1/11
2/11
ఆగస్టు 1 మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు. మహారాష్ట్ర ధూలేలో 1992 న జన్మించింది. ఆమె విద్యాభ్యాసం అంతా ముంబై పరిసర ప్రాంతంలోనే సాగింది. నాన్న బ్యాంకు ఉద్యోగి కావడంతో తరచూ బదిలీ అవుతుండేది. దాంతో ఇంటర్ పూర్తయ్యేలోపు పదకొండు స్కూళ్లు మారింది.
3/11
2013 ప్రాంతంలో ‘ముజ్సే కుచ్ కెహ్తీ..ఖామోషియాన్’లో నటించి అందర్నీ ఆకట్టుకుంది. మొదట ఆమె సీరియల్స్‌తోనే క్రేజ్ దక్కించుకుంది. ఆమె ఎక్కువ కాలం నటించిన సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’ ఇప్పటికీ టీవీల్లో వస్తూనే ఉంటుంది.
4/11
ఆమె మొదటి సినిమా 2014లో వచ్చింది. ‘విట్టు దండు’ మరాఠీ మూవీతో మృణాల్ సినీ ప్రస్థానం మొదలైంది. ఈ మూవీ తర్వాత 2015 లో ‘లవ్ సోనియా’తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ మూవీలో ఆమె నటనతో మెప్పించినప్పటికీ కమర్షియల్‌గా మూవీ హిట్ అందుకోలేదు.
5/11
ఆ సమయంలో మృణాల్ పై చాలా విమర్శలు వచ్చాయి. సినిమాకు పనికొచ్చే మొఖమేనా తనది అంటూ కొందరు కామెంట్లు కూడా చేశారు. ఓసారి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన మృణాల్. ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చిందట.
6/11
టీవీ సీరియల్ నటి హీరోయిన్ కావడం ఏంటి అనే చర్చ కూడా బాలీవుడ్‌లో జరిగిందని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది.
7/11
ఆడిషన్స్ కోసం దర్శకులను నిర్మాతలను అభ్యర్థించాల్సి వచ్చేదని అయినా ఎవరూ కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొంది.
8/11
అయితే అవకాశాల కోసం తన పోరాటం మాత్రం ఆపలేదని. పలు చిన్న సినిమాలు చేస్తూ ఉండటం వల్ల తన టాలెంట్‌పై మేకర్స్‌కు నమ్మకం కలగడం. ఆ తర్వాత ఆడిషన్స్ లేకుండానే సినిమాల్లోకి తీసుకున్నారని తెలిపింది.
9/11
‘లవ్ సోనియా’ మృణాల్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మెల్‌బోర్న్‌లో ఈ సినిమాని ప్రదర్శించినప్పుడు మృణాల్‌కు దర్శకుడు నాగ్‌అశ్విన్ పరిచయమయ్యారు. దీంతో ‘సీతారామం’ అవకాశం దక్కంది. అక్కడి నుంచి ఆమె జీవితం మారిపోయింది.
10/11
తెలుగులో తనకు ‘సీతారామం’ మొదటి సినిమా. ఇదీ భారీ విజయం అందుకోవడంతో మృణాల్ కు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
11/11
ప్రస్తుతం హీరో నాని సరసన ‘హాయ్ నాన్న’లో, విజయ్ దేవరకొండ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది