సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సంవత్ 2076కు శుభారంభాన్నిచ్చాయి. హుషారుగా ప్రారంభమైన కీలక సూచీలు ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో మరింత మెరిసాయి. సెన్సెక్స్ 250 పాయింట్ల మేర ఎగిసింది. చివరకు సెన్సెక్స్ 192 పాయింట్ల లాభంతో 39, 250 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు ఎగిసి11627 వద్ద స్థిరంగా ముగిసాయి. దాదాపు అన్ని ఇండెక్సులూ లాభపడ్డాయి. ప్రధానంగా ఆటో, మెటల్, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ పుంజు కున్నాయి. టాటా మోటార్స్ 17 శాతం, యస్ బ్యాంక్ 6 ఇన్ఫోసిస్ లాభపడగా, వేదాంతా, ఐటీసీ, ఐషర్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, హీరో మోటో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఇన్‌ఫ్రాటెల్, గ్రాసిమ్, ఎయిర్‌టెల్, టైటన్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ, టీసీఎస్ నష్టపోయాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్ సందడి చేశారు. బీఎస్‌ఈ సీఎండీ అశిష్ చౌహాన్ మెమొంటోతో మౌనీ రాయ్‌నుసత్కరించారు. దీపావళి స్పెషల్ ట్రేడింగ్ ప్రారంభానికి ముందు సాంప‍్రదాయబద్ధంగా లక్ష్మీ పూజ నిర్వహించారు.
కాగా నేడు( అక్టోబర్ 28) దీపావళి బలిప్రతిపాద సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. తిరిగి మంగళవారం 29న సాధారణ ట్రేడింగ్ ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment