Himalaya
-
టిబెట్‌ను వణికించిన భూకంపం
బీజింగ్: చైనాలోని అటానమస్ ప్రాంతం టిబెట్‌లో మంగళవారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.05 గంటల సమయంలో చోటుచేసుకున్న భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. దీని తీవ్రత డింగ్రీ కౌంటీలోని జిగాజెపై ఎక్కువగా పడింది. అక్కడ నివాస భవనాలు కూలడం వంటి ఘటనల్లో కనీసం 126 మంది ప్రాణాలు కోల్పోగా మరో 188 మంది క్షతగాత్రులయ్యారు. అయితే, భూకంప తీవ్రత 7.1 వరకు ఉందని అమెరికా జియోలాజికల్ విభాగం అంటోంది.ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో, అధికారులు ఆహార పదార్థాలు, మంచినీరుతోపాటు కాటన్ టెంట్లు, కాటన్ కోట్లు, కిల్టులు, బెడ్లు తదితరాలను హుటాహుటిన పంపించారు. జిగాజె ప్రాంతాన్ని షిగస్తె అని కూడా పిలుస్తారు. ఇది భారత్‌తో సరిహద్దులకు సమీపంలోనే ఉంటుంది. టిబెట్‌లోని పవిత్ర నగరాల్లో షిగస్తె ఒకటి. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా తర్వాతి స్థానంగా భావించే పంచన్ లామా ఉండేది షిగస్తెలోనే. భూకంప కేంద్రం డింగ్రి కౌంటీలోని త్సొగోలో ఉంది.భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం నేపాల్‌లోని లొబుట్సెకు 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. భూ ప్రకంపనల ప్రభావంతో నేపాల్‌లోని కవ్రెపలన్చౌక్, సింధుపలన్చౌక్ ధడింగ్, సొలుకుంభు జిల్లాలతోపాటు రాజధాని కఠ్మాండులోనూ కరెంటు స్తంభాలు, చెట్లు, భవనాలు కదిలాయి. ఇళ్లలో వస్తువులు శబ్దాలు చేస్తూ పడిపోవడంతో జనం భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. -
ఆధ్యాత్మిక ప్రయాణం
ఒక సినిమా షూటింగ్ ఆరంభించే ముందు... లేదా సినిమా పూర్తయ్యాక ఆధ్యాత్మిక యాత్ర చేస్తుంటారు రజనీకాంత్. ఆయన ఎక్కువగా హిమాలయాలకు వెళ్లే విషయం తెలిసిందే. అక్కడి మహావతార్ బాబాజీ గుహలో రజనీ ధ్యానం చేస్తుంటారట. తాజాగా రజనీకాంత్ మరోసారి ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. దాదాపు పది రోజులు హిమాలయాల్లో గడిపి, తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారట. చెన్నై చేరుకున్న వెంటనే తన తాజా చిత్రం ‘కూలీ’ చిత్రీకరణలో పాల్గొంటారు రజనీకాంత్.లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. మరోవైపు రజనీకాంత్ నటించిన చిత్రం ‘వేట్టయాన్’. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘వేట్టయాన్’లో రజనీకాంత్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ ఏడాది అక్టోబరులో ఈ చిత్రం విడుదల కానుంది. -
పాక్‌లో అది ‘కలల రహదారి’ ఎందుకయ్యింది?
పాకిస్తాన్లో రహదారుల భద్రత, ప్రమాణాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక నియమనిబంధనలను రూపొందింది. వీటిని జనం అనుసరించేలా పర్యవేక్షిస్తుంటుంది. కొన్ని రోడ్లు పర్యాటక రంగాలలో వృద్ధికి అవకాశాలను అందిస్తున్నాయి. అయితే పాకిస్తాన్లో కలల రహదారి అని పిలిచే ఒక రోడ్డు ఉందనే విషయం మీకు తెలుసా? ఎందుకు ఆ రోడ్డును అలా పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పాక్‌లోని ఉత్తర హిమాలయ ప్రాంతాలను కలిపే కరకోరం హైవేని ‘హైవే ఆఫ్ డ్రీమ్స్’ అని పిలుస్తారు. ఇది 1300 కిలోమీటర్ల పొడవు కలిగివుంది. పాకిస్తాన్ రైల్వే నెట్‌వర్క్‌ను ఆనుకొని ఈ మార్గం ఉంటుంది. ఈ రహదారిని బాని ములాకాత్ అనే అంతర్జాతీయ ప్రాజెక్టులో భాగం చేశారు. ఈ మార్గం హిమాలయాలలోని అత్యున్నత పర్వత శ్రేణిని దాటుతుంది. ఈ మార్గంలోని దృశ్యాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఈ రహదారిలో ప్రయాణించాలని పర్యాటకులు తహతహలాడుతుంటారు. కరకోరం హైవే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారులలో ఒకటిగా పేరొందింది. ఈ రోడ్డు నిటారుగా ఉన్న రాళ్లపై నిర్మితమయ్యింది. ఇవి బలహీనపడుతున్న కారణంగా తరచూ మరమ్మతులు చేయల్సి వస్తుంటుంది. కారకోరం హైవేలో ప్రయాణం ప్రత్యేక అనుభూతులను అందిస్తుందని అంటారు. ఈ సరిహద్దు రహదారిలో మంచు పర్వతాలు, లోయలు, నదులు, అందమైన సరస్సులు కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. పట్టించుకోని ప్రయాణికులు! -
హిమాలయాలు క్యాన్సిల్.. ప్రచారం షురూ: ఉమాభారతి యూటర్న్!
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి తన హిమాలయాల పర్యటనను రద్దు చేసుకుని, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. నవంబర్ 9 నుంచి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆమె సిల్వానీలోని బమ్‌హోరీ, సాగర్‌లోని సుర్ఖీలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అయితే దీనికి ముందు ఉమాభారతి ఎన్నికల ప్రచారాన్ని నిరాకరించి, తాను హిమాలయాలకు వెళుతున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఆమె పేరు నమోదు కాలేదు. అయితే ఆ తరువాత ఆమె మనసు మార్చుకుని, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అభ్యర్థన మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఉమాభారతి లలిత్పూర్ రైల్వే స్టేషన్లో స్వల్పంగా గాయపడ్డారు. ఆమె ఎడమ కాలికి గాయం అయ్యింది. తరువాత ఆమె ఝాన్సీలో ఫిజియోథెరపీ చేయించుకున్నారు. తరువాత వైద్యుల సూచన మేరకు భోపాల్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా ఆమె వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. తాను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదని, రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని ఇటీవల స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు -
నేపాల్‌లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయంటే..
హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్‌లో మరోసారి భూమి కంపించింది. ఈ విపత్తులో 70 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. 6.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావం భారతదేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా కనిపించింది. నేపాల్‌లో గతంలోనూ అనేక భూకంపాలు సంభవించాయి. 2015లో నేపాల్‌లో సంభవించిన భూకంపంలో ఎనిమిది వేల మంది మృత్యువాతపడ్డారు. అయితే నేపాల్‌లో తరచూ భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి? శాస్త్రవేత్తలు దీనిపై ఏమంటున్నారు? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపాల్ భౌగోళిక స్వరూపమే తరచూ భూకంపాలు సంభవించడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేపాల్‌లో 17 శాతం ప్రాంతం మాత్రమే మైదానం. మిగిలిన ప్రాంతంలో పర్వతాలు, అడవులు ఉన్నాయి. నేపాల్ ఉత్తర చివరలో ఎత్తయిన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. నేపాల్ తరచూ భూకంపాలకు ఎందుకు గురవుతుందో తెలసుకోవాలంటే ముందుగా భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. భూమి అనేది భారీ టెక్టోనిక్ ప్లేట్లతో రూపొందింది. భూమిలోపలి ఈ టెక్టోనిక్ ప్లేట్లు వివిధ పరిస్థితుల కారణంగా కదులుతూ ఉంటాయి. అలాగే ఒకదానికొకటి ఢీకొంటాయి. నేపాల్.. రెండు భారీ టెక్టోనిక్ ప్లేట్ల అంచున ఉంది. నేపాల్ ఇండో-ఆస్ట్రేలియన్, యురేషియన్ ప్లేట్ల మధ్య ఉంది. ఈ రెండు ప్లేట్లు ఢీకొన్నప్పుడు నేపాల్‌లో భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ రెండు ప్లేట్లు ప్రతి సంవత్సరం ఐదు సెంటీమీటర్ల చొప్పున ఒకదానిపైకి మరొకటి ఎక్కేలా కదులుతున్నాయి. ఫలితంగా నేపాల్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తాయి. ఐదు సెంటీమీటర్ల వేగం చిన్నదిగా అనిపించినప్పటికీ, దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు పలకల తాకిడి కారణంగా 50 మిలియన్ సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయని చెబుతారు. నేపాల్‌కు ఉన్న మరో పెద్ద సమస్య అక్కడి బలహీనమైన భవనాలు. ఇవి బలమైన భూప్రకంపనలను తట్టుకోలేవు. భూకంపం వచ్చినప్పుడల్లా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడానికి ఇదే ప్రధాన కారణం. ఇది కూడా చదవండి: ఆసియాను వణికించిన భూ కంపాలివే.. -
రజినీకాంత్, నయన్ బాటలో యంగ్ హీరోయిన్.. అదేంటో తెలుసా?
ఆస్తికం, నాస్తికం అనేది మనిషి జీవన విధానాన్ని బట్టే ఉంటుంది. ఆస్తికులు భక్తి బాట పడితే.. నాస్తికులు సైన్సును నమ్ముతారు. ఈ విషయంలో ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అయితే ప్రముఖ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటే.. ఆయన స్నేహితుడు, విశ్వనటుడు కమలహాసన్ నాస్తికతకు ప్రాధాన్యతనిస్తారు. అదే విధంగా నటి నయనతార పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా గుళ్లు, గోపురాలు తిరిగొచ్చారు. (ఇది చదవండి: బుల్లితెరపై యాంకర్‌గా సన్నీలియోన్.. ఎవరికి చెక్ పెడుతుందో) తాజాగా మరో యువ నటి ఆత్మిక సైతం నయనతార, రజినీకాంత్ తరహాలో ఆధ్యాత్మిక బాట పట్టింది. హిప్ హాప్ తమిళా ఆదికి జంటగా మీసై మురుక్కు చిత్రం ద్వారా కథానాయికిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కోడియిల్ ఒరువన్, కాట్టేరి, కన్నై నంబాదే, తిరువిన్ కాదల్ చిత్రాల్లో నటించారు. కాగా ఈమె ప్రస్తుతం భక్తి బా ట పట్టడం విశేషం. ఆద్మిక ప్రస్తుతం రజినీకాంత్ తరహాలో హిమాలయాలకు వెళ్లారు. అక్కడ బాబాజీ గుహలో ధ్యానం చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. దీని గురించి ఆత్మిక స్పందిస్తూ తన ఆధ్యాత్మిక పయనం అన్నది ఆత్మ ఆదేశం అని పేర్కొన్నారు. బాబాజీ గుహకు వెళ్లాలని దైవమే పిలుపు వచ్చిందన్నారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా బయలుదేరినట్లు చెప్పారు. అయితే ఇది తనకు మరణ అనుభవాన్ని చవిచూసే అనుభవమని పేర్కొన్నారు. అయితే కొన్ని మంచి పరిణామాలు సులభంగా కలిగాయని చెప్పారు. బాబాజీ గుహలో ధ్యానం కోసంకూర్చున్నప్పుడు కలిగిన దైవిక అనుభూతిని జీవితాంతం మరిచిపోలేనన్నారు. ఆ తర్వాత జీవితంపై తన దృష్టి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఈ లోకంలోని ప్రతిఒక్కరూ ఒక్కసారైనా ఇలాంటి అనుభవాన్ని పొందాలని ఆత్మిక పేర్కొన్నారు. (ఇది చదవండి: హెచ్చరించినా తీరు మార్చుకోని శివాజీ.. పంపించేస్తే బెటర్!) View this post on Instagram A post shared by Aathmika 🦁 (@iamaathmika) -
వినోబా భావే హిమాలయ బాట ఎందుకు పట్టారు? గాంధీజీ సాంగత్యంతో ఏం జరిగింది?
వినోబా భావే పాత్ర భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వినోబా భావే స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడని చెబుతారు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూనే, దేశానికి సేవ చేయాలనే తన సంకల్పాన్ని నిరంతరం కొనసాగించారు. గాంధీజీని కలిసిన తర్వాత తన జీవిత లక్ష్యాలను వినోబా భావే అంకితభావంతో ఎలా సాగించాడో అతని జీవిత ప్రయాణం చెబుతుంది. గాంధీజీ మరణానంతరం మహాత్ముని జీవన విధానాలను సజీవంగా నిలిపివుంచి, దేశ సేవను కొనసాగించిన వారిలో ఆయన ఒకరు. భగవంతునిపై నమ్మకం, ఆధ్యాత్మికతపై ప్రేమ వినోబా భావే 1895 సెప్టెంబర్ 11న మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలోని గగోడా గ్రామంలో జన్మించారు. చిత్పావ్ బ్రాహ్మణ నరహరి భావే, రుక్మణి బాయిల ఐదుగురు పిల్లలలో వినోబా పెద్దవాడు. వినోబా చిన్నప్పటి నుంచి తెలివైన పిల్లాడిగా గుర్తింపు పొందారు. తల్లి సాంగత్యంలో ఆయనకు మొదటి నుంచీ భగవంతునిపై నమ్మకం, ఆధ్యాత్మికతపై ప్రేమ ఏర్పడింది. తార్కిక ఆలోచనలు కలిగిన వినోబా తన తండ్రి నుండి గణితం, సైన్స్ నేర్చుకున్నారు. తండ్రి చెప్పారని ఫ్రెంచ్, తల్లి కోరిక మేరకు సంస్కృతం.. వినోబా హైస్కూల్‌కు చేరుకున్న తర్వాత అతని తండ్రి వినాయక్ ఫ్రెంచ్ నేర్చుకోవాలని కోరగా, అతని తల్లి సంస్కృతం నేర్చుకోవాలని కోరింది. వినాయక్ హైస్కూల్లో ఫ్రెంచ్ను ఎంచుకున్నారు. తల్లి కోరిక మేరకు ఇంట్లో సంస్కృతం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వినాయక్‌కు చదువుపై ఉన్న ఆసక్తి కారణంగా మతపరమైన పుస్తకాలు చదివేవారు. ఫ్రెంచ్ సాహిత్యంతో పాటు వేదాలు, ఉపనిషత్తులు కూడా శ్రద్ధగా చదివారు. ఈ నేపధ్యంలో వినోబా ఆధ్యాత్మిక ఆకలి పెరుగుతూ వచ్చింది. అతను తన జీవిత లక్ష్యాలపై మరింత లోతుగా ఆలోచించేవారు. కాశీలో రైలు దిగిపోయి.. ఆ రోజుల్లో వినోబా చదువుకోసం ముంబై వెళ్లాల్సి వచ్చింది. 1916 మార్చి 25న ముంబై వెళ్లేందుకు రైలు ఎక్కారు. అయితే అక్కడ చదువు పూర్తయ్యాక ఏం చేయాలి? తన జీవిత లక్ష్యం ఏమిటి? ఏం చేయాలి అనే ప్రశ్నలు మనసులో కలకలం రేపాయి. ఇంతలో వినోబా ప్రయాణిస్తున్న రైలు సూరత్ చేరుకుంది. ఆయన అక్కడ రైలు దిగి, హిమాలయాలవైపు పయనమయ్యేందుకు తూర్పు వైపునకు వెళ్లే రైలులో కూర్చున్నారు. అయితే కాశీలో రైలు దిగిపోయాడు. శివుని నివాసమైన కాశీలో తనకు సరైన మార్గాన్ని చూపించగల ఋషులు, సాధువులను కలుసుకోవచ్చని భావించారు. గంగా తీరంలో చాలా కాలం పాటు తిరిగారు. అక్కడ తాను ఆశించినది దొరకకపోవడంతో హిమాలయాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వినోబా స్వయంగా గాంధీజీకి లేఖ రాయగా... ఆ సమయంలో యాదృచ్ఛికంగా హిందూ విశ్వవిద్యాలయంలో ఒక సదస్సు జరుగుతోంది. దీనిలో గాంధీజీ ధనవంతులకు ఒక విజ్ఞప్తి చేశారు. వారు తమ సంపదను పేదల సేవకు వినియోగించాలని కోరారు. అ అంశంపై జరిగిన చర్చ మరుసటి రోజు దినపత్రికల్లో ప్రచురితమైంది. వినోబాకు ఈ వార్తాపత్రిక కనిపించింది. అందులో గాంధీజీ గురించి చదివిన తర్వాత, గాంధీజీ మాత్రమే తనకు సరైన మార్గాన్ని చూపగలరని వినోబా భావించారు. దీంతో వినోబా స్వయంగా గాంధీజీకి లేఖ రాయగా, గాంధీజీ దానికి సమాధానమిస్తూ ఆహ్వానం పంపారు. ఈ మేరకు వినోబా.. గాంధీజీ ఆశ్రమం ఉన్న అహ్మదాబాద్‌కు బయలుదేరారు. వారిద్దరూ 1916 జూన్ 7న తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితులయ్యారు. గాంధీజీ అతనికి వినోబా అని పేరు పెట్టారు. అంతకు ముందు అతని పేరు(వినాయక్ నరహరి భావే). గాంధీజీని కలిసినది మొదలు వినోబా గాంధేయవాదిగా మారారు. అదే బాటలో జీవితాన్ని కొనసాగించారు. ఇది కూడా చదవండి: ‘భారత్ మండపం’ పరిస్థితి ఏమిటి? ఎవరైనా బుక్ చేసుకోవచ్చా? -
ఈ స్పెషల్ హ్యాండ్‌బ్యాగ్‌ని అమ్మితే.. కోట్లలో లాభాలు..
పెట్టుబడి మీద మంచి లాభాలు కొనాలంటే బంగారం, రియల్ ఎస్టేట్ సులువైన మార్గాలు. కొంచెం శ్రమిస్తే స్టాక్‌మార్కెట్ కూడా ఎక్కువ లాభాలే అందిస్తుంది. కానీ వీటన్నింటిని ఈ బ్యాగును కొన్ని కొన్నాళ్లు వాడుకుని అమ్మేసినా చాలు పెట్టుబడి మీద స్టాక్ మార్కెట్‌ను మించి రిటర్న్స్ వస్తున్నాయి. ఇంతకీ కాసుల పంట పండిస్తున్న ఆ బంగారుబాతు లాంటి బ్యాగు పేరు హెర్మిస్ బిర్కిన్. హోదాకు చిహ్నం సెలబ్రిటీ, ధనవంతుల ప్రపంచంలో బిర్కిన్ బ్యాగులకు ఉండే క్రేజ్ వేరు. ఐశ్వర్యవంతుల కుటుంబ సభ్యులు బిర్కిన్ బ్యాగుని ధరించడం తమ హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు. అందుకే ఈ బ్యాగును కొనుగోలు చేసేందుకు ఎంత ధరైనా చెల్లించేందుకు వెనుకడారు. ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు బెక్‌హామ్ భ్యార విక్టోరియా బెక్‌హామ్ దగ్గర వందకు పైగా బిర్కిన్ బ్యాగులు ఉన్నాయి. వీటి విలువ రూ. 7 కోట్లకు పైమాటే. అదే విధంగా సింగపూర్ ఎంట్రప్యూనర్ జేమీ చువా దగ్గర అయితే ఏకంగా ఈ బ్యాగులు రెండు వందలకు పైగానే ఉన్నాయి. హిమాలయ ధర రూ.3.75 కోట్లు హెర్మిస్ బిర్కిన్ బ్యాగుల్లో అనేక మోడళ్లు ఉన్నప్పటికీ ఇందులో అత్యంత ప్రత్యేకమైనవి హిమాలయ శ్రేణి హ్యాండ్ బ్యాగులు. ఈ బ్యాగు తయారీలో ప్రత్యేకమైన జంతు చర్మం ఉపయోగించడంతో పాటు 18 క్యారెట్ బంగారంతో చేసిన మెటీరియల్ 200 వజ్రాలు ఈ బ్యాగులో పొదిగి ఉంటాయి. అమెరికన్ బెట్టింగ్ రారాజు డేవిడ్ ఓనాసియా హిమాలయన్ బ్యాగుని ఇటీవల 5 లక్షల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు 3.75 కోట్లు )చెల్లించి కొనుగోలు చేశాడు. ఒక్క హ్యాండ్ బాగుకి సంబంధించి ఇదే అత్యధిక ధర. ప్రపంచ రికార్డు కూడా. కానీ త్వరలోనే ఈ రికార్డు కూడా మాయం కాబోతుంది. ఎందుకంటే రాబోయే ఈ రోజుల్లో ఈ బ్యాగుని 20 లక్షల డాలర్ల (రూ.14 కోట్లు)కి అమ్మేస్తానంటూ చెబుతున్నాడు డేవిడ్ ఓనాసియా. సెలబ్రిటీ ప్రపంచంలో ఈ బ్యాగుకి ఆ స్థాయి క్రేజ్ ఉంది. ఎలా వచ్చాయి ఇంగ్లండ్‌కి చెందిన నటీ సింగర్ జేన్ బిర్కిన్ ఓసారి ప్యారిస్ నుంచి లండన్‌కి విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఆమె తన హ్యాండ్‌బ్యాగుని లగేజ్ ర్యాక్‌లో పెట్టగా.. మార్గమధ్యంలో స్ట్రాప్ ఊడిపోయి అందులో వస్తువులన్నీ కింద పడిపోయాయి. ఆ సమయంలో అదే విమానంలో ప్రయాణం చేస్తున్న లగ్జరీ గూడ్స్ తయారీ సంస్థ హెర్మీస్ సీఈవో లూయిస్ డ్యుమాస్, జేన్ కిర్బిన్ ఇబ్బందిని గమనించాడు. ఇకపై మీకు ఈ సమస్య ఉండదంటూ ఆమెకు హమీ ఇచ్చాడు. ఏడాదిలోగా అన్నట్టుగానే ఏడాది తిరిగే సరికి అత్యంత సుందరైన, సౌకర్యవంతమైన బ్యాగుని తయారు చేసి దానికి బిర్కిన్ అనే పేరు పెట్టి ఆ నటికి బహుమతిగా అందించాడు. ఈ ఘటన 1984లో జరిగింది. ఎంపిక చేసిన జంతువుల చర్మాలతో ఎంతో కళాత్మకంగా పూర్తి హ్యాండ్ మేడ్‌గా బిర్కిన్ బ్యాగు రూపొందింది. పైగా ఆనాటి ప్రముఖ నటి పేరు మీదుగా రావడం దీనికి ప్లస్ అయ్యింది. అంతే ఐదేళ్లు తిరిగే సరికి బిర్కిన్ బ్యాగ్ సెలబ్రిటీల హోదాకు ప్రత్యామ్నయంగా మారింది. డిమాండ్ ఎందుకు సెలబ్రిటీల హోదాకు బిర్కిన్ చిహ్నంగా మారడంతో 90వ దశకంలో ధనవంతులు ఈ బ్యాగులను సొంతం చేసుకునేందుకు పోటీ పడటం మొదలైంది. అయితే డిమాండ్ ఎంత ఉన్నా హెర్మిస్ సంస్థ ఈ బ్యాగులను పరిమితంగానే తయారు చేయడం ప్రారంభించింది. ఎంతటి ధనవంతులైనా.. ఎంత డబ్బులు చెల్లిస్తామన్నా ఎన్నంటే అన్ని బ్యాగులు తయారు చేయదు హెర్మిస్. పైగా బ్యాగులు కొనుగోలుపై కూడా పరిమితి విధిస్తుంది. దీంతో వీటి పట్ల క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. వీటిని తమ భాగస్వామికి బహుమతిగా అందించేందుకు కోటీశ్వరులు ఊవ్విళ్లూరుతారు. ఎలాగైనా ఈ బ్యాగు ఉండాల్సిందే అనుకునే మగువల క్యూ అంతకంతకు రెట్టింపయ్యింది. అందుకే కోట్ల రూపాయలు పోసీ బిర్కిన్ బ్యాగులు కొనేస్తున్నారు. 500ల శాతం పరిమిత సంఖ్యలో బ్యాగులు లభించడం, అపరిమిత సంఖ్యలో కొనుగోలుదారులు ఆసక్తి చూపడంతో అనతి కాలంలోనే బిర్కిన్ బ్యాగుల డిమాండ్ ఆకాశాన్ని తాకింది. దానికి తగట్టే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వీటిని కొనేందుకు పోటీ పెరిగింది. వాడిన బ్యాగులైనా సరే అసలు కంటే ఎక్కువ ధర పెట్టి కొనడం మొదలైంది. 2017లో చేపట్టిన సర్వేలో బిర్కిన్ బ్యాగుల విలువ గడిచిన 35 ఏళ్లలో 500 శాతం పెరిగినట్టు.. ప్రతీ ఏడు ఈ బ్యాగుల విలువ 14 శాతం పెరుగుతూ వస్తోందని తేలింది. ఫేక్‌ల వెల్లువ బిర్కిన్ బ్యాగులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో మార్కెట్లో ఫేక్ బ్యాగులు కూడా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే వందలాది కేసులు నమోదయ్యాయి. అయినా సరే ఫేక్‌లను పూర్తిగా అరికట్టలేకపోయారు. - సాక్షివెబ్ ప్రత్యేకం -
హిమాలయన్ వయాగ్రా..‘యార్సాగుంబా..
ఒక కిలో యార్సాగుంబా ధర రూ.60 లక్షల(లక్ష డాలర్ల) పైమాటే. గ్రామీణ నేపాల్‌లో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో మెజారిటీ కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. చాలా విలువైన మూలికలు కావడంతో వీటి కోసం ప్రాణాలకు తెగించి మరీ ఈ కుటుంబాలు పోరాడుతున్నాయి. హిమాలయాల్లో వేసవి ప్రారంభమై మంచు కరగడం మొదలుపెడితే చాలు.. నేపాలీలు పచ్చిక బయళ్ల వైపు పరుగు తీస్తారు.. నెల రోజుల పాటు బంగారం కన్నా విలువైన వస్తువు కోసం చిన్నాపెద్దా అంతా వేట సాగిస్తారు. ఇంతకీ వీరి అన్వేషణ దేనికి అంటే.. యార్సాగుంబా కోసం.. ఇదే హిమాలయన్ వయాగ్రా. పసుపు పచ్చ రంగులో ఉండే యార్సాగుంబా బురదలో పెరుగుతుంది. లైంగిక కోరికలను రేకెత్తించడం తోపాటు పుష్కలమైన ఔషధ గుణాలున్న మూలిక. గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్సే ఈ యార్సాగుంబా. చైనాలో డాంగ్ ఛాంగ్ జియా కావో అనే రెండు తలల పురుగు ఉంటుంది. దీనిని వేసవి గడ్డి, చలికాలపు పురుగు అంటారు. శీతాకాలంలో యార్సాగుంబా పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది. ఎలా గుర్తించారు... వెయ్యేళ్ల క్రితం పశుపోషకులు యార్సాగుంబాను గుర్తించారు. దీనిని పశువులకు దాణాగా ఉపయోగించే వారు. వీటిని తిన్న తర్వాత పశువులు చాలా చురుకుగా మారిపోయేవి. దీంతో ఈ మూలికల్లో ప్రత్యేకత ఉందని గుర్తించారు. 1960ల్లో టీ, సూప్‌లు మొదలైన వాటిలో ఈ మూలికలను కలిపి తాగేవారు. బాతులను తినేందుకుగానూ ముందుగా వాటికి యార్సాగుంబా మూలికలను తినిపించేవారు. ఓ చైనీస్ రన్నర్ దీనిని తిని రెండు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టడంతో 1990ల్లో దీనికి ప్రపంచ గుర్తింపు లభించింది. పెరిగిన డిమాండ్.. తగ్గిపోతున్న ఉత్పత్తి.. ప్రస్తుతం చైనా ఔషధ పరిశోధకులు దీనిని లైంగిక కోరికలు పెంచే.. నపుంసకత్వాన్ని నయం చేసే మూలి కగానే కాక.. జాయింట్ పెయిన్స్‌ను తగ్గిస్తుందని, ఊబకా యం, కేన్సర్‌కు ఉపయోగపడుతుందని చెపుతున్నారు. యార్సాగుంబాకు ఉన్న వైద్య విలువపై హైప్ కారణంగా ఇటీవల డిమాండ్ పెరిగింది. ఈ ఉత్పత్తుల కోసం జనం ఎగబడుతున్నారు. దీంతో 2009–2011 తర్వాత యార్సాగుంబా ఉత్పత్తి సగానికిపైగా పడిపోయింది. సరైన నియంత్రణ లేకపోవడం, వాతావరణ మార్పులు, ఉత్పత్తికి మించి డిమాండే దీనికి కారణం. -
శంభల భూతల స్వర్గం
-
హిమాలయం కాదు విలయాలయం
అరకు కూడా.. కోల్‌కతా: హిమాలయ పరిసర ప్రాంతాలు ప్రకృతి వైపరీత్యాలకు నెలవు అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆదివారం ప్రకటించింది. అంతేకాకుండా భారత భూభాగంలోని 12 శాతం నేలల్లో పలు ప్రకృతి విపత్తులు సంభవించే ఆస్కారం ఉందని తెలిపింది. ఈ భూభాగంలో డార్జిలింగ్, సిక్కింలాంటి ఈశాన్య హిమాలయాల్లోని 1.8 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ లాంటి వాయవ్య హిమాలయ ప్రాంతాల్లోని 1.4 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం వైపరీత్యాలు సంభవించేదిగా ఉందని వివరించింది. పశ్చిమ కనుమల్లోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవాలాంటి పలు ప్రాంతాలల్లో 0.9 లక్షల.చ.కి, తూర్పు కనుమల్లోని అరకు లాంటి ప్రాంతాల్లో 0.1 లక్షల.చ.కి ఈ జాబితాలో ఉందని జీఎస్ఐ పేర్కొంది. -
ఎవరెస్టుపై 18 మంది మృతి
నేపాల్: హిమాలయ పర్వతాలను చుట్టేసిన భూకంపం కారణంగా ఎవరెస్టు శిఖరంపై 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పర్వతారోహణ సమయం కావడంతో ప్రమాదం అంచనా వేయని వీరంతా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలనే ఉద్దేశంతో సాహసయాత్ర ప్రారంభించి ప్రమాద బారిన పడ్డారు. వీరిలో చాలామంది బ్రిటన్ దేశస్థులే ఉన్నారు. వీరిలో ప్రధానంగా గూగుల్ సంస్థకు చెందిన సీనియర్ అధికారి డేనియల్ ఫ్రెడిన్ బర్గ్ (33), న్యూజెర్సీకి చెందిన డాక్టర్ మరిసా ఈవ్(29) వంటివారు కూడా ఉన్నారు. మిగితా వారిని గుర్తించాల్సి ఉంది. భారీ భూకంపం సంభవించి నేపాల్ కకావికలమైన విషయం తెలిసిందే. -
ఆమె?
అంతరిక్షంలోని అంగారక గ్రహం... హిమాలయాలలోని ఎవరెస్ట్ శిఖరం... పసిఫిక్ మహా సముద్రంలోని అట్టడగు పొరలు... కావేవీ మహిళాభ్యుదయానికి అవరోధం... అని చేతల్లో నిరూపిస్తున్నారు నేటి మహిళలు. కొండకచో.. మేం మాత్రమే సాధించగలం... మేము కాక ఇంకెవరు సాధించగలరు?.. అంటూ ఛాలెంజింగ్‌గా ముందుకు కదిలివస్తున్న మహిళా సాహసికులు నేడు మునుముందుకు దూసుకువస్తున్నారు. మరో పక్క భ్రూణ హత్యలు... ప్రేమ పేరుతో యాసిడ్ దాడులు... ‘నిర్భయ’ంగా కొనసాగుతున్న లైంగిక దాడులు.. సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాలకవర్గాలు మహిళా సాధికారత, మహిళా రిజర్వేషన్లు అంటూ ఊకదంపుడు మానేసి మహిళాభ్యున్నతికి స్పష్టమైన హామీ కావాలని మహిళా దినోత్సవం ప్రశ్నిస్తోంది. మహిళా వివక్ష రద్దు కావాలని, మహిళాభ్యున్నతికి ఆకాశమే హద్దు కావాలి. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆనందంతో మహిళా ఉద్యోగులు, ఉద్యమకారులు, మేధావులు సిద్ధమయ్యారు.