
కుంచమంత కూతురు ఉంటే..మంచం దగ్గరికే అన్నీ చేరతాయనేది సామెత. నిజంగా ఒక ఇంట్లో ఆడపిల్ల ఉంటే తల్లికి, కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. బుడ్జి బుడ్జి చేతులతో చిన్ని చిన్ని పనులు చేస్తూ అమ్మల్ని మురిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది. డాటర్స్ ఆర్ బెస్ట్ అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు.
చిన్న బిడ్డతో, ఇతర పనులతో అలిసిపోయి నిద్రలోకి జారుకున్న అమ్మను చూసిన ఓ చిన్నారి వెంటనే రంగంలోకి దిగిపోయింది. తల్లి నిద్ర చెడకుండా, చిందరవందరగా ఉన్న ఇల్లంతా చక్కగా సర్దేస్తుంది. అంతేకాదు ఉయ్యాలలో ఉన్న పాపాయిని కూడా ఒళ్లోకి తీసుకొని కూచుంటుంది. కాసేపటికి మెలకువ వచ్చి ఆ తల్లి, బిడ్డ చేసిన పనికి పరవశురాలై, ఆత్మీయంగా హత్తుకుని, ముద్దు పెట్టుకోవడం మనం ఈ వీడియోలో చూడొచ్చు.
What a wonderful daughter. ❤️pic.twitter.com/fCDRi8j1mS
— मैं हूँ Sanatani 🇮🇳 🚩🚩 (@DesiSanatani) March 18, 2024
నిజానికి ముద్దార నేర్పించాలే గానీ, ఆడ,మగా అనే తేడా లేకుండా అన్ని పనుల్లో అమ్మానాన్నలకు తోడుగా ఉంటారు పిల్లలు. ప్రస్తుతం సమాజంలో ఇది చాలా అవసరం కూడా. పనులు పంచుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత చిన్నతనంలోనే ఆ విలువ తెలుసుకుంటే.. ఆ ఇల్లు ఆనంద హరివిల్లు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment