సాక్షి, ముంబై: దీపావళి అంటే.. ట్రేడర్లకు, ఇన్వెస్టర్లకు ముందుగా గుర్గొచ్చేది ముహూరత్ ట్రేడింగ్. ప్రతీ ఏడాది దీపావళి రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)నిఫ్టీ ప్రత్యేకంగా పని చేస్తాయి. ఈ సెషన్‌ను ముహూరత్ ట్రేడింగ్ అని పిలుస్తారు. పరిమిత కాలంపాటు నిర్వహించే ఈ శుభ ట్రేడింగ్ సందర్భంగా కలిసి వస్తుందనీ, అదృష్టం పండి, సంపద తమ ఖాతాలో చేరుతుందని ఇన్వెస్టర్లు నమ్ముతారు.
ఈ ఏడాది అక్టోబర్ 27 న దీపావళి - లక్ష్మి పూజన్ ఒక గంట పాటు స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ఉంటుంది. ప్రీ-ఓపెనింగ్ సెషన్ సాయంత్రం 6 - 6:08 మధ్య జరుగుతుంది. ప్రారంభ బెల్ వేడుక సాయంత్రం 6.15 గంటలకు, రాత్రి 7.15 వరకు ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇది హిందూ క్యాలెండర్ సంవత్సరం (విక్రమ్ సంవత్ 2076) ప్రారంభంతో సమానం. ఈ 60 నిమిషాల్లో నిర్వహించే ట్రేడింగ్ లాభాల పంట పండిస్తుందని ట్రేడర్ల విశ్వాసం. ఈ సందర్భంగా ట్రేడర్లందరికీ ఆ లక్ష్మీకటాక్షం సంపూర్ణంగా లభించాలని సాక్షి.కామ్ కోరుకుంటోంది. విష్ యూ గుడ్ లక్ ఇన్ అడ్వాన్స్.
గత ఏడాది (నవంబర్ 7, 2018) ముహూరత్ ట్రేడింగ్ నుండి 2019 అక్టోబర్ 22 వరకు సెన్సెక్స్ , నిఫ్టీ వరుసగా 10.56 శాతం, 9.19 శాతం లాభపడ్డాయి. అలాగే బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 4.2 శాతం, 9.57 శాతం క్షీణించాయి. అమెరికా డాలరు, అంతర్జాతీయ ప్రతికూలం వాతావరణం, భారత రూపాయి విలువ క్షీణించిన నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ ధంతేరస్‌కు ప్రతికూలంగా ట్రేడ్ అయింది. బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 35,000 మార్కు కిందికి చేరగా, నిఫ్టీ 10500 మార్కును కోల్పోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment