Assam govt
-
బుల్డోజర్ చర్యపై అస్సాంకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు
కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించిందంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం అసోం ప్రభుత్వానికి ధిక్కార నోటీసు జారీ చేసింది. కామరూప్ మెట్రో డిస్ట్రిక్ట్ పరిధిలోని సోనపుర్ మువాజ ప్రాంతానికి చెందిన 47 మంది పౌరులు దాఖలు చేసిన పిటిషన్‌న్‌పై నేడు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు కూల్చివేతలను ఆపేయాలంటూ, యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. కాగా రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లు, వాటర్‌బాడీస్‌లో ఉన్న నిర్మాణాలను తప్పితే.. మిగిలిన వాటిని కూల్చే ముందు న్యాయస్థానాల అనుమతి తప్పనిసరి అంటూ సెప్టెంబర్ 17న కోర్టు చెప్పింది. అయినా తమ ఇళ్లను కూల్చడంపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాన్ని ఉల్లంఘించి అధికారులు తమ ఇళ్లను కూల్చివేశారని, అలాగే అసోం అడ్వకేట్ జనరల్ సెప్టెంబరు 20న గౌహతి హైకోర్టుకు తమ పిటిషన్లను పరిష్కరించే వరకు తమపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారని పిటిషనర్లు పేర్కొన్నారు. -
Kanika Talukdar: జై కొట్టాల్సిందే!
అస్సాంకు చెందిన కనిక భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కనికకు భవిష్యత్ చీకటిగా కనిపించింది. తాను ఎలా బతకాలి? అనే ఆందోళన మొదలైంది. ధైర్యం ఉంటే అదే దారి చూపిస్తుంది అంటారు. డీలా పడకుండా ధైర్యంగా ఉండడం నేర్చుకుంది. అయిదు వందల రూపాయల పెట్టుబడితో వర్మికంపోస్ట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టిన కనిక ఇప్పుడు లక్షాధికారి అయింది... పెళ్లయిన మూడు సంవత్సరాలకు అస్సాంలోని బోర్జాహర్ గ్రామానికి చెందిన కనికా తలుక్దార్కు బిడ్డ పుట్టింది. బిడ్డ మూడు నెలల వయసులో ఉన్నప్పుడు భర్త అనారోగ్యంతో చనిపోవడం కనికను విషాదసాగరంలోకి నెట్టింది. కళ్ల ముందు పసిపాపే కనిపిస్తుంది. భవిష్యత్ మాత్రం మసకబారిపోయింది. ఆ సమయంలో వర్మికంపోస్ట్ రూపంలో ఒక వెలుగు కిరణం కనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం కృషి విజ్ఞాన కేంద్ర(కేవీకే) నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో వర్మికంపోస్ట్, చేపల పెంపకం, కోళ్ల పెంపకం...మొదలైన వాటి గురించి తెలుసుకుంది కనిక. వర్క్‌షాప్ తాలూకు విషయాలు గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు వర్మికంపోస్ట్ తయారీ సులభం అనిపించింది. ఎందుకంటే ఆవు పేడలాంటి ముడిసరుకులు సేకరించడానికి తాను పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా తన చుట్టుపక్కల అందుబాటులో ఉన్న వనరులతోనే వర్మికంపోస్ట్ తయారుచేయవచ్చు. 2019లో నార్త్ ఈస్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్ రెండు నెలల ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం కనికకు ఎంతో ఉపకరించింది. శిక్షణలో భాగంగా వర్మివాష్ను తయారు చేయడం నేర్చుకుంది. ఇది వర్మికంపోస్ట్ నుంచి తయారుచేసే ద్రవసారం. సాధారణ వర్మికంపోస్ట్ కంటే ఎక్కువ నత్రజని, భాస్వరం..మొదలైనవి ఇందులో ఉంటాయి. అయిదు వందల రూపాయల పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగు పెట్టింది కనిక. కృషి విజ్ఞాన కేంద్ర ఉచితంగా వానపాములను అందించింది. ‘జై వర్మికంపోస్ట్’ బ్రాండ్‌తో వర్మికంపోస్ట్, వర్మివాష్ అమ్మకానికి రెడీ అయింది. తయారీ సంగతి సరే, మరి కొనేవారు ఎవరు? రసాయన ఎరువులకు అలవాటు పడిన రైతులకు వర్మికంపోస్ట్ నచ్చుతుందా? అందుకే తన ఉత్పత్తికి తానే ప్రచారకర్తగా మారింది. వర్మికంపోస్ట్ వాడకం వల్ల నేలకు జరిగే మేలు ఏమిటో ఊరూరా తిరుగుతూ ప్రచారం చేసింది. ఆమె శ్రమ వృథా పోలేదు. వ్యాపారం అడుగుల స్థాయి నుంచి పరుగుల స్థాయికి చేరుకుంది. పేడ కోసం మొదట రెండు ఆవులను కొన్న కనిక ఆ తరువాత నాలుగు ఆవులను ఒకేసారి కొనగలిగే స్థాయికి చేరింది. ఒకప్పుడు ‘జై’ కంపెనీ ఒక సంవత్సరంలో 800 కిలోల వర్మికంపోస్ట్‌ను ఉత్పత్తి చేసేది. ప్రస్తుతం అది నెలకు 35 టన్నుల స్థాయికి చేరుకుంది. అస్సాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో పాటు మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌లో ఎన్నో నర్సరీలు జై ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి. వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా అద్భుత విజయం సాధించిన కనిక ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విద్యార్థుల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (అస్సాం) ప్రతి నెల కనికతో అవగాహన తరగతులు నిర్వహిస్తోంది. ‘ఇది కలలో కూడా ఊహించని విజయం. ఎలా బతకాలో అని భయపడిన నేను ఎంతోమందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. ఎలా బతకాలో తెలియక ఒకప్పుడు ధైర్యం కోల్పోయిన నేను ఇప్పుడు ఎంతోమందికి ధైర్యం చెబుతున్నాను. ఈ విశాలమైన ప్రపంచంలో మన కోసం ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాటిలో ఒకటి అందిపుచ్చుకున్నా మన జీవితమే మారిపోతుంది’ అంటుంది నలభై అయిదు సంవత్సరాల కనికా తలుక్దార్. -
సినిమా కోసం ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్‌డే లీవ్
Assam Govt Employees To Get Half-Day Leave To Watch The Movie: ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ఇటీవల తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. సీనీ, రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా ఈ సినిమాని ప్రశంసించారు. ఇటీవల జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న మోదీ.. ఈ సినిమా చూడాలంటూ ఎంపీలకు, బీజేపీ నాయకులకు సూచించాడు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటకతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ‘ది కశ్మీర్ ఫైల్స్’పై వినోదపు పన్నును తొలగించింది. ఇదిలా ఉంటే తాజాగా..ఈ సినిమా చూడడం కోసం అస్సాం ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు ప్రకటించి ఆశ్చరపరిచింది. ఈ సినిమా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్‌డే లీవ్ ప్రకటించింది. సినిమా చూసిన తదుపరి రోజు పై అధికారికి సినిమా టికెట్ చూపించి, లీవ్ అప్లై చేస్తే హాప్డే లీవ్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఒక సినిమా కోసం ప్రభుత్వమే స్వయంగా సెలవును ప్రకటించడం విశేషం. 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వికేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. -
