కొంతమంది డిప్రెషన్‌కి గురై బాధపడుతుంటారు. పైగా అంత సులభంగా వారు దాని నుంచి బయటడ లేరు కూడా. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచి మేము ఉన్నాం అనే భరోసా ఇచ్చి.. తొందరగా బయటపడేలా చేయాలి. ఏ మాత్రం అయినవాళ్లే నుంచే అవమానం ఎదురైతే... వాళ్లు మరింత కుంగిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. ఐతే ఇక్కడోక అమ్మాయి కూడా అచ్చం అలానే ఆందోళనతో బాధపడుతోంది.
దీంతో ఆమె తన ఇంటి వాకిలి ముందే వర్షంలో తడుస్తూ పడుకుని ఉంది. ఇంతలో సడెన్‌గా వాళ్ల అమ్మ అక్కడికి కారులో వచ్చింది. అక్కడ అలా వర్షంలో తడుస్తూ ..నేలపై పడుకొని బాధపడుతున్న తన కూతుర్ని చూసి ఆమె కారు నుంచి దిగి నేరుగా కూతురు పక్కన కూర్చొంటుంది. ఆ తర్వాత కూతురు ఎలా పడుకుని ఉందో అలా ఆమె కూడా సాయంగా పడుకుని ఉంటుంది.
అంతేగాదు ఆమె ఆందోళన శాంతించేవరకు అలానే ఆమె తోపాటు వర్షంలో పడుకుని అండగా ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కష్టకాలంలో కూతురికి అండగా నిలిచిన ఆ తల్లిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment