దేశీయ స్టాక్ మార్కెట్‌లో మూరత్ ట్రేడింగ్ ప్రారంభం అయ్యింది. దీపావళి పర్వదినం సందర్భంగా ట్రేడింగ్ చేస్తే .. వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందనేది మదుపర్ల నమ్మకం. అందులో భాగంగా ప్రతి ఏడాది స్టాక్ ఎక్ఛేంజీలు మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఈ ట్రేడింగ్ గంట సేపు కొనసాగుతుండగా.. ఆ సమయంలో కనీసం ఒక్క స్టాకైనా కొనుక్కోవాలని ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తుంటారు.
చదవండి👉 పాపం..చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా!
సంపదకు, ధనానికి మూలం అయిన లక్ష్మీదేవిని పూజిస్తూ మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజు ట్రేడింగ్ చేయడం వల్ల ధనంతో ఇల్లు కళకళలాడుతుందనేది గట్టి నమ్మకం. మూరత్ ట్రేడింగ్ ప్రారంభంతో కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు ఇన్వెస్టర్లు పరిగణిస్తారు. కాబట్టే భారత దేశ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు స్టాక్ ఎక్ఛేంజీలు కార్యకలాపాలు జరగకపోయినా ఈ మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి.
చదవండి👉 '1992 స్కాం' వెబ్ సిరీస్‌లో రాకేష్ ఝున్‌ఝున్ వాలా క్యారక్టర్ ఎవరిదో తెలుసా?
అందుకే మార్కెట్ బంద్ ఉన్నప్పటికీ కూడా ‘మూరతత్’ పేరుతో 6.15 నిమిషాల నుంచి 7.15 నిమిషాల వరకు జరుగుతాయి. ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసిన తర్వాత గుజరాతీలు ఈ మూరత్ ట్రేడింగ్‌లో లాంగ్ టర్మ్‌లో లాభాలు తెచ్చే పెట్టే స్టాక్స్ వారి కుటుంబ సభ్యుల పేరు మీద కొనుగోలు చేస్తుంటారు. అలాగే వాళ్ల నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాలేదని, మూరత్ ట్రేడింగ్ సమయంలో కొన్ని స్టాక్స్ భారీ లాభాల్ని తెచ్చి పెట్టాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment