దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఒక అభ్యర్థి మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన ఎన్నికల్లో గెలవాలని కాకుండా, తన అభిరుచిని నెరవేర్చుకునేందుకే ఇలా అన్ని ఎన్నికల్లోనూ పోటీచేస్తూ వస్తున్నారు.
అతనే వారిస్ హసన్ లాహిరి. రాష్ట్రీయ నారాయణ్ వికాస్‌వాది పార్టీ అభ్యర్థి. ఆయన యూపీలోని అమేథీ జిల్లాలోని గౌరీగంజ్‌కు చెందిన వ్యక్తి. హసన్ లాహిరి గతంలో అంటే 2004, 2009, 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే ప్రస్తుత 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ అమేథీ నుంచి పోటీకి దిగారు. అలాగే 2007, 2012, 2017, 2022లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. వారిస్ హసన్ లాహిరి 10వ తరగతి వరకు చదువుకున్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మా మాతృభూమి గౌరీగంజ్ అని, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బడా నేతలు సైతం పోటీ పడుతుంటారని తెలిపారు. తనకు ఎవరూ వ్యతిరేకం కాదని, ప్రజల గొంతు వినిపించేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తాను గెలిచినా, ఓడినా నిరంతరం ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని లాహిరి తెలిపారు. నిరంతరం ప్రజల గౌరవాన్ని కాపాడుతూనే ఉంటానని, విజయం సాధించే వరకూ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment