session
-
వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదిక.. రాజ్యసభలో గందరగోళం
న్యూఢిల్లీ: ఈరోజు(గురువారం) పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి దశలోని చివరి రోజు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఉభయ సభల్లో హంగామా నెలకొంది. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) నివేదికను బీజేపీ ఎంపి మేధా కులకర్ణి ప్రవేశపెట్టారు. మరోవైపు లోక్‌సభలో ఇదేవిధమైన గందరగోళం నెలకొన్న నేపధ్యంలో సభా కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.రాజ్యసభలో జేపీసీ నివేదికపై ప్రతిపక్షాల ప్రశ్నలకు కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. తన మంత్రిత్వ శాఖ సభ్యులు జేపీసీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్షాలు నివేదికను చదివి, ఆపై స్పందించాలని ఆయన కోరారు. ప్రశ్నలు లేవనెత్తే వారు కూడా జేపీసీ సభ్యులేనని ఆయన అన్నారు.వక్ఫ్ బిల్లుపై సభలో ప్రవేశపెట్టిన జేపీసీ నివేదికను ప్రతిపక్షం అంగీకరించబోదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దానిని చర్చ కోసం వెనక్కి పంపాలని ఆయన ఛైర్మన్‌ను అభ్యర్థించారు. వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ అభిప్రాయాన్నీ పరిగణలోకి తీసుకోలేదని ఖర్గే అన్నారు. వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదికపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది.జేపీసీ జనవరి 30న ముసాయిదా నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ నివేదికను 655 పేజీలలో పొందుపరిచారు. 16 మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 11 మంది సభ్యులు వ్యతిరేరించారు. కమిటీలోని ప్రతిపక్ష ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించారు. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు(గురువారం) పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టం-1961ని సరళీకరించడం ద్వారా, ఆదాయపు పన్ను చట్టాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చేయడమే దీని లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రస్తుత ఆదాయపు పన్ను-1961 కంటే శరళమైనది. అయితే దీనిలో మరిన్ని విభాగాలు, షెడ్యూళ్లు ఉన్నాయి. 622 పేజీల కొత్త బిల్లులో 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్లలో 536 విభాగాలు ఉన్నాయి. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో 298 విభాగాలు, 14 షెడ్యూల్లు ఉన్నాయి. 880 పేజీలు. కాగా పార్లమెంటులో లోక్‌సభ కార్యకలాపాలు ఐదు నిమిషాలు మాత్రమే కొనసాగాయి. ప్రతిపక్షం గందరగోళం సృష్టించడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
విశాఖలో భారత్ టి20 టీం ప్రాక్టీస్ (ఫొటోలు)
-
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోమహిళా బిల్లు ఆర్.కృష్ణయ్య డిమాండ్
కాచిగూడ (హైదరాబాద్): పా ర్లమెంట్ ప్రత్యేక సమావేశా లలో మహిళా బిల్లు పెట్టాల ని, మహిళా బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేకసభ కోటా కల్పిం చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రా జ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శని వారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మా ట్లాడుతూ, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ పెట్టాలని అన్నారు. మహిళా బి ల్లులో బీసీ మహిళలకు ప్రాతినిథ్యం కల్పించక పోతే మహిళా బిల్లుకు సార్ధకత లేదన్నారు. మ హిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతోపాటు వి ద్యా, ఉద్యోగాలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలని, బీసీలకు అన్యాయం చేసే పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. -
International Olympic Committee: భారత్‌లో 2023 ఐవోసీ సెషన్
-
బీఎస్ఎఫ్ సిబ్బందికి యోగా శిక్షణ!
హరిద్వార్ః దేశంలోనే అతిపెద్ద కాపలా శక్తిగా ఉన్న సరిహద్దు భద్రతా బలగాల (బీఎస్ ఎఫ్) కు యోగాలో శిక్షణనిస్తున్నారు. గురు రాందేవ్ బాబా శిక్షణలో సుమారు 1900 మంది కి ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు. శరీరానికి మెదడుకు మధ్య సమన్వయాన్ని కుదిర్చి, సమతుల్యతకు ఎంతగానో సహకరించే యోగా...ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడితో, కష్టించి పనిచేయాల్సిన సరిహద్దు భద్రతా బలగాలకు సైతం యోగా శిక్షణనిచ్చేందుకు నిర్ణయించారు. బీఎస్ఎఫ్ సిబ్బందికి పదిరోజులపాటు కొనసాగే యోగా శిక్షణా కార్యక్రమం శనివారం హరిద్వార్ లో ప్రారంభమైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏపీ మహేశ్వరి ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం జరగుతున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. సిబ్బందికి ఇచ్చే శిక్షణలో భాగంగా యోగాను కూడా నేర్పించనున్నట్లు ఇటీవల ఢిల్లీలో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కె కె శర్మ వెల్లడించారు. తమ బలగాలకు యోగాలో కూడా తర్ఫీదునిచ్చేందుకు నిర్ణయించామని, ప్రతి ప్లాటూన్ లోనూ ఓ శిక్షకుడు ఉండేట్లుగా పారామిలటరీ బలగాలకు శిక్షణనివ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్లాటూన్ లోని ఒక్కో టీమ్ సుమారు 35 మంది సిబ్బందితో కూడి ఉండేట్లుగా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ఒత్తిడినుంచి ఉపశమనం కలిగించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని తాజా సెషన్ ప్రారంభం సందర్భంగా బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. సరిహద్దు కాపలా విధులు నిర్వహించడంలో భాగంగా బీఎస్ఎఫ్ లో పనిచేసే పురుషులు, మహిళలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో విధినిర్వహణ ఎంతో కఠినంగా ఉంటుందని ఆ పరిస్థితుల్లో పనిచేసేవారికి యోగా ఒత్తిడిని తగ్గించే మంచి ఆయుధంగా పనిచేస్తుందని వివరించారు. -
లోక్‌సభ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం నేడు ప్రారంభమైన ఈ సమావేశాలు 13 రోజులపాటు జరగనున్నాయి. భూసేకరణ చట్టం - 2013కు సవరణలు ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 3వ తేదీన రూపొందించిన ఆర్డినెన్సుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ యెమెన్‌లో నెలకొన్న సంక్షోభం, అక్కడి భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు, విజయాలను వివరిస్తారు. నెల రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ సమావేశాల్లో ముందుగా సంతాప తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రవేశపెట్టారు. ఇటీవల మరణించిన సింగపూర్ ప్రధాని లీ కువాన్ యూ , మాజీ లోక్‌సభ సభ్యులు ఇరువురు మృతిపై సభ సంతాపం తెలిపింది. ఈ సమావేశాల్లో రైల్వే పద్దులతో పాటు సాధారణ బడ్జెట్లో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరుగనుంది. కాగా రాజ్యసభ సమావేశాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభకానున్నాయి. ఈపార్లమెంటు సమావేశాలు వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మరోవైపు వెంకయ్యనాయుడు వివిధ బిల్లుల ఆమోదం, రాజ్యసభలో ప్రతిపక్షాల ఆధిపత్యం నేపధ్యంలో సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ ఎంపీలను కోరారు. లోక్‌సభ సమావేశాలు మే 8న, రాజ్యసభ సమావేశాలు మే 13న ముగియనున్నాయి. -
నేటినుంచి బడ్జెట్ సమావేశాలు
ఉదయం 8.55 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశంలో ఎజెండాపై నిర్ణయం 12న బడ్జెట్.. 13న ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ సమర్పణ వ్యూహ ప్రతివ్యూహాల్లో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ మరోవైపు ప్రతిపక్షం దాడిని ఎదుర్కొనేందుకు అధికారపక్షం సన్నాహాలు.. హైదరాబాద్: రాష్ట్ర 14వ శాసనసభ నాలుగో విడత(బడ్జెట్) సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. తొమ్మిది నెలల పాలనా కాలంలో చేపట్టిన కార్యక్రమాలను సభలో వినిపించడంతోపాటు విపక్షం నుంచి వచ్చే విమర్శల దాడిని ఎదుర్కొనేందుకు అధికార టీడీపీ వ్యూహాలకు పదును పెడుతుండగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. ముఖ్యంగా రాజధాని నిర్మాణం, భూసమీకరణ, వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ తదితర అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలనుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సభలో వీటిపై సెగలు రేగనున్నాయి. రాజధాని ప్రాంతంలో భూసమీకరణను అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాల్లో పర్యటించి రైతులకు మద్దతుగా నిలిచారు. వామపక్షాలు కూడా ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. అధికారపక్షం తన వాదనలను సిద్ధం చేస్తోంది. ఉభయసభల నుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 8.55 గంటలకు ఏపీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. తర్వాత సభ నిర్వహణ అంశాలపై సభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం నిర్ణయించనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే అవకాశాలున్నాయి. బడ్జెట్‌ను 12వ తేదీన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు.ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 13న సభకు సమర్పిస్తారు. సెలవుదినాలు పోను సభ 16 రోజులు జరిగే అవకాశముంది. అధికారపక్షం అంశాలివే... శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం నుంచి తీవ్రస్థాయిలో విమర్శల దాడి తప్పదని భావిస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ దాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇతర అంశాలను తెరపైకి తేవడం ద్వారా ప్రధానాంశాలను పక్కదారి పట్టించేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. కొంతమంది ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చి సిద్ధం చేయిస్తోంది. అదే సమయంలో సభలో తాను లేవనెత్తాల్సిన అంశాలను కూడా అధికారపక్షం సిద్ధం చేసింది. రైతు రుణమాఫీ, రైతు సాధికార సంస్థ ఏర్పాటు, డ్వాక్రా రుణాల మాఫీ, మహిళా సాధికార కమిటీ ఏర్పాటు, చంద్రన్న కానుక వంటి అంశాలను ప్రస్తావించనుంది. రాజధాని నిర్మాణం, భూసమీకరణ వివాదం, వేసవిలో విద్యుత్తు సరఫరా, తాగునీటి సమస్యలు ప్రస్తావనకు వచ్చే అవకాశమున్నందున వాటిపై సమాధానాలను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై,పట్టిసీమ వ్యవహారంపై ఆరోపణలు వస్తుండడంతో సమాధానాలను రూపొందించుకుంటోంది. ప్రజాసమస్యలపై ప్రధాన ప్రతిపక్షం.. ప్రజాసమస్యలను అసెంబ్లీలో చర్చకు లేవనెత్తేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రాజధానికి భూ సమీకరణలో రైతుల మనోవ్యథను సభద్వారా ప్రభుత్వానికి వినిపించాలని నిర్ణయించింది. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ అంటూ వారిని ప్రభుత్వం మోసగించిన వైనాన్ని ఎండగట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ వైఖరి వల్ల రైతులపై పడిన వడ్డీ భారం, కొత్త రుణాలు అందకుండా పోవడం తదితర అంశాలను ప్రస్తావించనుంది. డ్వాక్రా రుణాలపై సేవాపన్ను వేయడాన్ని ప్రస్తావించనుంది. వ్యవసాయ విద్యుత్తుకు మంగళం పాడేందుకు ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలపై నిలదీయనుంది. విద్యుత్తు చార్జీల పెంపుపై ఈఆర్సీ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం చార్జీల పెంపునకు ప్రభుత్వం పావులు కదుపుతుండడాన్ని ఎండగట్టనుంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో, ప్రత్యేకహోదాను సాధించడంలో, పోలవరంతోపాటు వివిధ ప్రాజెక్టులకు నిధులు పొందడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని సభలో ప్రస్తావించి నిరసన తెలియచేయనుంది. ెగవర్నర్ గతంలో నిలిపివేసిన జీఓ నం.22 పునరుద్ధరణను నిరసించనుంది. పట్టిసీమ అంశాన్నీ ప్రస్తావించనుంది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి.. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా శనివారం నుంచే ప్రారంభం కానున్నాయి. పక్కపక్కనే రెండు అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో భద్రతా ఏర్పాట్లు పోలీసులకు సవాలుగా మారాయి. ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులను మోహరించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ప్రవేశమార్గాల్లో కొన్ని మార్పులు చేశారు. సందర్శకులకు అనుమతి లేదు. గ్యాలరీలోకి కూడా పరిమిత సంఖ్యలోనే పాసులు జారీచేయాలని నిర్ణయించారు. -
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో వైఎస్ జగన్ బృందం భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తో ఆదివారం సాయంత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం భేటీ అయ్యింది. కేంద్రమంత్రులు, ప్రధానమంత్రిని కలిసేందుకు రెండు రోజుల పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే వైఎస్ జగన్ బృందం అరుణ్ జైట్లీతో భేటీ అయ్యింది. అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో వైఎస్ జగన్ బృందం భేటీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రానికి అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రానికి నివేదించడానికి ఆయన తన పార్టీకి చెందిన ఎంపీలతో కలసి శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 23 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన తలపెట్టారు. -
ఏపీకి చేయూతనివ్వండి: వినతులతో ఢిల్లీకి చేరిన జగన్
ఏపీకి చేయూతనివ్వండి: వినతులతో ఢిల్లీకి చేరిన జగన్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రానికి అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రానికి నివేదించడానికి ఆయన తన పార్టీకి చెందిన ఎంపీలతో కలసి శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 23 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన తలపెట్టారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించి తగిన రీతిలో ఆదుకోవాలని కోరడానికిగాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు తదితరుల అపాయింట్మెంట్ కోరారు. వారి అపాయింట్మెంట్ ఖరారవగానే రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఆయన నివేదించనున్నారు. కాగా హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆదివారం ఉదయం 11 గంటలకు జగన్మోహన్రెడ్డి కలవనున్నారు. ఈ నెల 26న రైల్వే బడ్జెట్, 28న సాధారణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా రాష్ట్రానికి తగిన కేటాయింపులు జరపాలని జగన్ నేతృత్వంలోని బృందం కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక రాయితీలు కల్పించడం, ప్రత్యేక రైల్వే జోన్, కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం, ఇతర పెండింగ్ ప్రాజెక్టులకు తగిన కేటాయింపు జరపడం వంటి అంశాలను వైఎస్ జగన్ ప్రధానికి, కేంద్ర మంత్రులకు వివరించనున్నారు. సీఆర్డీఏ పరిధిలో రాష్ట్ర రాజధాని పేరుతో భూసమీకరణ అంశంలో ప్రభుత్వం నుంచి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్నీ కేంద్రం దృష్టికి తేనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లమధ్య తలెత్తిన జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కారం చూపించాలని కోరనున్నారు. నాలుగు రోజులుగా నలిగిన నాగార్జున సాగర్ జలవివాదం, అందుకు దారితీసిన పరిస్థితుల్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో జగన్ సోమవారం వరకు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. -
మరో వారంలో తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు
-
బీసీ బిల్లు కోసం దేశవ్యాప్త ఉద్యమం
హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించే బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమించాలని బీసీ సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా అక్టోబర్ 5వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీ బిల్లుకు మద్దతు కూడగట్టాలని తీర్మానించాయి. హైదరాబాద్‌లోని బీసీ భవన్లో ఆదివారం జరిగిన సమావేశంలో 26 బీసీ సంఘాలు, 12 రాష్ట్రాల బీసీ ప్రతినిధులు, 18 బీసీ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ బిల్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలో బీసీలకు 33 శాతం రాజకీయ రిజరేషన్లు కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాయని గుర్తు చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై దేశ వ్యాప్తంగా ఉద్యమించి చట్టసభల్లో రిజర్వేషన్లు సాధిస్తామని కృష్ణయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, రాజు, వెంకన్న గౌడ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
-
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు
-
నేటితో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలు
-
పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 6 నుంచే..!
-
సీజన్ ఆరంభమైన ఆకాశంలోనే.. కూరగాయల ధరలు
సాక్షి, హైదరాబాద్: సీజన్ ప్రారంభమైనా కొన్ని కూరగాయల ధరలు ఆకాశంలోనే ఉన్నాయి. దిగుబడి పెరిగితే ధరలు దిగివస్తాయనుకున్న పేదవర్గాలకు నిరాశే మిగిలింది. ఉల్లి, బెండ, బీర, చిక్కుడు, గోరుచిక్కుడు, వంకాయల ధర లు సామాన్యుడికి అందనంత ఎత్తులోనే ఉన్నాయి. ఇవి బహిరంగ మార్కెట్లో కేజీ రూ.25 -60 దాకా పలుకుతుండటంతో సామాన్యులు అల్లాడుతున్నా రు. నిజానికి టమాటా, పచ్చి మిర్చి, కాకర, క్యాబేజీ, క్యారెట్, దొండ వంటి ధరలు హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ. 12-20 మధ్యలోనే ఉన్నాయి. అయితే.. అవి వ్యాపారుల చేతి లోకి వచ్చేసరికి హమాలీ, రవాణా, డ్యామేజీ, లాభం కలుపుకొని అధిక ధర నిర్ణయిస్తూ వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. గుడిమల్కాపూర్ హోల్‌సేల్ మార్కెట్లో ఆదివారం కేజీ టమాటా ధర రూ.12 పలకగా.. రిటైల్ మార్కెట్లో రూ.20కు విక్రయించారు. పచ్చి మిర్చి, బెండ, బీర, చిక్కుడు, గోరుచిక్కుడు వంటివి హోల్‌సేల్‌గా రూ.16, రూ.22, రూ.15, రూ.38, 28గా ధర నిర్ణయించగా, రిటైల్‌లో 20 నుంచి రూ.50 దాకా అమ్ముతున్నారు. ఆలుగడ్డ హోల్‌సేల్‌గా రూ.13 ధర పలకగా.. బహిరంగ మార్కెట్లో రూ.18-20కు విక్రయిస్తున్నారు. మొన్నటివరకు డిమాండ్, సరఫరాల మధ్య అంతరం ఉండటంతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు సీమాంధ్ర నుంచి నగరానికి కూరగాయల సరఫరా యథావిధిగా సాగుతోంది. అలాగే కూరగాయల దిగుబడీ పెరిగింది. అయినా ధరలు తగ్గట్లేదు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నగరానికి కూరగాయల సరఫరా తగ్గిందని, ఫలితంగా ధరలు దిగిరావట్లేదని వ్యాపారులు చెబుతుండడం గమనార్హం.