‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట.. అది ఎన్నెన్నో తెలియని మమతల మూట’’, ‘‘అమ్మను మించిన దైవమున్నదా..‘‘ పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ’’ ఇలా ఎలా పాడుకున్నా..అమ్మకు సాటి పోటీ ఏమీ ఉండదు.
పొత్తిళ్లలో బిడ్డను చూసింది మొదలు తన చివరి శ్వాసదాకా బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. అంతటి ప్రేమమూర్తి అమ్మ. నిస్వార్థ ప్రేమకు చిరునామా అమ్మ. ప్రపంచమంతా మదర్స్ డే శుభాకాంక్షలు అందించే వేళ మీరు మీ అమ్మకు విషెస్ ఇలా చెప్పండి.
నిజానికి అమ్మ ప్రేమను ఒకరోజుకో, ఒక్క క్షణానికో పరిమితం చేయడం అసాధ్యం. ప్రతీ రోజూ ప్రతీక్షణం అమ్మను ప్రేమించాలి. మనకు జీవితాన్నిచ్చిన అమ్మకు జీవితాంతం రుణ పడి ఉండాల్సిందే.
ఈ మాతృ దినోత్సవం రోజున అమ్మను సర్ ప్రైజ్ చేద్దామా
పొద్దున్న లేవగానే హ్యాపీ మదర్స్ డే అంటూ అమ్మకు విషెస్ చెప్పండి. ఆనందంగా ఆలింగనం చేసుకోండి. హృదయపూర్వకంగా ముద్దుపెట్టుకోండి. మామ్.. నాకు లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ..లవ్యూ అని చెప్పండి. అంతే అపుడు అమ్మ చూపించే మీప్రేమకు మీ కన్నీళ్లు ఆగవు అంతే. అమ్మ ప్రేమ అలాంటిది మరి.
అమ్మకిష్టమైన వంట
అమ్మ రోజూ మనకోసం ఎన్నో చేసి పెడుతుంటుంది. స్కూలుకు, కాలేజీకి, పట్టుకెళ్లిన బాక్స్ పూర్తిగా తినలేదని కోప్పడుతుంది కదా. అందుకే మదర్స్ డే రోజు తనకోసం, తన ఇష్టాఇష్టాలను గురించి, అమ్మకోసం మంచి వంటకం చేసి పెట్టండి.
అమ్మకోరిక తెలుసుకోండి
నిరతరం మనకోసం ఆలోచించే అమ్మ తన గురించి, తన కోరికలు గురించి అస్సలు పట్టించుకోదు. అందుకే ఆమెకు ఏది ఇష్టమో బాగా ఆలోచించండి. స్పెషల్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేయండి. మంచి పుస్తకం, చీర, మొక్కలు లాంటివి కొనివ్వండి. లేదంటే వంట ఇంటి పనిలో భాగంగా ఇది ఉంటే బావుండు ఎపుడూ ఆలోచిస్తూ ఉంటుందో దాని గుర్తించి ఆ వస్తువును ఆమెకు అందుబాటులోకి తీసుకురండి. అమ్మ సంబరం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అమ్మకు ప్రేమించడం మాత్రమే తెలుసు.
అమ్మతో బయటికి
కుటుంబంకోసం ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పక్కన బెట్టే అమ్మను సరదాగా అలా బయటికి తీసుకెళ్లండి. అది మూవీ కావచ్చు, హోటల్‌కి కావచ్చు, మ్యూజిక్ కన్సర్ట్‌కి కావచ్చు. లేదంటే అమ్మకెంతో ఇష్టమైన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లండి.
స్పాకి తీసుకెళ్లండి
సంవత్సరమంతా బిడ్డల కోసం కష్టపడే అమ్మను ఆమెను స్పాకి తీసుకెళ్లండి. తల్లికి అలసట నుండి ఉపశమనం కలిగించే ప్రత్యేక స్పా ప్యాకేజీని తీసుకోండి. కొత్త ఉత్సాహం వచ్చేలా ఏదైనా గ్రూమింగ్‌కి ప్లాన్ చేయండి. తన కోసం ఆలోచించే బిడ్డలు ఉన్నారనే తృప్తి మిమ్మల్ని మరింత ప్రేమించేలా చేస్తుంది.
దూరంగా ఉన్నారా..
అమ్మకు దూరంగా ఉన్నా పరవాలేదు. అమ్మకు దగ్గరగా లేనని ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. కాల్ చేయండి. ఎలా ఉన్నావు? అమ్మా అని ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడండి. ఆమె మనసులో ఏముందో తెలిసుకునే ప్రయత్నం చేయండి. నీను నేను న్నాను అనే భరోసా ఇవ్వండి. ఆమె సంతోషానికి అవధులు ఉండవు. మీరు చేసే ఏ చిన్నపని అయినా ఆమెకు కొండంత సంతోషాన్నిస్తుంది.
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే! అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే!!
Comments
Please login to add a commentAdd a comment