Assam Home Guard: నిజాయితీకి దక్కిన సత్కారం
గువాహటి: కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాల సరఫరాలో తమకు సహకరిస్తే భారీ నజరానా ఇస్తామని డ్రగ్ డీలర్లు ఆశజూపినా.. నిజాయితీకే కట్టుబడ్డాడు ఆ హోం గార్డు. అతని నిజాయతీకి, నిఖార్సయిన విధి నిర్వహణకు ప్రతిఫలంగా అస్సాం ప్రభుత్వం ఆయనను కానిస్టేబుల్ ఉద్యోగంతో సత్కరించింది. శనివారం ఆ హోంగార్డు బోర్సింగ్ బేకు కానిస్టేబుల్ నియామక పత్రాన్ని రాష్ట్ర సీఎం హిమంత స్వయంగా అందజేశారు. జూన్ 21న కార్బి అంగ్లాంగ్ జిల్లాలోని ఓ చెక్‌పోస్టు వద్ద మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోంది. అక్కడే విధుల్లో ఉన్న హోం గార్డు బస్సులో అక్రమ రవాణాను పసిగట్టాడు. అయితే, పోలీసులను ఏమార్చేందుకు, తమకు సాయపడేందుకు ఒప్పుకుంటే భారీ స్థాయిలో లంచమిస్తామని హోం గార్డు బోర్సింగ్కు డ్రగ్ డీలర్లు ఆశపెట్టారు. అందుకు బోర్సింగ్ ససేమిరా ఒప్పుకోలేదు. బస్సులో ఉన్న రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులకు సాయపడ్డాడు. దీంతో, హోం గార్డు నిజాయతీకి మెచ్చి సీఎం అతనికి కానిస్టేబుల్ ఉద్యోగనియామక పత్రం అందజేశారు. -
డీఎస్పీగా హిమదాస్
భారత యువ అథ్లెట్ హిమ దాస్‌ను ప్రోత్సహిస్తూ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఉద్యోగం ఆఫర్ చేసింది. ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించిన ఈ అమ్మాయి ప్రస్తుతం 400 మీటర్ల పరుగు జూనియర్ విభాగంలో ప్రపంచ చాంపియన్ కూడా. -
వరదసాయంలో శానిటరీ ప్యాడ్స్ ఎక్కడ?!
ప్రశ్నించడంలోనే ప్రగతి ఉంది. ప్రశ్నిస్తేనే పరిష్కారం ఉందని నమ్ముతుంది మయూరి భట్టాచార్జీ. అస్సాంలోని లక్షాలాది మహిళల తరపున తన గళం విప్పుతోంది. విషయం ఏంటంటే.. అస్సాంలో ప్రతీ యేటా వరద తాకిడి ఉదృతంగా ఉంటుంది. ఎన్నో ప్రాంతాలు జలమయం అవుతూనే ఉంటాయి. లక్షలాది మంది నిరాశ్రయులు అవుతుంటారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించే వరద సాయంలో నిత్యావసరాలు ప్రజలకు అందుతుంటాయి. అయితే, ఆ జాబితాలో లక్షలాది మంది మహిళలు ఎదుర్కొనే నెలసరి సమస్యకు శానిటరీ ప్యాడ్స్ ఉండితీరాల్సిందే అని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతోంది మయూరి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ‘ఛేంజ్’(change.org)వెబ్సైట్ ద్వారా అస్సాం మహిళల తరపున పిటిషన్ దాఖలు చేసింది. దీనికి ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది మయూరి భట్టాచార్జీకి సపోర్టర్స్‌గా చేరారు. మయూరి భట్టాచార్జీ ప్యాడ్స్ లేకపోవడం సమస్య కాదా..! అస్సాంలోని తేజ్‌పూర్‌కు చెందిన భట్టాచార్జీ విపత్తు సమయంలో ఆదుకునేవారికి జాబితాలో శానిటరీ ప్యాడ్లను చేర్చాలని విదేశాంగ మంత్రి హేమంత్ బిస్వా శర్మను కోరారు. మహిళలకు సహాయ శిబిరాలలో స్థానం ఇచ్చినప్పుడు, వారికి శానిటరీ ప్యాడ్ల సౌకర్యం ఉండటం లేదు. దీని వల్ల మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఆగస్టు 21 న ప్రచురించిన రోజువారీ వరద నివేదిక ప్రకారం, అస్సాంలో వరదలు 30 జిల్లాల్లో 56.9 లక్షలకు పైగా ప్రజలను ప్రభావితం చేశాయి. ఒక్క వస్త్రమూ శుభ్రంగా ఉండదు.. కార్యకర్త మయూరి భట్టాచార్జీ రిలీఫ్ కిట్లలో శానిటరీ ప్యాడ్లను చేర్చాలని ఛేంజ్ ద్వారా పిటిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మయూరి మాట్లాడుతూ –‘ప్రతి యేటా అస్సాంలో వరదలతో బాధపడుతున్న లక్షలాది మంది బాలికలు, మహిళల తరపును నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇక్కడ వరద నీరు వచ్చినప్పుడు, ఇంట్లో ఒక్క వస్త్రం కూడా శుభ్రంగా, పొడిగా ఉండదు. ఈ మహిళలకు సహాయ శిబిరంలో స్థానం ఇచ్చినప్పుడు, వారికి శానిటరీ ప్యాడ్ల సౌకర్యం లేదు. అలాగే టాయిలెట్ల నిర్వహణ సరిగ్గా ఉండదు. ఇలాంటప్పుడు ఎంత వ్యధ.. ఈ సమస్యను అర్ధం చేసుకోరేంటి. ఈ వరదలతో మహిళలు అన్ని సమస్యలతో పాటు, శానిటరీ ప్యాడ్లు లేకపోవడం అనే ప్రధాన సమస్యనూ ఎదుర్కొంటున్నారు. ఇది ఎందుకు సమస్యగా ప్రభుత్వాలకు పట్టడం లేదు. వరదల కారణంగా కాలాలు ఆగవు. శానిటరీ ప్యాడ్లను రిలీఫ్ మెటీరియల్ జాబితాలో చేర్చడానికి మనం ఎన్నాళ్లు ఎదురుచూడాలి?!’ అని ప్రశ్నిస్తోంది మయూరి భట్టాచార్జీ. ఈ విషయమ్మీద నిరంతరం రాష్ట్ర మంత్రికి ఇ–మెయిల్ చేస్తూనే ఉంది. కానీ స్పందన రావడంలేదు. దీంతో మయూరి ఈ పిటిషన్‌ను ప్రారంభించింది. త్వరలోనే దీనికి రాష్ట్రప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. విపత్తుల సమయాల్లో మహిళల నెలసరి సమస్యనూ పరిగణనలోకి తీసుకోవాలి అని మయూరి భట్టాచార్జీ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేస్తుంది. -
‘ఖేల్‌రత్న’కు హిమదాస్
న్యూఢిల్లీ: భారత యువ స్ప్రింటర్ హిమదాస్ ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ అవార్డు బరిలో నిలిచింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్‌రత్న’ కోసం 20 ఏళ్ల హిమదాస్ పేరును కేంద్ర క్రీడాశాఖకు అస్సాం ప్రభుత్వం సిఫారసు చేసింది. దీంతో ఈ ఏడాది ఈ అవార్డు బరిలో నిలిచిన పిన్న వయస్కురాలిగా హిమ ఘనత వహించింది. 2018లో అద్భుతంగా రాణించిన హిమ.... ఫిన్లాండ్లో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400మీ.ఈవెంట్లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఇదే చాంపియన్‌షిప్‌లో 4్ఠ400 రిలేలో మరో స్వర్ణం, మిక్స్డ్ రిలేలో రజతం ఆమె ఖాతాలో చేరాయి. ఆ తర్వాత 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 4్ఠ400మీ. మహిళల రిలేలో పసిడిని గెలుపొందింది. ప్రస్తుతం ఆమె ఈ అవార్డు కోసం నీరజ్ చోప్రా (జావెలిన్ త్రోయర్), వినేశ్ ఫొగాట్ (రెజ్లర్), మనికా బత్రా (టీటీ), రాణి రాంపాల్ (హాకీ), రోహిత్ శర్మ (క్రికెట్)లతో పోటీపడనుంది. -
సంచలన పథకం : పెళ్లికుమార్తెకు తులం బంగారం
సాక్షి, గువహటి : అసోం ప్రభుత్వం సంచలన పథకాన్ని ప్రవేశపెట్టింది. బాలికలను చదువుల దిశగా ప్రోత్సహించేందుకు వినూత్నంగా ఆలోచించింది. రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోయే ప్రతి వధువుకు 10 గ్రాముల బంగారం కానుకగా అందించేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘అరుంధతి బంగారు పథకం’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా బాల్యవివాహాల నిరోధం, మహిళా సాధికారత లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఇది 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మ బుధవారం వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించి కొన్ని విధివిధానాలు కూడా మంత్రి ప్రకటించారు. రూ. 30 వేల నగదును ప్రభుత్వం వధువు అకౌంట్లో డిపాజిట్ చేయనుంది ప్రభుత్వం. ఇకపై ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో..అప్పుడు ఉన్న బంగారం ఖరీదును బట్టి..పథకం ద్వారా ఇచ్చే నగదులో మార్పులు ఉంటాయి. ఇది మొదటి వివాహ సందర్భంగా మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్న ఈ పథకంలో ప్రాథమికంగా టీ గార్డెన్, ఆదివాసీ గిరిజనులకు కనీస విద్యార్హత నిబంధనను సడలిస్తున్నట్టు మంత్రి తెలిపారు. 1954 ప్రత్యేక వివాహ (అసోం) నిబంధనల ప్రకారం వివాహాలను అధికారికంగా నమోదు చేసిన తరువాత ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు. అర్హతలు: కనీస వివాహ వయస్సు వధువు (18), వరుడు (21) ఏళ్లు ఉండాలి.. వధువు కనీసం 10వ తరగతి వరకు చదువుకొని ఉండాలి. వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయించాలి. వధువు సంరక్షకులు (తండ్రి, తల్లి) వార్షిక ఆదాయం రూ. 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి. -
కదలిన అస్సాం తేనెతుట్టె
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాల పర్యవసానంగా తమ భవితవ్యం ఏమవుతుందోనని అక్కడ స్థిరపడిన మన వృత్తి నిపుణులు ఆందోళన పడుతున్న తరుణంలో ఈశాన్య భారతంలోని అస్సాం జనాభాలో ఈ దేశ పౌరులెందరు, ‘ఇతరులు’ ఎందరని ఆరా తీసే ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. సోమవారం విడుదల చేసిన జాతీయ పౌర గుర్తింపు(ఎన్ఆర్సీ) తుది ముసాయిదా ప్రకారం ఆ రాష్ట్రంలోని 2 కోట్ల 89 లక్షల83 వేల 677మంది ఈ దేశ పౌరులని, మిగిలిన 40.07 లక్షలమంది విదేశీయులని నిర్ధారణ చేశారు. ఇది తుది ముసాయిదాయే తప్ప తుది జాబితా కాదని భారత రిజిస్ట్రార్ జనరల్ శైలేష్తోపాటు అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ కూడా ప్రక టించారు. అయితే ఇలాంటి ప్రకటనలు ‘దేనికీ చెందని’ లక్షలాదిమందిని కుదుటపరచలేవు. వారు ఈ జాబితాలో చోటు సంపాదించుకోవటం కోసం కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. అడిగిన ఆధారాలన్నిటినీ జత చేయాలి. తమ పూర్వీకులు ఈ దేశ పౌరులేనని చెప్పడానికి 1951 లేదా 1971నాటి గుర్తింపు పత్రాలను అందజేయాలి. ఎందుకంటే... ఆ రాష్ట్రంలో 1951లో తొలి ఎన్ఆర్సీ రూపొందగా 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి, అస్సాం ప్రభుత్వానికి, ఉద్యమ నాయకులకు మధ్య కుదిరిన ఒప్పందంలో రెండో ఎన్ఆర్సీకి 1971 మార్చి 24ను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణ యించారు. అయితే తాము అవసరమైన పత్రాలన్నీ జత చేసినా పేర్లు గల్లంతయ్యాయని చెబుతున్న వారున్నారు. తమ కుటుంబంలో కొందరి పేర్లు జాబితాలో ఉన్నా మరికొందరివి లేవని ఆందోళన పడుతున్నవారున్నారు. 40.07 లక్షలమందిలో అత్యధికులు ముస్లింలు అయి ఉండొచ్చుగానీ, కొందరు హిందువులకూ జాబితాలో అన్యాయం జరిగిందని ఆరోపణలొస్తున్నాయి. అంతర్జాతీయ ఒడంబడికలు ఏం చెబుతున్నా మన దేశంలో పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యత ప్రజానీకానిదే. తాతముత్తాతల నుంచి సాగుచేసుకుంటున్న పొలం నీది కాదంటే ఎవరికైనా కాళ్ల కింది భూమి కదిలిపోతుంది. కుటుంబం మొత్తం అల్లకల్లోలమవుతుంది. అలాంటిది దశాబ్దాలకిందట అస్సాం కొచ్చి స్థిరపడినా, తరాలు గడిచిపోయినా ‘మీరు విదేశీయుల’ంటూ ముద్ర వేస్తే వారు ఏమైపోతారో సులభంగానే అర్ధం చేసుకోవచ్చు. పైగా ఆ రాష్ట్రం జాతి సమస్యతో అట్టుడికిన చరిత్రగల అత్యంత సున్నితమైన ప్రాంతం. 1979–85 మధ్య ఆ రాష్ట్రంలో మహోధృతంగా సాగిన ఉద్యమానికి ప్రధాన కారణం వలసలే. విదేశీయులను గుర్తించి వారిని తక్షణం పంపేయాలన్నది ఆ ఉద్యమం ప్రధాన డిమాండు. ఆ తర్వాతే అక్రమ వలసదారుల గుర్తింపు కోసం పౌరసత్వ గణన చేయాలన్న నిర్ణయం జరిగింది. అయితే ఉద్యమనాయకులే అనంతరకాలంలో అధికారంలోకొచ్చినా అస్సాంలో ఎన్ఆర్సీ పని మొదలుపెట్టలేకపోయారు. అటు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలదీ ఇదే వరస. 2010 వరకూ నత్తనడకన సాగిన పని కాస్తా ఆ తర్వాత ఆగిపోయింది. చివరకు 2014లో దాఖలైన పిటి షన్తో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని గడువు నిర్ణయించింది. ఇన్నాళ్లకు ఎన్ఆర్సీ తుది ముసాయిదా సిద్ధమైంది. ఈ ముసాయిదాలో పేర్లు లేని 40 లక్షలమందీ సెప్టెంబర్ ఆఖరుకల్లా విదేశీయులేనని నిర్ధారణ అయితే వారు ‘రాజ్యం లేని పౌరులు’గా మారతారు. అలా ముద్రపడినవారి విషయంలో ఏం చేస్తారన్న స్పష్టత ఇప్పటికైతే లేదు. వారిని స్వీకరించమని బంగ్లాదేశ్‌ను కోరతారా, ప్రత్యేక శిబి రాలు పెట్టి తరలిస్తారా అన్నది చూడాల్సి ఉంది. పౌరసత్వాన్ని నిరూపించుకోలేనివారు బంగ్లాదేశీ యులేనని ప్రభుత్వం భావిస్తున్నా, వారిని వెనక్కి తీసుకోవాలని ఇంతవరకూ కేంద్రం అధికారికంగా బంగ్లాదేశ్‌ను కోరలేదు. తమ పౌరులెవరూ భారత్‌లో లేరని ఇప్పటికే బంగ్లా ప్రకటించింది. నలభై లక్షలమంది జనాభా అంటే మాటలు కాదు. ఈ స్థాయి జనాభా కలిగిన దేశాలు ప్రపంచంలో వంద వరకూ ఉన్నాయి. అస్సాంలో 60, 70 దశకాల్లో ‘బొంగాల్ ఖేదా’(బెంగాలీలను బహిష్కరించండి) నినాదంతో సాగిన ఉద్యమం పర్యవసానంగా ఏళ్ల తరబడి ఉంటున్న వేలాదిమంది బెంగాలీలు ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు వదులుకుని ప్రాణభయంతో పశ్చిమబెంగాల్‌కి వెళ్లాల్సి వచ్చింది. అస్సాం ఉద్యమం సమయంలో 1983లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నించి నప్పుడు నౌగాన్ జిల్లాలోని దాదాపు 14 గ్రామాలపై అల్లరి మూక విరుచుకుపడి వేలాదిమందిని ఊచకోత కోసింది. ఈ ఊచకోతలో ప్రాణాలు కోల్పోయినవారికి సంబంధించి నేటికి కూడా అధి కారిక లెక్కలు వెల్లడి కాలేదు. పదివేలమంది మరణించి ఉంటారని అనధికార అంచనా. ఎన్ని దశాబ్దాలు, ఎన్ని శతాబ్దాలు అన్న తేడా తప్ప వలసల ప్రమేయం లేకుండా ఏర్పడిన దేశాలు ఈ ఆధునిక ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అయితే ఎక్కడినుంచో కొత్తగా వచ్చి స్థిరపడిన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూ పోతుంటే, వనరులపై వారి ఆధిపత్యం పెరుగుతుంటే స్థానికుల్లో ఆందోళన రాజుకోవటం సహజం. ఈ వైరుధ్యాన్ని సకాలంలో గుర్తించి పరిష్కరించకపోతే అది క్రమేపీ ఉగ్రరూపం దాలుస్తుంది. ఉపేక్షిస్తే అది పరస్పర హననానికి, ఇతర వైపరీత్యాలకు దారి తీస్తుంది. అస్సాంలో టీ ప్లాంటేషన్లలో పనిచేయించడానికి 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు తెలుగునాట ఏజెన్సీ ప్రాంతాలతో మొదలుపెట్టి బిహార్, బెంగాల్ వగైరా రాష్ట్రాల నుంచి వేలా దిమందిని తరలించారు. అలా వెళ్లినవారిలో బెంగాలీ హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. అహోం, కలిత, చౌతియా తదితర జాతులవారు అస్సామీలుకాగా, కూలీలుగా వెళ్లి తరతరాలుగా స్థిరపడ్డవారు ఈనాటికీ అస్సామేతరులన్న ముద్రతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు అస్సాంతో అయిపోలేదు. తమ రాష్ట్రాల్లోనూ ఎన్ఆర్సీ గణన ప్రారంభించాలని మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో డిమాండ్లు బయల్దేరాయి. కనుకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత జాగురూకతతో వ్యవహ రించాలి. మయన్మార్‌లో రోహింగ్యాలు చవిచూస్తున్న దుర్భర పరిస్థితులు ఇక్కడ ‘విదేశీయులు’గా ముద్రపడినవారికి ఎదురుకాకుండా చూడాలి. మన దేశానికి అప్రదిష్ట కలగకుండా సామరస్యపూర్వ కంగా పరిష్కరించాలి. -
అసోంలో ప్రైవేట్ స్కూళ్లకు ముకుతాడు
గువాహటి: తమ వద్ద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వేతర పాఠశాలలకు ముక్కుతాడు వేసేందుకు అసోం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేరుగా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదేశాలు జారీచేయగల ప్రత్యేక చట్టాన్ని తీసుకురానుంది. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థులనుంచి అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేయడమే కాకుండా వారికి ఎంతో శ్రమకూర్చి విద్యాబోధన చేసే టీచర్లకు చాలిచాలని జీతభత్యాలు ఇవ్వడం, అవి కూడా సరైన సమయానికి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం, ఒక్కోసారి ఎగవేతలకు పాల్పడటంవంటి చర్యలకు తమ చట్టం ద్వారా స్వస్థి పలకనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రశ్నోత్తర సమయంలో అసోం గణ పరిషత్ ఎమ్మెల్యే కేషాబ్ మహంత అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి శరత్ బోర్కోటోకి బదులిచ్చారు.