ఢిల్లీ అంటేనే ప్రత్యేకమైన ఆహారానికి, కేఫ్‌లుగా ప్రసిద్దిగాంచింది. దొరకని విభిన్న రకాల ఫుడ్ ఐటెమ్స్ ఉండవు. అలాంటి ఢిల్లీలో గౌరీ ఖాన్ తరుచుగా సందర్శించే కేప్ ఒకటి ఉంది. ఆ కేఫ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అక్కడకు ఎప్పుడు వచ్చినా..కాఫీ, పిజ్జా ఆస్వాదించే వెళ్తారు గౌరీ ఖాన్. ఆ కేఫ్ ఎక్కడుందంటే..
ఆ కేఫ్ పేరు ది బ్రౌన్ బాక్స్. ఇది పంచశీల్ పార్క్‌లో ఉంది. పర్ఫెక్ట్ లంచ్ డేట్ కోసం లేదా భాగస్వామితో సరదాగా గడిపేందుకు అనువైన ప్రదేశం. సాయంత్రాల్లో సరదాగా కాసేపు గడపడానికి హాయినిచ్చే ఆహ్లాదకరమైన ప్రదేశం ఆ కేఫ్. అంతేగాదు ఏదైన కంపెనీ సమావేశాల గురించి చర్చించడానికి కూడా అత్యంత అనువైన ప్రదేశం.
మంచి వుడ్‌తో కూడిన ఫర్నేచర్ ఆ కేఫ్‌కి ప్రధాన ఆకర్షణ. ఇక్కడ మంచి సలాడ్‌లు, పాస్తా, సైడ్‌లు, బర్గర్‌లు, కాఫీ, శాండ్‌విచ్‌లు, రిసోట్టో, కేక్‌లు వంటి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించొచ్చు. అంతేగాదు బడ్జెట్‌కి అనుగుణంగా ఖర్చుపెట్టాలనుకున్నా ఈ కేఫ్ బెస్ట్ అని చెప్పొచ్చట.
గౌరీఖాన్, ఆమె కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇక్కడ ఎక్కువగా పిజ్జా, కాఫీని ఆస్వాదిస్తారట. ఈ బేకరీ కేఫ్‌ని పేస్ట్రీ చెఫ్ ప్రియాంక తివారీ నడుపుతున్నారు. ఆమె తన కేఫ్‌లో సాధారణ మెనులకు విభిన్నంగా ఆహారప్రియులు ఇష్టపడేలా సరికొత్త ఐటెమ్స్‌తో కూడిన మెనూని రూపొందించడం విశేషం.
(చదవండి: 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!)
Comments
Please login to add a commentAdd a comment