి
- కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి
- ఇండియా కూటమిలో ఇప్పటికే లుకలుకలు ఉన్నాయి
- వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తప్పనిసరిగా పాస్ అవుతుందని నమ్మకం ఉంది
ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్..
జమిలి ఎన్నికల బిల్లును లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టనున్నారు
ఈ సందర్భంగా కాంగ్రెస్ తన ఎంపీలకు విప్ జారీ చేసింది
ఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరింది
సభలోకి వెళ్లేముందే జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే అవకాశం ఉంది
సభలోకి రెండు బిల్లులు..
జమిలి ఎన్నికల 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.
ఈ మేరకు వాటిని ఇవాళ లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు.
‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి.
ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేయనున్నారు.
భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు.
20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది.
జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment