
పాకిస్తాన్‌లో రహదారుల భద్రత, ప్రమాణాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక నియమనిబంధనలను రూపొందింది. వీటిని జనం అనుసరించేలా పర్యవేక్షిస్తుంటుంది. కొన్ని రోడ్లు పర్యాటక రంగాలలో వృద్ధికి అవకాశాలను అందిస్తున్నాయి. అయితే పాకిస్తాన్‌లో కలల రహదారి అని పిలిచే ఒక రోడ్డు ఉందనే విషయం మీకు తెలుసా? ఎందుకు ఆ రోడ్డును అలా పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
పాక్‌లోని ఉత్తర హిమాలయ ప్రాంతాలను కలిపే కరకోరం హైవేని ‘హైవే ఆఫ్ డ్రీమ్స్’ అని పిలుస్తారు. ఇది 1300 కిలోమీటర్ల పొడవు కలిగివుంది. పాకిస్తాన్ రైల్వే నెట్‌వర్క్‌ను ఆనుకొని ఈ మార్గం ఉంటుంది. ఈ రహదారిని బాని ములాకాత్ అనే అంతర్జాతీయ ప్రాజెక్టులో భాగం చేశారు. ఈ మార్గం హిమాలయాలలోని అత్యున్నత పర్వత శ్రేణిని దాటుతుంది. ఈ మార్గంలోని దృశ్యాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఈ రహదారిలో ప్రయాణించాలని పర్యాటకులు తహతహలాడుతుంటారు.
కరకోరం హైవే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారులలో ఒకటిగా పేరొందింది. ఈ రోడ్డు నిటారుగా ఉన్న రాళ్లపై నిర్మితమయ్యింది. ఇవి బలహీనపడుతున్న కారణంగా తరచూ మరమ్మతులు చేయల్సి వస్తుంటుంది. కారకోరం హైవేలో ప్రయాణం ప్రత్యేక అనుభూతులను అందిస్తుందని అంటారు. ఈ సరిహద్దు రహదారిలో మంచు పర్వతాలు, లోయలు, నదులు, అందమైన సరస్సులు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి: మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. పట్టించుకోని ప్రయాణికులు!
Comments
Please login to add a commentAdd a comment