ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(శనివారం) నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఆయన నేడు యూపీతోపాటు అసోం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో పర్యటిస్తున్నారు. అసోంలోని కజిరంగాలోని నేషనల్ పార్క్‌లో సఫారీతో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభమయ్యింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రధాని మోదీ జీప్ సఫారీతో పాటు ఏనుగు సవారీ కూడా చేశారు. ఈ కజిరంగా నేషనల్ పార్క్ ప్రత్యేకతల విషయానికొస్తే..
ఇది 430 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. వివిధ జాతులకు చెందిన వెయ్యికి మించిన జంతువులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఒక కొమ్ము గల ఖడ్గమృగం ఈ రిజర్వ్ ఫారెస్ట్ ప్రత్యేకత. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పార్కులో 2200కు పైగా ఒక కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. అలాగే ఈ పార్క్ 180కు మించిన బెంగాల్ పులులకు నిలయం.
#WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. The PM also took an elephant safari here. pic.twitter.com/Kck92SKIhp
— ANI (@ANI) March 9, 2024
కజిరంగా నేషనల్ పార్క్ నమూనాను నాటి లార్డ్ కర్జన్ భార్య 1904లో రూపొందించారు. 1905, జూన్ ఒకటిన ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటయ్యింది. పార్క్ 430 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. 1908లో గోలాఘాట్, నాగావ్ జిల్లాలను ఈ పార్కు కలిపింది. యునెస్కో దీనిని 1985లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది
కజిరంగాను 2006లో టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. ఈ పార్క్ నవంబర్ నుండి ఏప్రిల్ వరకు పర్యాటకుల కోసం తెరిచి ఉంటుంది. మే ఒకటి నుండి అక్టోబర్ 31 వరకు పార్కును మూసివేస్తారు. ఈ పార్కులో ఏనుగులు 1,940,వైల్డ్ బఫెలోలు 1666, జింకలు 468 ఉన్నాయి.
Assam CM Himanta Biswa Sarma shares video of PM Modi's arrival at Kaziranga National Park pic.twitter.com/FlsjC2fwgU
— ANI (@ANI) March 8, 2024
Comments
Please login to add a commentAdd a comment